సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

9, జులై 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 9

యోగాభ్యాస క్రమము

పద్మాసనము మీద కూర్చోని రెండు కళ్ళూ మూసుకోవాలి. చిత్తవృత్తిని మూలాధారమునందు లగ్నము చెయ్యాలి. మూలమంత్రమును ఉచ్చరిస్తూ ఇడా నాడీ నుండి పదహారు మాత్రలలో వాయువును పూరించాలి. ఆ వాయువును మూలాధారమునకు తీసుకురావాలి. అంగుష్ఠ - కనిష్ఠిక - అనామికలను కలిపి నాసాపుటమును బంధించాలి. 64 మాత్రల కాలము బాటు ఆ వాయువును లోపల కుంభించాలి. 32 మాత్రల కాలంలో ఆ వాయువును పింగళ నాడి ద్వారా నెమ్మ నెమ్మదిగా రేచకము చెయ్యాలి. ఈ విధంగా ఇది ఒక ప్రాణాయామము అవుతుంది. ఆ తర్వాత పింగళ ద్వారా వాయువును పూరించి (పైన చెప్పిన విధంగా) కుంభకము, రేచకము చెయ్యాలి. ఈ విధంగా వ్యతిరేక క్రమంలో 16/12/6/3/2 సార్లు యథాశక్తి చెయ్యాలి. అప్పుడు సిద్ధి ప్రాప్తిస్తుంది. శారదాతిలక తంత్రము ప్రకారము మాత్రావృద్ధి క్రమంగా ప్రాణాయమము చెయ్యాలి. ఈ ప్రాణాయామమునందు ఎల్లప్పుడూ అందరికీ అధికారము కలదు. ప్రాణాయమము చేయకపోతే నింద కలుగుతుంది. పూజాకాలంలో భూతశుద్ధి కొరకు ఇది అవశ్యకమని అగస్త్య సంహిత యందు చెప్పబడినది. ఇది సాధారణ ప్రాణాయామ పద్ధతి.

యోగపీఠ న్యాసము

ముందుగా సాధకుడు తన శరీరమునందు ముఖము, నాభి, రెండు పార్శ్వములు మరియు మధ్యభాగమును గాత్ర చతుష్టయముగా కల్పన చేసుకొని, ధ్యానము చేసి న్యాసము చెయ్యాలి.

ఓంఐంహ్రీంశ్రీం(4) మహాకాయాయ రక్తవర్ణాయ మండూకాయ నమః - మూలాధారే

4 పంచవక్త్ర దశభుజరక్తకృష్ణవామదక్షిణపార్శ్వాయ కాలాగ్ని రుద్రాయ నమః - స్వాధిష్ఠానే

4 బన్ధూక రుచిరాయై మూలప్రకృత్యై నమః - నాభి పర్యంతం

4 శరశ్చంద్రప్రభాయై పంకజద్వయ ధారిణ్యై ఆధారశక్త్యై నమః - హృదయే

4కూర్మాయనమః| అనంతాయ నమః| వరాహాయనమః| పృధివ్యై నమః| అమృతార్ణవాయనమః| సమస్త మాతృకాముచార్య నవఖండ విరాజితాయ నవరత్నమయ ద్వీపాయ నమః - హృదయే

4 అం ఆం + + + అః పుష్పరాగరత్నాయ నమః

హృదయస్థానమున నవఖండములో ఈశానాది మధ్యాంతం

4 కంఖంగంఘంఙo నీలరత్నాయ నమః

4 చంఛంజంఝంఞo వైడూర్యరత్నాయ నమః

4 టంఠండంఢంణం విద్రుమరత్నాయ నమః

4 తంథందంధంనం మౌక్తికరత్నాయ నమః

4 పంఫంబంభంమం మరకతరత్నాయ నమః

4 యంరంలంవం వజ్రరత్నాయ నమః

4 శంషంసంహం గోమేదరత్నాయ నమః

4 ళంక్షం పద్మరాగరత్నాయ నమః

4 స్వర్ణ పర్వతాయ నమః

4 నందనోద్యానాయ నమః

మీద చెప్పినదానికి పైన

4 కల్పకోద్యానాయ నమః

మీద చెప్పినదానికి మధ్యన

4 వసంతాది రుతుభ్యోనమః

మీద చెప్పినదానికి మధ్యన

4 ఇంద్రియాశ్వేభ్యోనమః

మీద చెప్పినదానికి పశ్చిమమున

4 ఇంద్రియార్ధగజేభ్యోనమః

మీద చెప్పినదానికి తూర్పున

4 విచిత్రరత్నభూమికాయై నమః

మీద చెప్పినదానికి తూర్పున

4 కాలచక్రేశ్వరీ శ్రీపాదుకాభ్యాం నమః

పశ్చిమ నుండి మధ్య వరకు విలోమ క్రమంలో

4 ముద్రాచక్రేశ్వరీ శ్రీపాదుకాభ్యాం నమః

4 మాతృకాచక్రేశ్వరీ శ్రీపాదుకాభ్యాం నమః

4 రత్నచక్రేశ్వరీ శ్రీపాదుకాభ్యాం నమః

4 దేశచక్రేశ్వరీ శ్రీపాదుకాభ్యాం నమః

4 గురుచక్రేశ్వరీ శ్రీపాదుకాభ్యాం నమః

4 తత్త్వచక్రేశ్వరీ శ్రీపాదుకాభ్యాం నమః

4 గ్రహచక్రేశ్వరీ శ్రీపాదుకాభ్యాం నమః

4 మూర్తిచక్రేశ్వరీ శ్రీపాదుకాభ్యాం నమః

4 కారణతోయ పరిధయే నమః

4 కాలరూపిణీశక్తి శ్రీపాదుకాభ్యాం నమః

4 ఆకాశరూపిణీశక్తి శ్రీపాదుకాభ్యాం నమః

4 శబ్దరూపిణీశక్తి శ్రీపాదుకాభ్యాం నమః

4 సంగీతయోగినీశక్తి శ్రీపాదుకాభ్యాం నమః

4 సమస్తగుప్తప్రకటయోగినీ చక్రరూపిణీ శక్తి శ్రీపాదుకాభ్యాం నమః

మీద చెప్పినదానికి మధ్యన

4 కల్పతరుభ్యో నమః

మీద చెప్పినదానికి మధ్యన

4 రత్నవేదికాయై నమః

మీద చెప్పినదానికి క్రిందన

4 శ్వేతచ్ఛత్రాయ నమః

మీద చెప్పినదానికి పైన

4 రత్నసింహాసనాయ నమః

మీద చెప్పినదానికి క్రిందన

 

ఈ ప్రకారము సాధకుడు తన మనస్సున న్యాసము చేసి పైన చెప్పిన స్థానములందు ఆయా దేవతలను అధిస్థాపితము చేసి తన శరీరమును రత్నసింహాసనముగా భావించి ఆ సింహాసనము మీద దేవతా ధ్యానము ఈ ప్రకారముగా చెయ్యాలి.

ఓంఐంహ్రీంశ్రీం రక్తవర్ణాయఋషభరూపాయ ధర్మాయ నమః - దక్షాంసే

ఓంఐంహ్రీంశ్రీం శ్యామవర్ణాయసింహరూపాయ జ్ఞానాయ నమః - వామాంసే

ఓంఐంహ్రీంశ్రీం పీతవర్ణాయభూతాకారాయ వైరాగ్యాయ నమః - వామోరౌ

ఓంఐంహ్రీంశ్రీం ఇంద్రనీలప్రభాయగజరూపాయ ఐశ్వర్యాయ నమః - దక్షోరౌ

పైన చెప్పిన నాలుగూ సింహాసన దేవత యొక్క పాద స్వరూపములు.

ఓంఐంహ్రీంశ్రీం అధర్మాయ నమః - ముఖే

ఓంఐంహ్రీంశ్రీం అజ్ఞానాయ నమః - వామపార్శ్వే

ఓంఐంహ్రీంశ్రీం అవైరాగ్యాయ నమః - నాభౌ

ఓంఐంహ్రీంశ్రీం అనైశ్వర్యాయ నమః - దక్షపార్శ్వే

పైవన్నీ సింహాసన దేవతయొక్క శరీర రూపములు

ఓంఐంహ్రీంశ్రీం మాయాయై నమః - మధ్యే

ఓంఐంహ్రీంశ్రీం విద్యాయై నమః - మధ్యే        

ఓంఐంహ్రీంశ్రీం ఆనందకందాయ నమః, ఓంఐంహ్రీంశ్రీం సంవిన్నాలాయ నమః, ఓంఐంహ్రీంశ్రీం ప్రకృతిమయ పత్రేభ్యో నమః, ఓంఐంహ్రీంశ్రీం వికారమయకేశరేభ్యో నమః, ఓంఐంహ్రీంశ్రీం పంచాశద్వర్ణబీజాఢ్యసరతత్త్వరూపాయై కర్ణికాయై నమః, ఓంఐంహ్రీంశ్రీం అం సూర్యమండలాయ నమః, ఓంఐంహ్రీంశ్రీం ఉం సోమమండలాయ నమః, ఓంఐంహ్రీంశ్రీం మం వహ్నిమండలాయ నమః, ఓంఐంహ్రీంశ్రీం సం సత్త్వాయ నమః, ఓంఐంహ్రీంశ్రీం రం రజసే నమః, ఓంఐంహ్రీంశ్రీం తం తమసే నమః, ఓంఐంహ్రీంశ్రీం ఆం ఆత్మనే నమః, ఓంఐంహ్రీంశ్రీం అంతరాత్మనే నమః, ఓంఐంహ్రీంశ్రీం పం పరమాత్మనే నమః, ఓంఐంహ్రీంశ్రీం జ్ఞానాత్మనే నమః - మధ్యకు పైన

ఓంఐంహ్రీంశ్రీం జ్ఞానతత్త్వాత్మనే నమః -  పూర్వే

ఓంఐంహ్రీంశ్రీం మాయాతత్త్వాత్మనే నమః - దక్షిణే

ఓంఐంహ్రీంశ్రీం కలాతత్త్వాత్మనే నమః - పశ్చిమే

ఓంఐంహ్రీంశ్రీం విద్యాతత్త్వాత్మనే నమః - ఉత్తరే

ఓంఐంహ్రీంశ్రీం పరతత్త్వాత్మనే నమః - మధ్యే

తర్వాత హృదయకమల దళములందు అష్టదిక్కులు మరియు మధ్యన శ్రీచక్రము యొక్క ఆధార పీఠ నవశక్తులను ఈ క్రింది ప్రకారము న్యాసము చెయ్యాలి -

ఓంఐంహ్రీంశ్రీం దూతర్యంబా శ్రీపాదుకాభ్యాం నమః|

ఓంఐంహ్రీంశ్రీం సుందర్యంబా శ్రీపాదుకాభ్యాం నమః|

ఓంఐంహ్రీంశ్రీం సుముఖ్యంబా శ్రీపాదుకాభ్యాం నమః|

ఓంఐంహ్రీంశ్రీం విరూపాంబా శ్రీపాదుకాభ్యాం నమః|

ఓంఐంహ్రీంశ్రీం విమలాంబా శ్రీపాదుకాభ్యాం నమః|

ఓంఐంహ్రీంశ్రీం అంతర్యంబా శ్రీపాదుకాభ్యాం నమః|

ఓంఐంహ్రీంశ్రీం వదర్యంబా శ్రీపాదుకాభ్యాం నమః|

ఓంఐంహ్రీంశ్రీం పురందర్యంబా శ్రీపాదుకాభ్యాం నమః|

ఓంఐంహ్రీంశ్రీం పుష్పమర్దన్యంబా శ్రీపాదుకాభ్యాం నమః|

పై నవశక్తులందరూ అభయ మరియు వరద ముద్రలను కలిగి రక్తవర్ణంలో ఉంటారు. ఈ విధంగా వీరి ధ్యానము చెయ్యాలి.

వీటిపైన ఓంఐంహ్రీంశ్రీంక్లీం సర్వశక్తికమలాసనాయనమః అను సింహాసన మంత్రమును న్యాసము చేసి దానిపైన శ్రీచక్రమును ధ్యానము చేసి ఓంఐంహ్రీంశ్రీం మూలం సమస్తప్రకటగుప్తగుప్తతరసంప్రదాయకుళోత్తీర్ణనిగర్భరహస్యఅతిరహస్య పరాపరాతిరహస్య యోగినీ  శ్రీచక్రపాదుకాభ్యోనమః అని ప్రార్థించాలి. ఈ విధంగా వ్యాపకము చేసి హృదయమున త్రికోణమును భావన చేసి దాని మధ్యన "ఓంఐంహ్రీంశ్రీం మూలం ఓం హ్రౌంక్లీం భగవతి బ్లూం నిత్యమాయేశ్వరి స్త్రీం సర్వసత్త్వవశంకరీ సః త్రిపురభైరవి ఐం విచ్చే హ్రీంశ్రా శ్రీమహాత్రిపుర సుందర్యంబా శ్రీపాదుకాభ్యాం నమః" అని న్యాసము చెయ్యాలి. తర్వాత ప్రణవాది నమోన్తముగా మూలవిద్యను న్యాసము చేసి శ్రీచక్రము యొక్క మూడు పురములను ధ్యానము చేసి అందు ఆరోహణ క్రమములో వాగ్భవకూటమును ఉచ్చారణ చేసి "చతురస్ర షోడశదళాష్టదళాత్మనే శరీరాత్మకాయ ప్రథమ పురాయ నమః" అని వ్యాపక న్యాసము చెయ్యాలి. ఆ తర్వాత "ఓంఐంహ్రీంశ్రీం కామరాజ కూటమును ఉచ్చరించి చతుర్దశార ద్విదశారాత్మనే బుద్ధ్యాత్మకాయ ద్వితీయపురాయ నమః" అని వ్యాపక న్యాసము చెయ్యాలి. ఆ తర్వాత " ఓంఐంహ్రీంశ్రీం శక్తికూటమును ఉచ్చరించి అష్టారత్రికోణ బిందు చక్రాత్మనే ప్రాణాత్మకాయ తృతీయపురాయ నమః" అని వ్యాపక న్యాసము చెయ్యాలి. ఆ తర్వత " ఓంఐంహ్రీంశ్రీం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్త్యాది సమస్త త్రిత్రయాత్మనే శ్రీచక్రస్య పురత్రయాయ నమః" అని కూడా వ్యాపక న్యాసము చెయ్యాలి.

ఈ ప్రకారంగానే హృదయస్థ త్రికోణములో వాగ్భవాది ధ్యానము, ప్రణవాది నమోన్త మూలవిద్యా న్యాసము, వాగ్భవాది కూటత్రయ న్యాసము చెయ్యాలి. ఆ తర్వాత, "నాద బిందు కళాజ్యేష్ఠా రౌద్రివామావిషఘ్నిదూతరీ సర్వానందాభ్యః శ్రీచక్రస్థ త్రైలోక్యమోహనాది నవచక్ర శక్తిభ్యోనమః" అని వ్యాపక న్యాసము చేయాలి. ఆ తర్వాత హృదయకమల దళములందు కామేశ్వరీ పీఠ నవశక్తుల న్యాసము చేయాలి.

ఓంఐంహ్రీంశ్రీం(4) మోహిన్యై నమః| 4 క్షోభిణ్యై నమః| 4 వశిన్యై నమః | 4 స్తంభిన్యై నమః| 4 ఆకర్షిణ్యై నమః| 4 ద్రావిణ్యై నమః| 4 ఆహ్లాదిన్యై నమః| 4 క్లిన్నాయై నమః| మధ్యే - క్లేదిన్యై నమః|

త్రికోణ మధ్యన 4 బాలా మూలం మరియు పంచదసీ ఉచ్చరించి "త్రికోణరక్తవర్ణ ఉడ్డియాన పీఠ శ్రీపాదుకాభ్యాం నమః"|

త్రికోణ అగ్రభాగము నందు 4 బాలా మూలం మరియు వాగ్భవ కూటము ఉచ్చరించి "చతురస్రపీతవర్ణ కామరూప పీఠ శ్రీపాదుకాభ్యాం నమః"| త్రికోణ దక్షకోణము నందు 4 బాలా మూలం మరియు కామరాజ కూటము ఉచ్చరించి "కామరాజద్వయమర్ధ చంద్రనిభశ్వేతవర్ణజాలంధరపీఠ శ్రీపాదుకాభ్యాం నమః"| త్రికోణ వామకోణము నందు 4 బాలా మూలం మరియు శక్తి కూటము ఉచ్చరించి "శక్తిబీజద్వయం షడ్ బిందులాంఛిత వృత్తధూమ్రవర్ణపూర్ణగిరిపీఠ శ్రీపాదుకాభ్యాం నమః"| అని ఈ ప్రకారంగా పీఠచతుష్టయ న్యాసము చెయ్యాలి. ఆ తర్వాత, బిందువు యొక్క ఆగ్నేయాది కోణములందు 4 లాం హ్రాంబ్రహ్మణే పృథివ్యాధిపతయే నమో బ్రహ్మప్రేతాసన శ్రీపాదుకాభ్యాం నమః| 4 వాం హ్రీం విష్ణవే పామధిపతయే నమో విష్ణు ప్రేతాసన శ్రీపాదుకాభ్యాం నమః| 4 రాం హ్రూం రుద్రాయ తేజోధిపతయే నమో రుద్రప్రేతాసన శ్రీపాదుకాభ్యాం నమః| 4 యాం హ్రౌం ఈశ్వరాయ వాయవ్యాధిపతయే నమో ఈశ్వర ప్రేతాసన శ్రీపాదుకాభ్యాం నమః| 4 హ్స్రౌం వియదధిపతయే పంచవక్త్రాయ సదాశివాయ ప్రేతపద్మాసనాయ నమః సదాశివ మహాప్రేత పద్మాసన శ్రీపాదుకాభ్యాం నమః|

ఈ విధంగా పంచప్రేతాసన న్యాసము చేసిన తర్వాత వాటిపైన రక్తపద్మకర్ణిక చతురస్రగర్భిత షట్కోణ పీఠమున ఆరు ఆసనముల న్యాసము చెయ్యాలి.

4 అంఆంసౌః త్రిపురాసుధార్ణవాసనాయ నమః| 4 ఐంక్లీంసౌః త్రిపురేశ్వరీ పోతాంబుజాసనాయ నమః| 4 హ్రీంక్లీంసౌః త్రిపురసుందరీ దేవ్యాత్మాసనాయ నమః| 4 హైం హ్క్లీం హ్సౌః త్రిపురవాసినీ సర్వచక్రాసనాయ నమః| 4 హ్సైంహ్స్క్లీం హ్సౌః త్రిపురాశ్రీసర్వమంత్రాసనాయ నమః| 4 హ్రీంక్లీంబ్లేం త్రిపురమాలినీ సాధ్యసిద్ధాసనాయ నమః|

పైవిధంగా న్యాసము చేసిన తర్వాత చతురశ్రమధ్యమున నాలుగు పీఠములు మరియు నాలుగు ఆసనముల ధ్యానము చెయ్యాలి. ఈశాన కోణమునందు 4 వాగ్భవద్వయముచ్చార్య అగ్నిచక్రే కామగిర్యాలయే మిత్రేషనాథాత్మకే జాగ్రద్దశాధిష్ఠాయకే ఇచ్ఛాశక్త్యాత్మకరుద్రాత్మకశక్తి కామేశ్వరీదేవీ హ్రీంక్లీంసౌః త్రిపురసుందరీ దేవ్యాత్మసనాయనమః| వాయవ్య కోణమునందు 4 కామరాజద్వయం సూర్యచక్రే జాలంధరపీఠే షష్ఠేశనాథాత్మకే స్వప్నదశాధిష్ఠాయకే జ్ఞానశక్త్యాత్మక విష్ణవాత్మకశక్తి శ్రీవజ్రేశ్వరీదేవి హైంహ్క్లీంహ్సౌః త్రిపురవాసినీ సర్వచక్రాసనాయ నమః|

నైఋతి కోణే: 4 శక్తియముచ్చార్య సోమచక్రే పూర్ణగిరిపీఠే ఉడ్దీశనాథాత్మక సుషుప్తి దశాధిష్ఠాయకే క్రియాశక్త్యాత్మక బ్రహ్మాత్మశక్తి శ్రీభగమాలినీదేవీ హ్సైంహ్స్కీంహ్సౌః త్రిపురాశ్రీ సర్వమంత్రాసనాయ నమః|

ఆగ్నేయకోణే: 4 సమస్తద్వయముచ్చార్య బ్రహ్మచక్రే మహోడ్యాణపీఠే శ్రీచర్యానాథాత్మక తుర్యాతీతదశాధిష్ఠాయకే పరబ్రహ్మశక్త్యాత్మక శ్రీమహాత్రిపుర సుందరీదేవీ హ్రీంక్లీంబ్లేం త్రిపురమాలినీ సాధ్యాసిద్ధాసనాయ నమః|

మధ్యే: 4 ఐంక్లీంసౌః పంచదశీ శ్రీమహాత్రిపురసుందరీ సర్వమంత్రాసనాయ నమః|

పై విధంగా న్యాసము చేసిన తర్వాత క్రింది విధంగా వ్యాపక న్యాసము చెయ్యాలి.

4 అంఆం+++క్షం శివశక్తి సదాశివేశ్వరశుద్ధవిద్యామాయాకాలనియతికలావిద్యారాగ పురుష ప్రకృతి బుద్ధ్యాహంకార మనస్త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణ వాక్పాణి పాద పాయూపస్థ శబ్ద స్పర్శరూప రస గంధాకాశ వాయు వహ్ని సలిల పృధివ్యాత్మనే శ్రీమహాత్రిపురసుందర్యా యోగపీఠాసనాయ నమః|

ఆ తర్వాత మూలమంత్రము ఉచ్చరించి శ్రీమన్మహాత్రిపురసుందరీ పాదుకాభ్యాం నమః| అని హృదయము నందు న్యాసము చెయ్యాలి. దీనినే యోగపీఠ న్యాసము అని అంటారు.

శారదాతిలక తంత్రము ప్రకారము, సంహార - సృష్టి క్రమములో మాతృకా న్యాసమును విగ్రహము కొరకు, దేవతా భావ ప్రాప్తికొరకు మంత్రన్యాసము చెయ్యాలి.

కామెంట్‌లు లేవు: