సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

18, మార్చి 2022, శుక్రవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 29

 

పంచకామేశ్వరీపూజనవిధివివరణం

ఇప్పుడు పంచకాముల నాయిక విశ్వమాతా వర్ణన చెయ్యబడుచున్నది. ముందు చెప్పబడిన పంచకాముల ద్వారా పంచకామేశ్వరీ తెలుపబడుతుంది. ఈ విద్యా ఋషి - సమ్మోహన| ఛందస్సు - గాయత్రి| బీజం - క్లీం| హ్రీం - శక్తిః| ఐం - కీలకం| దేవత - పంచకామేశ్వరి| కామబాణ విధిలో చెప్పిన విధంగా న్యాసములు చెయ్యాలి.

ధ్యానం:

రక్తాం రక్తదుకూలాంగలేపనాం రక్తభూషితామ్|

పాశాంకుశధనుర్భాణాన్పుస్తకంచాక్షమాలికామ్||

వరాభీతిచ దధతీ త్రైలోక్యవశకారిణీ|

పూజాదులు పంచబాణేశ్వరీ విధానంలోనే చెయ్యాలి.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన పంచకామేశ్వరీపూజనవిధివివరణం అను ఇరవైతొమ్మిదవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: