సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

19, నవంబర్ 2021, శుక్రవారం

గురుపూజా పద్ధతి

 

శ్రీ మహాగణాధిపతయే నమః

శ్రీ లలితా మహా త్రిపురసుందర్యై నమః

శ్రీగురుస్సర్వకారణ భూతాశ్శక్తిః

 

సూచన – దేవికి ఎడమ వైపున సరళ రేఖాక్రమంలో మూడు కలశములను ఉంచి వాటికి పసుపు రాసి కుంకుమ అద్దిన మూడు కొబ్బరికాయలను ఉంచాలి. కొబ్బరి కాయల పీచు వెనుక వైపు ఉండునట్లుగా కొబ్బరికాయలను అమర్చాలి. ఆ కలశములందు ఎడమ నుండి కుడివైపుకు వరుసగా పరమేష్ఠిగురు, పరమగురు, స్వగురులను గురుత్రయ పాదుకా మంత్రములతో ఆవాహన చేయాలి. బ్రహ్మవిద్యా సంప్రదాయ గురుస్తోత్రమును పఠించాలి.

ఆ తరువాత శ్రీచక్ర నవావరణ పూజ యధావిధిగా కావించి, ఈ క్రింది విధముగా గురు పూజ చెయ్యాలి. శ్రీచక్ర నవావరణ పూజ చేయలేని వారు గురుపూజను మాత్రమే చేయవచ్చును.

 

బ్రహ్మవిద్యా సంప్రదాయ గురుస్తోత్రమ్

ఓం ఆ బ్రహ్మలోకాదా శేషాలోకాలోక పర్వతాత్, యేసంతి ద్విజాస్తేభ్యో నిత్యం నమామ్యహం|

ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవ రహిత ప్రజ్ఞాన ఘనప్రత్యగర్ఢో బ్రహ్మైవాహమస్మి. సోహమస్మి. బ్రహ్మాహమస్మి.

 

శ్రీనాథాది గురుత్రయం గణపతి పీఠత్రయం భైరవం సిద్దౌగం వటుకత్రయం పదయుగం దూతీక్రమం మండలం, వీరాన్ద్వ్యష్ట చతుష్కషష్టినవకం వీరావళీ పంచకం, శ్రీమన్మాలిని మంత్రరాజసహితం వందే గురోర్మండలం.

 

గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః, గురుస్సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీగురవేనమః.

వందే గురుపద ద్వంద్వమవాంగ్మానసగోచరమ్ రక్త శుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః.

నారాయణం పద్మభువం వసిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ, వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస్య శిష్యం.

శ్రీశంకరాచార్య మధాస్య పద్మపాదంచ హస్తామల కంచ శిష్యం, తంత్రోటకం వార్తిక కారమన్యానస్మద్గురూన్ సంతత మానతోస్మి.

దీపారాధనం, ఆచమనీయం, దేశకాలసంకీర్తనం యధావిధిగా చెయ్యాలి.

 

ధ్యానం

నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం, విశ్వాతీతం గగనసదృశం తత్త్వమస్యాదిలక్ష్యం, ఏకం నిత్యం విమలమచలం సర్వదాసాక్షిభూతం, భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి.

స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురు ధ్యాయామి.

 

ఆవాహనం

జ్ఞానతిమిరాంథస్య జ్ఞానాం జనశలాకయా, చక్షుదున్మీలితం యేన తస్మై శ్రీ గురవేనమః

స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురుమావాహయామి.

 

ఆసనం


చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం, నాదబిందుకళాతీతం తస్మై శ్రీగురవేనమః

స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః. ఆసనం సమర్పయామి.

 

పాద్యం

గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః, గురుస్సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీగురవేనమః.

స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః. పాదయోః పాద్యం సమర్పయామి.

 

అర్ఘ్యం

అఖండమండలాకారం వ్యాప్తంయేనచరాచరం, తత్పదం దర్శితం యేనతస్మై శ్రీ గురవేనమః.

స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి.

 

ఆచమనీయం

 

సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే, నమోవేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే.

స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః. ముఖే ఆచమనీయం సమర్పయామి.

 

స్నానం

జ్ఞానశక్తిం సమారూహ్య తత్త్వమాలావిభూషిణే, భక్తి ముక్తి ప్రదాత్రేచ తస్మై శ్రీగురవేనమః.

స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః. స్నానం సమర్పయామి.

 

వస్త్రం

అనేక జన్మ సంప్రాప్త కర్మ ధర్మ విదాహినే, జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీగురవేనమః.


స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః. వస్త్రయుగ్మం సమర్పయామి.

 

ఆభరణం

మన్నాథ శ్రీ జగన్నాథో మద్గురు జగద్గురుః, స్వాత్మైవ సర్వ భూతాత్మా తస్మై శ్రీగురవేనమః.


స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః. ఆభరణం సమర్పయామి.

 

గంధం

గురుశ్శివో గురుర్దేవో గురుర్బంధుశ్శరీరిణాం, గురురాత్మా గురుర్జీవః గురోరన్యన్నవిద్యతే.


స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః. గంధంధారయామి.

 

పుష్పాణి

స్థావరం జంగమంవ్యాప్తం యత్కించిత్ సచరాచరం, తత్పదం దర్శితంయేన తస్మై శ్రీగురవేనమః.


స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః.
పుష్పాణి పూజయామి.

 

ధూపం

చిన్మయం వ్యాపినం సర్వం త్రైలోక్యం సచరాచరం, అస్తిత్వం దర్శితంయేన తస్మై శ్రీగురవేనమః.


స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః. ధూపమాఘ్రాపయామి.

 

దీపం

బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం, విశ్వాతీతం గగనసదృశం తత్త్వమస్యాదిలక్ష్యం, ఏకం నిత్యం విమలమచలం సర్వదాసాక్షిభూతం, భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి.

స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః. దీపం దర్శయామి.

 

నైవేద్యం


వందే గురుపద ద్వంద్వమవాంగ్మానసగోచరమ్ రక్త శుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః.

స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః. నైవేద్యం సమర్పయామి.

 

తాంబూలం

 

ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో నమోమహద్భ్యో నమో గురుభ్యః

స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః. తాంబూలం సమర్పయామి.

 

నీరాజనం

గురురేవ పరంబ్రహ్మ గురురేవ పరాగతిః, గుశబ్దస్త్వంధకారస్స్యాత్ రుశ్శబ్దస్తన్నిరోధకః, అంధకారనిరోధత్వాత్ గురురిత్యభిధీయతే.

స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః. నీరాజనం సమర్పయామి.

 

మంత్రపుష్పం

గురుక్రమపురస్కృతే గురుశరీర నిత్యోజ్జ్వలే, షడంగ పరివారితేకలిత ఏషపుష్పాంజలిః

 

స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః. మంత్రపుష్పం సమర్పయామి.

 

ఆత్మప్రదక్షిణ నమస్కారం

దేవనాథ గురోస్వామిన్ దేశికస్వాత్మనాయక, త్రాహి త్రాహి కృపాసింధో పూజాం పూర్ణతరాంకురు.

స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురవేనమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్  సమర్పయామి

 

పైవిధముగా పూజ జరిగిన తర్వాత సాధకుని దగ్గరలో గురుదంపతులుంటే వారికి తన శక్తికొలది కొత్త బట్టలు పెట్టి పాదపూజ చేసుకోవాలి.

 

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః

1 కామెంట్‌:

PADMAJA చెప్పారు...

శ్రీ గురుభ్యోంనమః 🙏🙏🙏
స్వగురు,పరమగురు,పరమేష్ఠిగురవే నమః
🙏🙏🙏