నలభైనాల్గవ భాగము
వహ్నివాసినీనిత్యావిధివివరణం
మంత్ర
స్వరూపం: హ్రీం వహ్నివాసిన్యై నమః|
ఎనిమిది అక్షరముల ఈ మంత్రము పురుషార్థప్రదాయిని. ఈ మంత్ర ఋషి – వశిష్ఠ| ఛందస్సు – గాయత్రి| దేవత – వహ్నివాసిని| హ్రీం – బీజం| నమః – శక్తిః| వహ్నివాసిని – కీలకం| దేవీ మంత్రముతో షడంగన్యాసం చెయ్యాలి.
ధ్యానం:
ధ్యాయేత్తప్తసువర్ణాభాం
నానాలంకారభూషితామ్|
పాశాంకుశౌ
స్వస్తికంచ శక్తిం చ వరదాభయౌ|
దధతీం
రత్నముకుటాం త్రైలోక్యతిమిరాపహమ్||
మంత్రములో ఎన్ని వర్ణములున్నాయో అన్ని లక్షలు
జపము చేసి, అందులో దశాంశము నెయ్యి
కలిపిన అన్నముతో హోమం చెయ్యాలి. దీనితో మంత్ర సిద్ధి కలుగుతుంది.
యంత్రము: అష్టదళము, భూపురము.
అష్టదళములలో ఒకొక్క దళములో ఒకొక్క మంత్ర
వర్ణమును లిఖించాలి. మధ్యలో పీఠపూజ చేసి ఎనిమిది దిక్కులు మరియు మధ్యలో ఈ క్రింది
దేవతలను పూజించాలి.
పార్వతి, పీతా, శ్వేతా, అరుణా, కృష్ణా, ధూమ్రా, తీవ్రా, స్ఫులింగినీ, ఆతురా, జ్వాలినీ.
ఆ తర్వాత సింహాసనమును పూజించాలి. ఆ
సింహాసనములోకి దేవిని ఆహ్వానించి ఉపచారములతో అర్చించాలి. ముందు అంగదేవతలను
అర్చించిన తర్వాత, అష్టదళములో జాతవేదా, సప్తజిహ్వా, హవ్యవాహనా, అశ్వోదరభవ, వైశ్వానర, కౌమారతేజా, విశ్వముఖ/దేవేశి, దేవముఖలను పూజించాలి. అష్టపత్రములలోనే
బ్రాహ్మ్యాది మాతృకలను పూజించాలి. భూపురములో ఇంద్రాది దేవతలను పూజించాలి. ఆ తర్వాత
మళ్ళీ దేవతను పూజించాలి.
ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు,
కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు
మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ
ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ
అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము
చేసిన వహ్నివాసినీనిత్యావిధివివరణం అను నలభైనాల్గవ భాగము సమాప్తము.
నలభైఅయిదవ భాగము
మహావిద్యేశ్వరీవిధివివరణం
మంత్ర స్వరూపము: ఓం నిత్యక్లిన్నే మదద్రవే హ్రీం
స్వాహా ఫ్రం సః
ఋషి – బ్రహ్మ| ఛందస్సు – గాయత్రి| దేవత – పరమేశ్వరి| ఓం – బీజం| సః – శక్తిః| హ్రీం – కీలకం| క్లిం, నిం, నిం, నిం, నిం, నిం, - షడంగన్యాసం చెయ్యాలి.
ధ్యానం:
జపాకుసుమసంకాశం రక్తాంశుకవిరాజితామ్|
మాణిక్యభూషణాం నిత్యాం నానాభూషణభూషితాం||
పాశాంకుశౌ కపాలం చ సుధాపానవిఘూర్ణితాం|
అభయం దధతీం ధ్యాత్వా చతుర్లక్షం జపేత్సుధీః||
మంత్రమును నాలుగు లక్షలు జపించి అందులో దశాంశము
తిలతండులముతో హోమము చెయ్యాలి.
యంత్రము:
త్రికోణ, చతుర్దళ, అష్టదళ, భూపురము
త్రికోణ మధ్యలో దేవిని పూజించి, అంగపూజ చెయ్యాలి. ఆ తర్వాత త్రికోణములో
బ్రాహ్మణీ, వైష్ణవీ, రౌద్రీలను పూజించాలి. చతుర్దళములో
వేదమాత, హృల్లేఖ, యోగినీ, చంద్రశేఖరలను పూజించాలి. అష్టపత్రములో
నిత్యా, నిరంజన, క్లిన్నా, క్లేదినీ, మదనాతురా, మదద్రవా, ద్రావిణీ, క్షోభిణీలను పూజించాలి. భూపురములో
లోకపాలకులను పూజించాలి.
ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు
విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు,
శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల
ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ
శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన
అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన మహావిద్యేశ్వరీవిధివివరణం
అను నలభైఅయిదవ భాగము సమాప్తము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి