పంచమీశకటయంత్రోద్దారప్రయోగసాధనవిధివివరణం
ఈశ్వరుడు చెప్పుచున్నాడు –
ఇప్పుడు తర్పణ విధిని తెలుపబడుచున్నది. తిలలు, మైరేయము (చెరకు రసం నుండి తీసిన కల్లు) మరియు బన్ధూక పుష్పములతో క్రమంగా తర్పణములు వదలాలి. ముఫైఏడవ భాగంలో చెప్పిన విధంగా పూజ చేసిన తర్వాత సువర్ణాది పాత్రల్లో తర్పణాలు వదలాలి. ఈ విధమైన సాధన వలన సాధకుడు తప్పకుండా దేవి కృపకు పాత్రుడవుతాడు.
ఇప్పుడు హోమ విధిని తెలుపబడుచున్నది.
ఒక చేయి పొడవు, అరచేయి వెడల్పు, ఒక చేయి లోతు పరిమాణంలో సుందరమైన హోమకుండమును
నిర్మించాలి. స్తంభన కార్యములకు ఈశాన కోణములో, నిగ్రహమునకు దక్షిణ దిశలో హోమము
చెయ్యాలి. మంత్రసాధకుడు ఈ కుండములో భైరవాగ్ని లేదా లౌకికాగ్నిని “ఐం హ్రీం వషట్ భైరవాయ
నమః” అని పూజించి అప్పుడు అగ్నికి ఆహుతినివ్వాలి. పైన చెప్పిన మూడు బీజములను
ఆగ్నేయమున లిఖించాలి. ఈ మంత్రముతో నీలకమలములు లేదా తమాల పుష్పములతో హోమము
చెయ్యాలి. స్తంభన కార్యమునకు తమాల పుష్పములతో 400 సార్లు హోమము చెయ్యాలి. దేవదారు, తిలలు, లాక్షా మరియు పసుపులతో
కూడా స్తంభనము అవుతుంది.
హోమకుండము యొక్క
దక్షిణాన, ఒక చేతి పొడవు మరియు వెడల్పు నువ్వులను
విస్తరించి దానిమీద బంగారం లేదా మట్టి
లేదా ఇనుప పాత్రను ఉంచి అందులో నెమలి ఈకలు మరియు పువ్వులు మొదలైన వాటితో తయారు
చేసిన నల్ల చీరను ఉంచాలి. సాధకుడు ఆ పాత్రను తిలమిశ్రిత జలముతో నింపాలి. “ఐం లం
కర్షణాదిహలాయ నమః” అని పఠించాలి. తర్వాత అంకుశ బీజమును పఠించి, క్రోధినేముసలాయ నమః అని లిఖించాలి. దేవీ మంత్రమును ఇరవైఏడుమార్లు పఠించాలి.
తర్వాత కలశమును స్పర్శించి, పరమేశ్వరి పంచమీ
దేవిని హృదయంలో ధ్యానించి ఆ కలశ జలముతో శత్రువు ప్రతిమను గానీ పుత్తలీని గానీ
అభిషేకం చెయ్యాలి. అలా చెయ్యడం వలన కఫము మరియు క్షయముతో శత్రువు బాధింపబడి
వశమవుతాడు.
అన్య హోమవిధిని ఇప్పుడు చెప్పబడుచున్నది
–
గాడిద లేదా గొర్రె రక్తములకు పేలాలు పొడి మరియు తిలలతో కలిపి ఒక సుందరమైన పిండ
ఆకారమును తయారు చెయ్యాలి. ఆ పిండమును మాంసము, గంధము, పుష్పము మొదలగు వానితో ఆ సుందర పిండమును
పూజించి తర్పణము వదలాలి.
ధాన్యపు
చూర్ణముతో హోమము చెయ్యాలి. మూలమంత్రమును 10వేలు జపము చెయ్యాలి. పసుపు పొడితో 21
ఆహుతులు ఇవ్వాలి. ఈ విధంగా చెయ్యడం వలన శత్రువు యొక్క రక్తము, మాంసము, మేదా, అస్థి, మజ్జా, శుక్ర యోగినీకి ఆహుతి
అవుతాయి. ఇందులో సందేహము లేదు.
ఇప్పుడు సాధకుడికి
ఆనందకారకము చెప్పబడుచున్నది. ప్రణవముతో ప్రణవమును సంపుటీకరించాలి. సాధక నామము
చుట్టూ రెండు ఔకారములను, రెండు ఠకారములను లిఖించాలి. ఎనిమిది వజ్రములు (=ధ్రీం), గ్లౌం, క్షౌం, వజ్ర, తారా బీజములను
పార్థివమండలము యొక్క రుద్ర స్వరము (ఏ) మీద స్థాపించి పసుపు పుష్పములతో పూజ
చెయ్యాలి. దీనిని పంచమీ శకట యంత్రము అని అంటారు. మూల మంత్రమును వెయ్యిసార్లు
జపించి, ఈ యంత్రమును విషభాండములోకి
వెయ్యాలి. శ్యామలోహిత మంత్ర జ్ఞాత భాండములో ఉన్న ఆ యంత్రమును పూజించాలి.
శ్మశానములోని ధూమ యుక్త
అగ్నిలో ఆ యంత్రమును ఉంచి పూజించాలి. బంగారము, వెండి లేదా తామ్ర రేకులమీద తయారు చేసిన
యంత్రమును శ్మశాన అగ్నిలో వేడిచేసి విధివిధానంగా పూజ చెయ్యాలి. బంగారము కావలసిన
వారు పసుపు పువ్వులతో శివుడిని ఆరాధించాలి. యంత్రమును సాయంకాల సమయంలో ధాన్యరాశిలో
ఉంచితే సాధకుడు ధాన్యవంతుడు అవుతాడు. కుమ్మరి ఇంటి నుండి కొత్త మట్టిపాత్రను
తీసుకు వచ్చి దానిమీద యంత్రమును నిర్మించాలి. ఆ యంత్రమును నల్లని పువ్వులతో
పూజించి భూమిలో పాతిపెట్టాలి. ఈ విధంగా చెయ్యడం వలన కోటి సంవత్సరములనుండి ఉన్న
శత్రువుల ఉచ్చాటనము అవుతుంది. ఆ పాత్రమీద వేరు వేరు నల్లని పదార్థములను అలికినచో
శత్రువుల దృష్టి నష్టమవుతుంది. రాయి మీద యంత్రమును లిఖించి పూజించాలి. మళ్ళీ పసుపు
పువ్వులమీద ఆ యంత్రమును (రాయిని) విలోమంగా ఉంచినచో వాక్చాతుర్యము కలవానికి
శీఘ్రంగా వాక్స్తంభనము అవుతుంది. సీసము మీద యంత్రమును లిఖించి సీసరంగుల పువ్వులతో
పూజించి ఒక రాయి కిందన ఆ యంత్రమును పాతిపెట్టినచో సాధకుడికి వ్యాజ్యములందు విజయము
లభిస్తుంది.
బంగారు
పత్రము మీద యంత్రము లిఖించి శ్వేత పుష్పములతో అర్చన చేస్తే సాధకుడు వాక్పతి
అవుతాడు. పంచసారము (? పంచదార?) మీద యంత్రము లిఖించి అయిదు రకముల
పుష్పములతో పూజచేస్తే ఆ సాధకుడు సర్వకార్యములు నిర్వహించడంలో సమర్థుడవుతాడు. నీళ్ళల్లో
పసుపును కలిపి ఆ మిశ్రమంతో రెండు సీసపత్రముల మీద యంత్రము లిఖించి సుందర పుష్పములతో
పూజించి శ్మశాన అగ్నిలో వాటిని వెయ్యాలి. దీనితో శత్రువులు, స్త్రీలు శీఘ్రంగా వశమవుతారు. సాధ్య
నామమునకు సంబంధించిన నక్షత్రము, ఆ
నక్షత్రమునకు చెందిన వృక్షగర్భములో సీసపత్రము మీద లిఖించిన యంత్రమును ఉంచినచో
శత్రువులకు చెందిన స్త్రీలు వశమవుతారు. అయితే ఆ వృక్షము గ్రామమునకు బయట ఉండవలెను.
ఆ యంత్రమును భూమి మీద ఉంచినచో కామినీ అనుగామిని అవుతుంది. ఘటములో ఉంచితే ఆ యంత్రము
ధనమును ఇస్తుంది. గృహమునకు తూర్పువైపున ఉంచితే శత్రువుకు భయము కలుగుతుంది.
అగ్నికోణమున ఉంచితే అగ్ని భయము కలుగుతుంది. దక్షిణ దిక్కులో పెడితే శత్రువు
మరణించును. నైఋతికోణములో పెడితే శత్రువు పిచ్చివాడు అవుతాడు. పశ్చిమ దిక్కున
ఉంచితే శత్రువుకు రోగములు,
వాయవ్యకోణములో ఉంచితే భయము కలుగుతాయి. ఉత్తర దిక్కులో ఉంచితే సాధకునకు ధనము
కలుగుతుందనుటలో సందేహము లేదు. ఈశాన కోణములో ఉంచితే శత్రువుకు భ్రాంతి కలుగుతుంది.
శత్రువు యొక్క గృహ మార్గంలో ఉంచితే నిశ్చింతగా శత్రువు యొక్క సర్వకార్యములూ
నాశనమవుతాయి. ఈ విద్యా పూజ మధ్యరాత్రిలో చెయ్యాలి. అన్యకాలములో పూజచేస్తే దేవత
శాపమునిస్తుంది.
ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు
విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు,
శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల
ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ
శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన
అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన పంచమీశకటయంత్రోద్దారప్రయోగసాధనవిధివివరణం
అను ముఫైఎనిమిదవ భాగము సమాప్తము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి