మహాసింహాసనేశ్వరీ భైరవీ
విధివివరణం
ఈశ్వరుడు చెప్పుచున్నాడు. హే దేవీ! నేను నా ఉత్తర ముఖము నుండి మహాసింహాసన స్థిత డామరేశ్వరీ భైరవీ జపము చేస్తాను. ఈ విద్య భోగ, మోక్ష ఫలదాయకము.
ధ్యానం:
బంధూకకుసుమాభాసాం పంచాముండాధివాసినీం|
స్ఫురచ్చంద్రకలారత్నముకుటాం ముండమాలినీం||
త్రినేత్రాం రక్తనయనాం పీనోన్నతఘనస్తనీం|
పుస్తకంచక్షమాలాం చ వరదం చాభయం క్రమాత్||
దధతీం సంస్మరేన్నిత్యం
ఉత్తరామ్నాయమానితాం|
మంత్రం: క్రీం మహాచండయోగేశ్వరి|
ఈ కాళికా విద్య నవాక్షరి.
హే దేవీ! ఈ విద్యా సాధన వలన అతడు పూర్ణ
సమ్మనితుడవుతాడు.
ఈ విద్యయొక్క న్యాసము,
పూజాదులు త్రిపురేశ్వరీ క్రమంలోనే చెయ్యాలి. ఈ దేవి మహాసంపత్ప్రదాయినీ మరియు మహాభయవినాశిని
అనగా మృత్యువును నశింపచేయునది అని అర్థము.
ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు,
కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు
మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ
ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ
అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము
చేసిన మహాసింహాసనేశ్వరీ భైరవీ విధి వివరణం అను ఇరవైవ భాగము సమాప్తము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి