సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

31, అక్టోబర్ 2022, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 40-41

 

కామేశ్వరీనిత్యావిద్యావివరణం

ఈ విద్య 36 అక్షరముల విద్య. ఈ మంత్ర స్వరూపము ఈ క్రింది విధంగా ఉంటుంది.

“హ్ల్క్షౌం ఓం ఓం ఓం నమః కామేశ్వరిచ్ఛా కామఫలప్రదే సర్వసత్త్వవశంకరి సర్వజగత్ క్షోభకరి హూం హూం హ్ల్క్షౌం”

మంత్రము యొక్క మొదటి మూడుభాగములనూ రెండు ఆవృత్తములుగా షడంగన్యాసము చెయ్యాలి. ఈ విద్యా ఋషి, యంత్రము, ధ్యానము, అర్చన కామేశ్వరీ క్రమంలో చెయ్యాలి.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన కామేశ్వరీనిత్యావిద్యావివరణం అను నలభైవ భాగము సమాప్తము.

నలభైఒకటవ భాగము

భగమాలినీనిత్యావిధివివరణం

మంత్ర స్వరూపము:

ఐం భగభుగే భగిని ఐం భగోదరి ఐం భగమాలే ఐం భగావహే ఐం భగగుహ్యే ఐం భగయోనే ఐం భగనిపాతిని ఐం భగసర్వే ఐం భగవశంకరి ఐం భగరూపే ఐం భగనిత్యే ఐం భగక్లిన్నే ఐం భగరూపే ఐం సర్వాన్ భగాన్ మే వశమానయ ఐం భగవతి ఐం భగవదే ఐం భగవాక్ మే భగరేతే ఐం భగక్లిన్నే ఐం భగక్లిన్నద్రవే ఐం భగం క్లేదయ భగం ద్రావయ భగామోఘే భగవిచ్చే భగం క్షోభయ ఐం సర్వసత్త్వభగేశ్వరి ఐం భగం ఐం భగమోం ఐం భగబ్లూం ఐం భగక్లిన్నే ఐం సర్వాన్ భగాన్ మే వశమానయ ఏం ఏం ఏం ఏం ఏం క్లీం ఐం భగాన్తరే ఐం భగాన్తే ఐం భగమాలిని ఐం ఏం ఏం ఏం ఏం ఏం క్లీం క్లీం క్లీం క్లీం క్లీం భగమాలిన్యై త్రైలోక్యవశకారిణ్యై (నమః) స్వాహా| ఈ మంత్రము 224 అక్షరముల మంత్రము.

ఈ విద్య సకల సిద్ధిదాయకము. ఈ మంత్ర ఋషి సుభగ| ఛందస్సు – గాయత్రి| దేవత – భగమాలిని| హరబ్లేం – బీజం| స్త్రీం – శక్తిః| బ్లూం – కీలకం| ఆరు దీర్ఘ స్వరములతో (ఆం, ఈం, ఊం, ఐం, ఔం, అః) షడంగన్యాసం చెయ్యాలి. కామన్యాసము, బాణన్యాసములు కూడా చెయ్యాలి.

ధ్యానం:

కదంబవనమధ్యస్థాముద్యత్సూర్యసముద్యుతిమ్|

నానాభూషణసంపన్నాం త్రైలోక్యాకర్షణక్షమామ్||

పాశాంకుశౌ పుస్తకంచ తౌలికాం నఖలేఖనీం|

వరదంచాభయం చైవ దధతీం విశ్వమాతరం||

పైవిధంగా ధ్యానం చేసిన తర్వాత మితాహారము తీసుకొంటూ మంత్రమును ఒక లక్ష జపం చెయ్యాలి. జపములో దశాంశము త్రిమధురమిశ్రిత బంధూక పుష్పములతో హోమం చెయ్యాలి.

యంత్రము: త్రికోణము, షట్కోణము, షోడశదళము, అష్టదళము, భూపురము.

యంత్ర మధ్యలో దేవిని పూజించిన తర్వాత అంగావరణ పూజ చెయ్యాలి.

త్రికోణములో విద్యాది త్రిశక్తులను పూజించాలి. ఆ తర్వాత త్రికోణములో అగ్రభాగమును ప్రారంభించి సుభగా, భగా, భగసర్పిణిలను పూజించాలి. ఆ తర్వాత బాణములను కూడా పూజించాలి. షట్కోణములో భగమాలాది షడ్దేవతలను పూజించాలి. షోడశదళములో ఈ క్రింది దేవతలను పూజించాలి.

భగవశంకరి, భగరూపి, భగనిత్యక్లిన్న, భగరూపిణి, భగభగవతి, భగవరద, భగపరమేశ్వరి, భగరేత, భగసురేత, భగక్లిన్న, భగక్లిన్నద్రవా, భగామోఘా, భగవిద్యా, భగేశీ, భగక్లిన్నదేవతా, భగమాలినీ|

అష్టదళములలో అష్టమాతృకలను, భూపురములో ఇంద్రాది దేవతలను పూజించి, మళ్ళీ దేవిని పూజించాలి.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన భగమాలినీనిత్యావిధివివరణం అను నలభైఒకటవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: