సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, జనవరి 2022, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఏడవశ్వాస - 12

 61. ఊర్థ్వసింహాసన దేవతా

     అ) పంచ సుందరీ: మూడులోకములలో దుర్లభమైన ఈ విద్యలను నేను ఇప్పటికీ ఈశాన్య ముఖంతో జపము చేస్తానని శివుడు స్వయంగా పార్వతితో చెప్పెను.

ప్రథమసుందరి: హైంహకలహ్రీంహ్సౌః|

ద్వితీయసుందరి: అహసైం అహసీం అహసౌః|

తృతీయసుందరి: ఐం హసఏహసహస్రైం హహహకలహ్రీం హహహహరౌః|

చతుర్థసుందరి: కలహహసససహ్రైం(హ్రీం) కలహహసససహ్రీం కలహహసససహ్రౌః(హ్రీం). – ఈ విద్య భోగ,మోక్షదాయిని

పంచమసుందరి: సహహసలక్షహ్సైం హసహసలక్షహ్సీం హసలక్షసహసహౌః|

ఋష్యాదిన్యాసములు త్రిపురేశీ విద్యకు సమానము.ధ్యానము సంపత్ప్రదాభైరవీ విద్యకు సమానము.

     ఆ) పంచలక్ష్ములు

1) శ్రీవిద్యా లక్ష్మి: శ్రీం కఏఈలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం|

2) ఏకాక్షర లక్ష్మి: శ్రీం| ఋషి – భృగు| ఛందస్సు – నిచృత్| దేవత – లక్ష్మి| సీ – బీజం| సీ – శక్తిః| రేఫ – కీలకం| శ్రాం, శ్రీం, శ్రూం, శ్రైం, శ్రౌం, శ్రః – షడంగ న్యాస బీజములు. సమస్త దేవతల చేత పూజింపబడునది, పద్మయుగ్మములను ధరించునది, వరద మరియు అభయ ముద్రలతో శోభిస్తూ బ్రహ్మద్వారా సాధకుని హృదయమున స్థాపితమైన కమల నయనీ దేవిని ఈ క్రింది విధంగా ధ్యానించాలి:

తప్తకార్త స్వరాభాసాం దివ్యరత్నవిభూషితాం|

ఆసిచ్యమానామమృతైర్ముక్తా రత్నద్రవైరపీ||

శుభ్రాభ్రాభేభయుగ్మేన ముహుర్ముహురపి ప్రియే|

రత్నౌఘబద్ధముకుటాం శుద్ధక్షౌమాంగరాగిణీం||

3. మహాలక్ష్మి:

ఓంశ్రీంహ్రీంశ్రీం కమలే కమలాలయే ప్రసీదప్రసీద శ్రీంహ్రీంశ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః|

ఋషి-దక్షప్రజాపతి| ఛందస్సు – గాయత్రి| దేవత – లక్ష్మి| శ్రీం – బీజం| హ్రీం – శక్తిః| ఓం – కీలకం| శ్రాం, శ్రీం, శ్రూం, శ్రైం, శ్రౌం, శ్రః – షడంగ బీజ న్యాసములు

ధ్యానం:

రత్నోధ్యద్వసుపాత్రంచపద్మయుగ్మంచ హేమజం|

అగ్రరత్నావళీరాజదాదర్శం దధతీంపరాం||

చతుర్భుజాంస్ఫురద్రత్ననూపురాం ముకుటోజ్జ్వలాం|

గ్రైవెయాంగాదహారాఢ్య కంకణాం రత్నకుణ్డలాం||

శుక్లాంగరాగవసనాం మహాదివ్యాంగనానతామ్|

పద్మాసనసమాసీనాం దూతీభిర్మండితాం సదా||

4. త్రిశక్తి లక్ష్మి: శ్రీం హ్రీం క్లీం

ఋషి – బ్రహ్మ| ఛందస్సు – గాయత్రి| దేవత – త్రిశక్తి|

ఈ మంత్ర బీజములను రెండు ఆవృత్తములుగా షడంగన్యాసం చెయ్యాలి. ఈ మంత్రము సమస్త సమృద్ధములను ఇచ్చును.

ధ్యానం:

నవహేమస్ఫురద్భూమౌ రత్నకుట్టిమ మండపే|

మహాకల్పావానాంతస్థే రత్నసింహాసనే వరే||

కమలాసనశోభాఢ్యాం రత్నమంజీర కుండలా|

స్ఫురద్రత్నలసన్మౌళిమ్ రత్నకుండలమండితాం||

అనర్ఘ్యరత్నఘటితనానామండనభూషితాం|

దధతీం పద్మయుగళం పాశాంకుశధనుఃశరాన్||

షడ్భుజామిందువదనామ్ దూతీభిఃపరివారితాం|

చారుచామరహస్తాభీరత్నాదర్శసుపాణిభిః||

తాంబూలస్వర్ణపాత్రాభిర్భూషాపేటీసుపాణిభిః||

5. సర్వసామ్రాజ్య లక్ష్మి

శ్రీం సహకలహ్రీం శ్రీం| ఋషి – హరి| ఛందస్సు – గాయత్రి| దేవత – మోహినీ లక్ష్మి| హ్రీం – బీజం| శ్రీం – శక్తిః|

శ్రాం, శ్రీం, శ్రూం, శ్రైం, శ్రౌం, శ్రః – షడంగ బీజ న్యాసములు

ధ్యానం:

అసతీపుష్పాసంకాశాం రత్నభూషణభూషితాం|

శంఖచక్రగదా పద్మశార్ఙబాణధరాం కరైః||

షడ్భిః కరాభ్యాం దేవేశి వరాభయ శోభితాం||

ఈమె సర్వసామ్రాజ్యదాయిని. ఈ దేవిని ఆరాధించి విష్ణువు భూలక్ష్మిని వివాహం చేసుకున్నాడు.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: