శ్రీమహాగణపతి ఆవరణార్చన కల్పము
కలౌ వినాయకో చండీ అని నానుడి. విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజ గణనాధునికే నిర్వహిస్తారని సాధకులకు, భక్తులకు విదితమే. నేటి కాలంలో మహా గణపతి చతురావృత్త తర్పణాలు, హోమములు ఎంతో ప్రాచుర్యం పొందాయి. శ్రీచక్రమును ఆవరణదేవతా సహితంగా పూజించే పద్ధతి సాధకులకు విదితమే. ఆ విధంగానే మహా గణపతి ఆవరణ పూజా పద్ధతి కూడా ఉంది. కానీ ఈ మహా గణపతి ఆవరణ పూజా విధానము ఎందువలన మరుగున పడిపోయినదో తెలియదు.
సర్వవాంఛితప్రదాయిని అయిన శ్రీమహా గణపతిని యంత్రరూపంలో పూజించడం ఎంతో గొప్పది. ఈ పుస్తకంలో గణపతి ఆవరణపూజ వివరంగా చెప్పబడింది. సాధకులకు, భక్తులకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఆ గణనాథుడిని ఆవరణదేవతలతో సహితంగా పూజించుకొని ఆయన కృపకు అందరూ పాత్రులవుదాము.
ఈ పుస్తకము మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి వారి వద్ద లభ్యమవుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి