9. షోడశవర్ణ ఉద్దారక్రమము
జ్ఞానార్ణవమునందు దీని వర్ణన ఈ విధంగా కలదు -
శ్రీదేవి ఈశ్వరుడిని ఈ విధంగా అడిగెను - హే స్వామీ! మీరు వివిధ ప్రకారములైన త్రిపురావిద్యలను ప్రకటించారు. ఇప్పుడు మీరు త్రివిధాను ప్రకటించవలసినదిగా కోరుచున్నాను. అప్పుడు ఈశ్వరుడు ఇలా బదులుయిచ్చెను.
హే ఈశానీ! పరబ్రహ్మస్వరూప నాద -
బిందు - కళాన్విత శివ - శక్తి మయ విద్యను చెబుతాను. సావధానవై వినుము.
ఏది విశ్వమంతటనూ వ్యాపించి ఉన్నదో
అది శివ. ఇంతకుముందు వీని యొక్క గుణములు తెలుపబడినవి. ఇప్పుడు శివ-శక్త్యాత్మకమును
వినుము. అ నుండి స వరకు ఉన్న మాతృకలు శక్తి అవయములు. కేవలము హకారము శివుడు. ఆది
అంతము అక్షరభావము వలన హంస - నేను ఈశ్వరుడిని అన్న మాతృకా వర్ణరూపము అవుతుంది. హే
మహేశానీ| హకారము శూన్యరూపములో
సదా అవ్యయము. సకారము శక్తి రూపములో సృష్టి. ఏ శక్తిని ఉత్పత్తికి కారణము అని
చెబుతారో అది కూడా నేను అనే శబ్ద రూపంలో ఉన్నాను.
బిందుత్రయ సమాయోగముతో
మహాత్రిపురసుందరి నాద రూపములో హకారము యొక్క అర్థరూపము. హకారము శివరూపము మరియు అతని
అర్థాంగము మహాశక్తి హకారము యొక్క అర్థస్వరూపము. మహావిద్యా మహాత్రిపురసుందరీ నిత్య
చిత్కళా పరదేవత. శ్రీగురుదేవుల కృపచేత దీక్షుతుడైన సాధకుడు పొద్దున్నలేచి గురునామ
స్మరణ చెయ్యాలి. మంత్రజ్ఞుడు సంధ్యా స్నానాదులు చేసి సర్వ శృంగారవేషయుక్త, కర్పూర, కేసర, కస్తూరి, కుంకుమ లేపనములు తన శరీరమున చేసి నవరత్నములను, ఎర్రని
వస్త్రములను ధరించి ప్రకాశించవలెను. తాంబూలము సేవించి మదానంద మానసుడై యాగమండపముకు
రావలెను. మండపమును రంగ-విరంగములతో అలంకరించవలెను. అనేక ధూపములను వెలిగించవలెను.
భూమిని ఆవుపేడతో శుభ్రం చెయ్యాలి. సుందర పుష్పములతో మండపమును అలంకరించాలి. మనోహర
మట్టిపైన ఆసనమును పరచి కూర్చోవాలి. అన్ని కార్యముల సిద్ధికి మంత్రోద్ధారము
చెయ్యాలి.
ప్రథమ విద్య: ఐంక్లీంసౌః
త్రిపురాపరమేశ్వరీ కరశుద్ధికరీ విద్యాయై నమః|
ద్వితీయ విద్య: హ్రీంక్లీంసౌః
దేవ్యాసనాయ నమః| వీటితో
షడంగన్యాసం చెయ్యాలి|
తృతీయ విద్య: హైంహ్క్లీంహ్సౌః
శ్రీచక్రాసనాయ నమః|
తురీయ విద్య: హ్సైంహ్స్క్లీంహ్స్సౌః
సర్వమంత్రాసనాయ నమః|
పంచమ విద్య: హ్రీంక్లీంబ్లేం
సాధ్యసిద్ధాసనాయ నమః|
హే దేవీ! ఇప్పుడు అన్ని ఆగమముల
ద్వారా సేవితమైన మూలవిద్యను వినుము. అది అన్ని దర్శనముల చేతను పూజింపబడును. అది
అవ్యయము మరియు చిత్కళము. ల-స-హ-ఈ-ఏ-ర-క-అర్థచంద్ర-బిందువు - ఈ తొమ్మిది వర్ణములు
మేరువు. ఈ మేరువు నుండి మహాత్రిపురసుందరి యొక్క అన్ని మంత్రములూ ఉత్మన్నమయ్యెను.
లకారము నుండి కొండలు,
అడవుల సహిత పృద్ధ్వీ ఉత్పన్నమయ్యెను. దీని యందు సర్వతీర్థమయి యాభై పీఠశక్తులు కలవు. సకారము నుండి
చంద్ర-తారాదులు-గ్రహ-రాశి స్వరూపములు ఉత్పన్నమయ్యెను. హకారము నుండి శివుని
సంయోగముతో వ్యోమమండలము ఉత్పన్నమయ్యెను. ఈకారము విశ్వమూర్తి మహాతుర్యాత్కము. ఏకారము
నుండి వైష్ణవీ శక్తి విశ్వపాలన యందు నిమగ్నమై ఉండును. రకారము తేజోయుక్త పరజ్యోతి
స్వరూపిణి. కకారము కామదా కామరూపిణీ - అవ్యయము. అర్థచంద్ర విశ్వయోని. బిందువు
శివరూపములో శూన్యమునకు సాక్షి. వీటితో కలిసి సర్వత్రవ్యాప్త నిశ్చలాత్మనా మరియు
పరబ్రహ్మరూప త్రిపురా మంత్రము తయారవుతుంది.
త్రిపురా మంత్రములు మరొక ప్రకారముగా
ఏర్పడవు. శ్రీచక్రము కూడా మేరురూపము. ఇందు ఎటువంటి సందేహము లేదు. లకారము పృథ్వీ
బీజము. అందుకనే దీనీ ఊర్వీ అంటారు. సకారము చంద్ర స్వరూపము. అందువలనే షోడశ
పత్రమునందు హకారమును శివ అని అంటారు. అష్టదళమునందు అష్టమూర్తులుండును. ఈకారము
మహామాయా రూపము మరియు చతుర్దశభువనాత్మకము. వీరు పరాపాలన చేయును. దీనిద్వారా
చతుర్దశారము ఏర్పడును. ఒకటే శక్తి దశస్థానములందు ఉండి, మూడులోకములను ఉత్పన్నము చేసి, విశ్వయోని రూపములో
ఖ్యాతిని పొందును. ఆ శక్తియే విష్ణువు యొక్క దశ రూపములు. రకారము నుండి వ్యాప్యచక్రము
ఏర్పడును. ఈ దశకోణములను పరా అంటారు. తద్వారా రకారము పరాజ్యోతి అనబడును. దశకళాన్విత
అగ్ని బహిర్దశారచక్రము యొక్క ప్రవర్తకము (=ఉద్దీపించును అని అర్థం). కకారము కామదేవ
స్వరూపము మరియు శివుని ఎనిమిది రూపముల స్వరూపము. అర్థచంద్రము యోనిరూప అష్టకోణము.
త్రికోణరూప యోని యందు బిందువు బైందివము. అది కామేశ్వర స్వరూప విశ్వమునకు ఆధారము.
శ్రీచక్రము శ్రీవిద్యావర్ణములనుండి సంభూతమయినది.
10. పంచావింశత్యుపాసక కథనం
తంత్రాంతరము నందు ఈవిధంగా చెప్పబడినది -
మహాదేవిని ఉపాసించిన వారిలో పన్నెండుమంది
ప్రముఖులు. వారు -
మనువు - చంద్రుడు - కుబేరుడు - లోపాముద్ర
- కామదేవ -అగస్త్యుడు - నంది - సూర్యుడు - విష్ణువు - స్కందుడు - శివుడు -దూర్వాసుడు.
వీరేకాకుండా ఈ క్రింది పదముగ్గురు కూడా
అమ్మవారి ఉపాసకులే
ఇంద్రుడు - ఉన్మనీ - వరుణుడు - యముడు
- అగ్ని - నాగరాజు -వాయువు - బుధుడు - ఈశానుడు - రతి - నారాయణుడు - బ్రహ్మ -
బృహస్పతి
ఈ ఇరవై అయిదు ఉపాసకులూ ఉపాసించిన
మంత్రములను ఇప్పుడు చెప్పబడుచున్నవి.
ఇంకాఉంది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి