సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

29, సెప్టెంబర్ 2021, బుధవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 17

 

పదిహేడవ భాగము

వజ్రేశ్వరీ పూజా విధివివరణం

మంత్రము - హ్రీం క్లిన్నే ఐం క్రోం నిత్యమదద్రవే హ్రీం

ఋషి - బ్రహ్మ| ఛందస్సు - విరాట్| దేవతా - వజ్రేశ్వరి| క్రోం - బీజం| ఐం - శక్తిః| నే - కీలకం|

షడంగన్యాసం: హ్రీం| క్లిన్నే| ఐం| క్రోం| నిత్యమదద్రవే| హ్రీం| ఈ బీజముల ద్వారా షడంగన్యాసం చెయ్యాలి.

యంత్రోద్దారము:

ఒక సుందరమైన వృత్తమును నిర్మించి దాని మధ్యలో కామబీజము క్లీం తో మహాసింహాసనమును పూజించాలి. వృత్తము చుట్టూ ద్వాదశదళ పద్మమును నిర్మించాలి. దానికి బయట నాలుగు ద్వారముల భూపురమును నిర్మించాలి. యంత్రమధ్యలో పుష్పమును ఉంచాలి. దేవిని ధ్యానించి, యంత్రములోనికి ఆహ్వానించాలి.

ధ్యానం:

ధ్యాత్వా చావాహయేద్దేవీమ్ కదంబవనమధ్యగామ్|

రక్తవస్త్రకలాచారుముకుటాంబర భూషణాం||

మహాతారుణ్యగర్వాఢ్యాం లోచనత్రయభూషితామ్|

శోణితాబ్ధితరత్పోతమహాయంత్రోపరి స్థితామ్||

డాకినీం సాయకాంశ్చైవ పాశంచైవస్రజమ్ తథా|

చాపం కపాలం దధతీంశోణామాల్యానులేపనామ్|

సర్వరక్తమయీం దేవీముపాచారైః సమర్చయేత్||

(స్రజమ్= పూలమాల)

ముందుగా అంగముల పూజ చేసి ద్వాదశ పాత్రములందు క్లేదిని, నందా, క్షోభీణీ, మదనాతురా, నిరంజనా, వాగ్భవతీ, క్లిన్నా, మదనావతి, ఖేచరి, ద్రావిణీ, వేదవతి, చక్రప్రస్తావినీ అను దేవతలను పూజించాలి. భూప్రస్తారంలో లోకపాలకులను కామాబీజముతో పూజించాలి.

మరొక సంప్రదాయము:

అష్టదలము, ద్వాదశదలము, భూపురము నిర్మించాలి. కమలములందు మాతలను, భూపురములందు లోకపాలకులను పూజించాలి.

ఆ తర్వాత దేవిని పూజించాలి. పూజ తర్వాత మంత్రములో ఎన్ని వర్ణములున్నవో అన్ని లక్షల జపము చెయ్యాలి. జపసంఖ్యలో దశాంశము రక్తకమలములతో హోమము చెయ్యాలి.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన వజ్రేశ్వరీపూజావిధి వివరణం అను పదిహేడవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: