53. పంచసింహాసన విద్య
త్రిపురావిద్య మూడు ప్రకారములని జ్ఞానార్ణవము నందు చెప్పబడినది. ఇందు ముందు బాలా మంత్రము చెప్పబడుచున్నది.
బాలా మంత్రము: ఐం క్లీం సౌః| ఈ
మంత్ర జ్ఞానము చేత సాధకుడు సాక్షాత్ బృహస్పతి అవుతాడు. ఈ విద్య గంగా-తరంగ
కల్లోలితములాగా వాక్చాతుర్య శక్తిని ఇస్తుంది. ఈ విద్య మహాసౌభాగ్య జనని మరియు
మహాసారస్వత ప్రదాయిని.
ఈ మంత్రమునకు ఋషి - దక్షిణామూర్తి|
ఋషి న్యాసము శిరస్సున చెయ్యాలి. ఛందస్సు - పంక్తి| ఈ
న్యాసము హృదయము నందు చెయ్యాలి. ఐం - బీజం| సౌః -
శక్తిః| క్లీం - కీలకం| నాభి
నుండి పాదముల వరకు, గళము నుండి నాభివరకు,
మూర్థ నుండి గళము వరకు వీటి న్యాసము క్రమముగా చెయ్యాలి. వామ కరతలము నందు ఐం,
దక్షకరతలమునందు ఐంక్లీం మరియు కరసంపుటము నందు ఐంక్లీంసౌః న్యాసము చెయ్యాలి. ద్రాం,
ద్రీం, క్లీం, బ్లూం,
సః బీజములతో అంగుష్ఠ నుండి కనిష్ఠ వరకు న్యాసము చెయ్యాలి. క్షోభణ,
ద్రావణ, ఆకర్షణ, వశ్య,
ఉన్మాద ఇవి పంచబాణముల పేర్లు. హ్రీం క్లీం ఐం బ్లూం స్త్రీం - ఇవి కామబీజములు.
కామ, మన్మధ, కందర్ప,
మకరధ్వజ, మీనకేతు - ఇవి పంచకాముల పేర్లు. వీటి న్యాసము
చేసి కరన్యాసము చెయ్యాలి. ఐంక్లీంసౌః బీజములను రెండు ఆవృత్తములుగా కరంగన్యాసం
చెయ్యాలి. షడంగ క్రమయోగముతో మాతృకా న్యాసము చెయ్యాలి. ఇక్కడ షడంగ న్యాసము తర్వాత మాతృకా,
షండంగ, అంతర్మాతృకా,
బహిర్మాతృకా న్యాసములు చెయ్యవలెనని నిర్దేశించబడెను.
విధివిధానముగా ధ్యానము చేసి
విద్యాన్యాసము చెయ్యాలి. మూడు బీజములతో దేహబంధము చెయ్యాలి. ఐం నమః - దక్ష హస్తౌ|
క్లీం నమః దక్షమణిబంధే| సౌః నమః - దక్ష కరతలే| ఈ
మూడు బీజములతో క్రమముగా వామహస్తే, వామకూర్పరే, వామపాణౌ,
దక్షపాదౌ, వామపాదౌ, మూర్ధా,
హృదయ, లింగములందు న్యాసము చెయ్యాలి. ఇది సంహార
న్యాసము.
ఆ తర్వాత సృష్టి క్రమంలోను మరియు నవయోని
న్యాసము చెయ్యాలి.
ఐం నమః - వామకర్ణే|
క్లీం నమః - దక్షకర్ణే| సౌః నమః - చిబుకే|
ఐం నమః - వామగండే| క్లీం నమః - దక్షగండే| సౌః నమః - ముఖే| ఐం నమః -
వామ కూర్పరే| క్లీం నమః - దక్ష కూర్పరే|
సౌః నమః - నాభౌ| ఐం నమః - వామ జానౌ|
క్లీం నమః - దక్ష జానౌ| సౌః నమః - లింగోపరి|
ఐం నమః - వామపాదే| క్లీం నమః - దక్ష పాదే| సౌః నమః - గుహ్యే|
ఐం నమః - వామ పార్శ్వే| క్లీం నమః - దక్ష పార్శ్వే|
సౌః నమః - హృది| ఐం నమః - వామస్తనే|
క్లీం నమః - దక్ష స్తనే| సౌః నమః - కంఠే|
షడంగ న్యాసం: సౌఃక్లాంఐం హృదయే|
సౌఃక్లీంఐం శిరః| సౌఃక్లూంఐం - శిఖా|
సౌఃక్లైంఐం - కావాచ్| సౌఃక్లౌంఐం - నేత్రత్రయం|
సౌఃక్లఃఐం - అస్త్రాయ|
బాణన్యాసము: ద్రాం ద్రావిణ్యై నమః -
అంగుష్ఠ| ద్రీం క్షోభిణ్యై నమః -
తర్జనీ| క్లీం వశీకరణ్యై నమః - మధ్యమ|
బ్లూం ఆకర్షిణ్యై నమః - అనామిక| సః - సమ్మోహిన్యై నమః - కనిష్ఠిక|
కామన్యాసము: హ్రీం మనోభవాయ నమః - లలాటే| క్లీం మకరధ్వజాయ నమః - గళే| ఐం
కందర్పాయ నమః - హృది| బ్లూం మన్మధాయ నమః - నాభౌ|
స్త్రీం కామదేవాయ నమః - మూలాధారే|
వ్యాపకన్యాసం: ఐంక్లీంసౌః
తర్వాత మూడుసార్లు ప్రాణాయామము చేసి,
ఋష్యాది కరంగషడంగ న్యాసము చేసి ఈ క్రింది విధంగా ధ్యానము చెయ్యాలి.
ధ్యానం:
ధ్యాయేద్దేవీం మహేశాని కదంబవనమధ్యగామ్|
రత్నమండప మధ్యేతు మహాకల్పవనాన్తరే||
ముక్తాతపత్రఛాయాయాం రత్నసింహాసనే
స్థితామ్|
అనర్ఘ్యరత్నఘటితముకుటాం రత్నకుణ్డలాం||
హారగ్రైవేయసద్రత్నచిత్రితాం
కంకణోజ్జ్వలామ్|
పుస్తకంచాభయం వామే దక్షిణేచఅక్షమాలికాం||
వరదానరతాం దివ్యాం మహాసారస్వతప్రదామ్||
ఇంకాఉంది...
4 కామెంట్‌లు:
శ్రీ గురుభ్యోం నమః 🙏🙏🙏
శ్రీవిద్యార్ణవంలో బాలమంత్రం లో న్యాస భేదం కనపడుతోంది. గురుసమ్ప్రదాయం ననుసరించి భేదం ఉంటుందా ? లేదా పంచసింహాసన విద్య లో పద్దతా ? వివరించ గలరు 🙏🙏🙏
న్యాసములు గురు సంప్రదాయమును బట్టి ఉంటాయి. శ్రీవిద్యార్ణవంలో ఈ పద్ధతిని తెలిపారు.
ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి