పన్నెండవ భాగము
కామేశ్వరీపూజా విధివివరణం
ఈశ్వరుడు చెప్పుచున్నాడు -
కేవలము కామబీజము "క" కామేశ్వరీ మంత్రము. ఈ మంత్ర దేవత - కామేశ్వరి| కం - బీజం| కం - శక్తిః| లం - కీలకం| ఈ విద్య పరమ వశీకారిణి.
కాం, కీం, కూం, కైం, కౌం, కః - ఈ బీజములతో
షడంగన్యాసం చెయ్యాలి.
ధ్యానం:
జపాకుసుమసంకాశాం ధనుర్బాణధరామ్ స్మరేత్|
నానాలంకారసుభగామ్ మోహయన్తీమ్ జగత్రయమ్||
సాధకుడు మూలమంత్రమును ఒక లక్ష జపం చేసి, బన్ధూక పుష్పములతో హోమము చెయ్యాలి.
జపసంఖ్యలో దశాంశము హోమ సంఖ్య ఉండును. దీనితో సాధకునకు పురశ్చరణ అవుతుంది.
యంత్రోద్ధారము:
త్రికోణ, అష్టదళ, భూపురము.
యంత్ర మధ్యలో సాధ్య నామము యుక్త బీజముతో లిఖించాలి. అష్టదళముల కోణములందు
(మూలములందు), అగ్రములందు మరియు భూపురము క్రిందన విద్యా
మంత్రమును లిఖించాలి.
ఈ యంత్రము త్రైలోక్య ఆకర్షణయందు ఎంతో
సమర్థవంతమైనది. ఈ యంత్రము మూడులోకములందునూ దుర్లభము. యంత్ర మధ్యలో ఒక పుష్పము ఉంచి
యాగార్చన చెయ్యాలి. యంత్ర నాలుగు దిశలు మరియు కోణములందు ఈ క్రింది దేవతలను
పూజించాలి.
1. మోహినీ 2. క్షోభిణి 3. వశినీ 4.
స్తంభినీ 5. ఆకర్షిణి 6. ద్రావిణీ 7. ఆహ్లాదినీ 8. క్లిన్నవజ్రా
ఆ తర్వాత సింహాసన మంత్రముతో దేవిని
ఆహ్వానించి ఉపచారములతో పూజించి యోని ముద్రను ప్రదర్శించాలి.
అగ్ని, ఈశాన, నైరుతి, వాయవ్య కోణములు మరియు వాని మధ్యగత దిశలందు షడంగ పూజ చెయ్యాలి.
త్రిపురేశ్వరీ మరియు ఆమె ఈ క్రింది
వర్గములను పూజించాలి.
అనంగకుసుమ - మధ్యే|
అష్టదళములలో -
1. అనంగరూపిణీ 2. అనంగమదనా 3. అనంగమన్మథ
4. అనంగమదనాతురా 5. అనంగరూపికా 6. అనంగశిశిరా 7. అనంగమేఖలా 8. అనంగదీపికా
ఆ తర్వాత ఇంద్రాది దశ దిక్పాలకులను భూపురమున
పూజించి శివుడిని అర్చించాలి.
ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస
గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు
మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ
ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ
అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము
చేసిన కామేశ్వరీపూజా విధివివరణం అను పన్నెండవ భాగము సమాప్తము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి