సంజీవనీయజన విధివివరణం
ఈశ్వరుడు చెప్పుచున్నాడు - హే మహేశానీ! ఇప్పుడు పరాత్పర మృత్యుంజయ వర్ణన వినుము. ఈ మంత్ర స్వరూపము ఈ విధంగా ఉండును -
ఓం వాగ్వాదిని వదవద హ్స్రైం క్లిన్నే
క్లేదిని మహాక్షోభం కురుకురు హ్స్రీం ఓం మోక్షం కురుకురు హంసఃలః
ఈ మంత్ర ఋషి - అసిత|
ఛందస్సు - గాయత్రి| దేవత - భైరవి| ఆదికూటం
- కఏఈలహ్రీం - బీజం| మధ్యకూటం - హసకహలహ్రీం - కీలకం|
అంత్యకూటం - సకలహ్రీం - శక్తిః| ఈ విద్య సాక్షాత్ మృత్యునాశని. నవ శక్ర అనగా నవ
ఇంద్ర వర్ణ (=ల) మరియు అష్టవర్ణములు (=య,ర,వ,శ,ష,స,హ,క్ష)
లతో షడంగన్యాసం చెయ్యాలి. యంత్రరచనకు ఇదే క్రమంలో ఉచ్చరించి మళ్ళీ ఇవే వర్ణములను
మూడుసార్లు లిఖించాలి. (=?)
త్రికోణ,
షట్కోణ, అష్టదళ చక్రమును నిర్మించాలి. అష్టదళములో కామబీజము,
షట్కోణములో జాలంధర పీఠమును, త్రికోణములో ఉడ్డియాన లిఖించి మంత్ర త్రికూటముల
ద్వారా దేవిని ధ్యానించి, ఆహ్వానించాలి.
ధ్యానం:
ధ్యాత్వాచావాహయేద్దేవీమ్ కదంబవనమధ్యగామ్|
పుస్తకంవామహస్తేన దక్షిణే చాక్షమాలికామ్||
బిభ్రతీం కుందధవళాం కుమారీమ్
చింతయేత్పరామ్|
సమస్త ఉపచారములతోనూ ఆమెను పూజించిన
తర్వాత షడంగావరణ పూజ చెయ్యాలి. వసంత, మనోజ,
చంద్ర విద్యా భాగత్రయముల ద్వారా సంజీవనీ పదము జోడించి ప్రదక్షిణ క్రమంలో పూజ
చెయ్యాలి. ఆ తర్వాత త్రికోణంలోనే బ్రహ్మ, విష్ణు,
ఈశాన శబ్దములకు చివర సంజీవనీ అని జోడించి పూజించాలి. ఈ ప్రకారం త్రికోణంలో ఆరు
సంజీవనీ పూజ అవుతుంది.
షట్కోణంలో ధర్మ,
అర్థ, కామ, మోక్ష, జయంతీ,
విజయా శబ్దములకు సంజీవనీ జోడించి పూజించాలి. అష్టదలములో మాతృకా వర్ణ అష్టవర్గములను
సంజీవనీ పదము జోడించి పూజించాలి.
పై మంత్రములకు ముందు తారాబీజం,
శక్తిబీజం, శ్రీబీజములను జోడించి పూజ చెయ్యాలి.
హే మహేశానీ! ఈ ప్రకారం జపము చేసినచో
దేవి పురుషార్థములను ప్రసాదించును. జపానంతరము మళ్ళీ దేవిని గంధ,
పుష్పాదులతో పూజించాలి. పురశ్చరణ చేయదలచిన వారు పూర్వసంజీవనీ పద్ధతి ప్రకారం
చెయ్యాలి.
ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు,
కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు
శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ
ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ
అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము
చేసిన సంజీవనీయజనవిధి వివరణం అను పదహారవ భాగము సమాప్తము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి