నలభైఆరవ భాగము
శివదూతీనిత్యావిధివివరణం
మంత్రస్వరూపము:
హ్రీం శివదూత్యై నమః
ఈ విద్య త్రైలోక్యమునకు స్వామిని. ఋషి – రుద్ర| ఛందస్సు – గాయత్రి| దేవతా – శివా| హ్రీం – బీజం| నమః – శక్తిః| శివదూతీ -కీలకం| హ్రీం, శివదూతీ, నమః – రెండు ఆవృత్తములతో షడంగన్యాసం చెయ్యాలి.
ధ్యానం:
దూర్వానిభా త్రినేత్రా చ మహాసింహాసమాసనా|
శంఖారిచాపబాణాంశ్చ సృణిపాశౌ వరాభయే||
మూలమంత్రమును ఏడు లక్షలు జపించాలి. తిలలు, నెయ్యి, మధువు కలిపి జపంలో దశాంశము హోమము
చెయ్యాలి.
యంత్రము: అష్టదళ కమలము, భూపురము
యంత్రమధ్యలోకి దేవిని ఆహ్వానించి ఉపచారములతో
పూజించాలి. ఆ తర్వాత అంగదేవతలను పూజించి అష్టపత్రములో జయా, విజయా, కీర్తి, ప్రీతి, ప్రభా, శ్రద్ధా, మేధా, ధృతిలను పూజించాలి. భూపురములో
అష్టదిక్పాలకులను పూజించాలి. ఆ తర్వాత దేవిని మళ్ళీ పూజించాలి.
ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు
విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు,
శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల
ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ
శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన
అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన శివదూతీనిత్యావిధివివరణం
అను నలభైఆరవ భాగము సమాప్తము.
నలభైఏడవ భాగము
త్వరితానిత్యావిధివివరణం
మంత్ర స్వరూపము:
ఓం హ్రీం హూం ఖేం చేం ఛేం క్షుః స్త్రీం హూం
క్షేం హ్రీం ఫట్
పన్నెండు అక్షరముల ఈ మంత్రము భోగమోక్ష ఫలదాయకము.
ఈ మంత్ర ఋషి – ఈశ్వర| ఛందస్సు – విరాట్| దేవత – త్వరిత| స్త్రీం – బీజం| స్త్రీం – శక్తిః| హ్రీం – కీలకం| చచ్ఛే, చచ్ఛే, ఛేక్షు, క్షస్త్రీం స్త్రీం, హూంక్షేం, క్షేం – షడంగన్యాసం|
ధ్యానం:
శ్యామాఙ్గీం రక్తసత్పాణిచరణాంబుజశోభితాం|
వృషలాహిసుమంజీరాం కంఠరత్నవిభూషితామ్||
స్వర్ణాంశుకాం స్వర్ణభూషాం
వైశ్యాహిద్వంద్వమేఖలాం|
తనుమధ్యాం పీనవృత్తకుచయుగ్మాం వరాభయే||
దధతీం శిఖిపిచ్ఛానాం వలయాంగాదశోభితాం|
గుంజారుణాం నృపాహీశకేయూరాం రత్నభూషణాం||
ద్విజనాగస్ఫురత్కర్ణభూషాం మత్తారుణేక్షణామ్|
నీలకుంచితధమ్మిల్లవనపుష్పాం కపాలినీం||
కైరాతీం శిఖిపత్రాఢ్యనికేతనవిరాజితాం|
స్ఫురత్సింహాసనప్రౌఢాం స్మరేద్భయవినాశినీం||
మంత్రమును 12లక్షలు జపించి అందులో దశాంశము మధూక
పుష్పములతో హోమము చెయ్యాలి. ఈ విధంగా సాధకుడు పురశ్చరణ కర్త అవుతాడు.
యంత్రము: అష్టదళము, భూపురము.
ఈ చక్రము సర్వరక్షాకర చక్రము. చక్రమధ్యలోకి
మహేశానిని ఆహ్వానించి ఉపచారములతో పూజించాలి. అంగావరణ పూజచేసి అష్టదళములలో హూంకారీ, ఖేచరీ, చండా, ఛేదనీ, క్షేపణీ, స్త్రీ, హుంకారిణీ, క్షేమకారిణీలను పూజించాలి. ఆతర్వాత
లోకములను శ్రీం బీజముతో పూజించి,
భూపురములో లోకపాలకులను పూజించాలి. యంత్ర అగ్రభాగమున శరములు, ధనస్సు కలిగిన ఫట్కారిణీని పూజించాలి.
ఆ తర్వాత ద్వార రెండు పార్శ్వములందు విజయ మరియు జయలను పూజించాలి. యంత్ర సమీపమున
కింకరుని పూజించాలి. వీనికి బయట ధాతా, విధాతలను పూజించి మళ్ళీ దేవిని పూజించాలి.
ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు
విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు,
శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల
ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ
శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన
అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన త్వరితానిత్యావిధివివరణం
అను నలభైఏడవ భాగము సమాప్తము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి