నలభైఎనిమిదవ భాగము
నిత్యాద్వయవిధివివరణం
ఈమెనే శ్రీకులసుందరీ అని కూడా అంటారు. బాలా అను పేరు గల ఈ త్రిపురేశ్వరీ పూర్వ సింహాసనమున ఉండును. శ్రీకులసుందరి బ్రహ్మ, విష్ణు, మహేశాదులతో పూజింపబడుచుండును. ఈమె పురుషార్థప్రదాయిని.
మంత్ర స్వరూపము:
త్రిపురేశీ నిత్యా భారతీ హూం హూం హూం ద్రాం
ద్రాం
రెండవ నిత్య పంచబాణములనుండి పంచాక్షరీ
మంత్రము: ద్రాం ద్రాం ద్రాం ద్రాం ద్రాం
ఈ విద్యా యంత్రము, ఋష్యాదులు త్రిపురేశీ క్రమంలో ఉండును.
ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు
విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు,
శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల
ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ
శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన
అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన నిత్యాద్వయవిధివివరణం
అను నలభైఎనిమిదవ భాగము సమాప్తము.
నలభైతొమ్మిదవ భాగము
నీలపతాకావిధివివరణం
మంత్రస్వరూపం:
ఓం నమః కామేశ్వరి కామాంకుశే కామపతాకే భగవతి
నీలపతాకే భగవతి నమోస్తు|
పరమగుహ్యే హ్రీం హ్రీం హ్రీం మదనే మదనదేహే త్రైలోక్యపరమవశ్యే హుం ఫట్ స్వాహా|
ఈ మంత్రము 60 అక్షరముల మంత్రము. ఈ విద్యా
యంత్రము కామేశ్వరీ యంత్రమునకు సమానము.
ధ్యానం:
రక్తాం రక్తాంశుకప్రౌఢాం నానారత్నవిభూషితామ్|
ఇంద్రనీలస్ఫురన్నీలపతాకాం కమలే స్థితామ్||
కాచగ్రైవేయసంలగ్నసృణిం చ వరదాభయే||
దధతీం పరమేశానీం త్రైలోక్యాకర్షణక్షమామ్||
మూలమంత్రము నాలుగు లక్షలు జపించి అందులో దశాంశము
తిలలుతో హోమం చెయ్యాలి. పూజను కామేశ్వరీ క్రమంలో చెయ్యాలి.
ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు
విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు,
శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల
ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ
శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన
అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన నీలపతాకావిధివివరణం అను
నలభైతొమ్మిదవ భాగము సమాప్తము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి