సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, ఏప్రిల్ 2022, శనివారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 30

 

కామేశ్వరీయజనవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు - హే మహేశానీ! ఇప్పుడు నీకు నేను విశ్వమాత, త్రైలోకములనూ ఆకర్షించునది, కుమారి భగవతి కామేశ్వరీ గురించి చెబుతాను.

మంత్రము: క్లీం ఐం హ్రీం|

ఈ విద్య త్రిపురేశ్వరీ యొక్క రెండవ విద్య. క్లీం - బీజం| హ్రీం - శక్తిః| ఐం - కీలకం| ఈ విద్య మహావశ్యకరి. ఈ మూడుబీజముల రెండు ఆవృత్తముల ద్వారా షడంగ న్యాసం చెయ్యాలి. తర్వాత పంచబాణముల న్యాసము, పంచ కాముల న్యాసము చేసి మూలమంత్రంతో వ్యాపక న్యాసము చెయ్యాలి. కామేశ్వరీ మహాయంత్రము మధ్యన దేవిని పూజించాలి. హే పార్వతీ! ఇప్పుడు ఈమె పంచ స్థానముల విశేషమును వినుము.

పంచబాణములను పూజించిన తర్వాత రతి, ప్రీతి, కాములను పూజించాలి. ఆ తర్వాత అనంగకుసుమాది అష్టశక్తులను, భైరవులను వారి శక్తులతో సహితంగా పూజించాలి. దళముల అగ్రభాగమున పీఠాష్టకములను, ఇంద్రాది లోకపాలకులను పూజించాలి. ఆ తర్వాత యంత్ర మధ్య భాగమున దేవిని పూజించాలి.

పురశ్చరణ విధి అంతా త్రిపురేశ్వరీ క్రమంలోనే చెయ్యాలి. ఈమెను ధ్యానించడం ద్వారా సాధకుడు ధరిత్రిని వశపరచుకోగలడు.

ధ్యానం:

ఉద్యత్సూర్యసహస్రాభాం మాణిక్యవరభూషణామ్|

స్ఫురద్రత్నవిహ్వలాస్యాం నానాలంకారభూషితామ్||

ఇక్షుకోదండబాణానాం పుస్తకం చాక్షమాలికామ్||

దధతీం చింతయేన్నిత్యాం సర్వరాజవశంకరీమ్||

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన కామేశ్వరీయజనవిధివివరణం అను ముఫైయవ భాగము సమాప్తము.

2 కామెంట్‌లు:

E.V.K.SIVANAND చెప్పారు...

ఇష్ట కామేశ్వరీ అనుగ్రహ పూర్ణ ఫల సిద్ధిరస్తు

E.V.K.SIVANAND చెప్పారు...

ఇష్ట కామేశ్వరీ అనుగ్రహ పూర్ణ ఫల సిద్ధిరస్తు