సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

23, జులై 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 11

కాకినీ న్యాసము

స్వాధిష్టాన స్థిత షడ్దళ కమలమునందు మేద ధాతురూపంగా కాకినీ దేవతను దళకర్ణికయందు ఈ క్రింది విధంగా ధ్యానించాలి.

స్వాధిష్ఠానాఖ్యపద్మే రసదళలలితే వేదవక్త్రాం త్రినేత్రాం

పీతాభాం ధారయంతీం త్రిశిఖగుణకపాలాభయాన్యాత్తగర్వామ్|

మేదోధాతు ప్రతిష్ఠామలిమదముదితామ్ బంధినీత్యాదియుక్తాం దధ్యన్నేసక్త

చిత్తామభిమత ఫలదాం కాకినీం భావయేత్తామ్||

పూర్వదళమునుండి క్రమముగా - బం బంధిన్యై నమః| భం భద్రకాళ్యైనమః| మం మహామహాయైమాయాయై నమః| యం యశస్విన్యై నమః| రం రక్తాయై నమః| లం లంబోష్ఠాయై నమః|

ఈ దేవతల రంగు, రూపము, ఆయుధములు కాకినీ దేవతకు సమానంగా ఉంటాయి. న్యాస, పూజాదులందు ఈవిధంగా భావించాలి.

శాకినీ న్యాసము

చతుర్దళ పద్మస్థిత మూలాధారము నందు అస్థి ధాతు అధిష్టాత్రి శాకినీ దేవిని పరివార సహితముగా కమల కర్ణికనందు ఈ ప్రకారము ధ్యానించాలి.

దేవీం జ్యోతిఃస్వరూపాం త్రినయనవిలసత్పంచవక్త్రాం సుదంష్ట్రాం

హస్తాంభోజేషు చాపం సృణిమపి దధతీం పుస్తకం జ్ఞానముద్రాం|

మూలాధారస్థ పద్మే నిఖిలపశుజనోన్మాదినీ మస్థిసంస్థామ్

ముద్గాన్నే ప్రీతియుక్తామ్ మధుమదముదితామ్ చింతయేత్ శాకినీంతాం||

పూర్వదళము నుండి క్రమముగా - వం వరదాయై నమః| శం శ్రియై నమః| షం షండాయై నమః| సం సరస్వత్యై నమః|

ఈ శక్తుల రూపము, ఆయుధములు శాకినీ దేవతకు సమానంగా ఉంటాయి. న్యాస, పూజాదులందు ఈవిధంగా భావించాలి.

హాకినీ న్యాసము

ద్విదళ పద్మ స్థిత ఆజ్ఞా చక్రమునందు మజ్జాధాతు అధిష్ఠాత్రి హాకినీ దేవతను ఈ క్రింది విధంగా ధ్యానించాలి.

భ్రూమధ్యే బిందు పద్మే ద్విదళ సులలితే శుక్లవర్ణాం కరాబ్జైర్భిభ్రాణాం

జ్ఞానముద్రాం డమరుకసహితామక్షమాలామ్ కపాలం|

షడ్ వక్త్రాం మజ్జసంస్థామ్ త్రినయన లలితాం హంసవత్యాదియుక్తామ్

హారిద్రాన్నే ప్రసక్తాం సకలసురనుతామ్ హాకినీం భావయేతాం||

హం హంసవత్యై నమః| క్షం క్షమావత్యై నమః| అని రెండు దళములందు న్యాసము చెయ్యాలి. ఈ దేవతల రూపము, ఆయుధములు హాకినీ దేవతకు సమానంగా ఉంటాయి. న్యాస, పూజాదులందు ఈవిధంగా భావించాలి.

యాకినీ న్యాసము

బ్రహ్మరంధ్ర సహస్రారమున ఉండు సహస్రదళ పద్మకర్ణికమున శుక్రధాతు అధిష్ఠాత్రి యాకినీ దేవతను ఈ క్రింది విధంగా ధ్యానించాలి.

ముందవ్యోమస్థ పద్మే సకలదళయుతే యాకినీం భైరవీం తాం

యక్షిణ్యాధ్యాం సమస్తాయుధ కలిత కరాం సర్వవర్ణాం సమష్టిం||

దాడీనామ్ సర్వవక్త్రాం సకలసుఖకరీమ్ సర్వధాతు స్వరూపామ్

సర్వాన్నే సత్కచిత్తామ్ పరశివరసికాం భావయేత్ సర్వరూపాం||

పైవిధముగా ధ్యానము చేసిన తర్వాత కర్ణికయందు మంత్ర న్యాసము చెయ్యాలి. అమృతాది శక్తులతో (పైన చెప్పిన యోగినుల న్యాసములు) న్యాసము చెయ్యాలి. ఈ శక్తుల రూపము, ఆయుధములు యాకినీ దేవతకు సమానంగా ఉంటాయి. న్యాస, పూజాదులందు ఈవిధంగా భావించాలి.

రాశిన్యాస క్రమము

మూలమంత్రముతో న్యాసము చేసి రాశులను ధ్యానించాలి. ఈ రాశుల వర్ణములు రక్త, శ్వేత, హేమ, పాండు, చిత్రం, శ్వేత, కపిల, కద్రు (=గోరోచనము వంటి వర్ణము), కర్బుర (=బంగారం), రక్త, ధూమ్ర, అనల (=అగ్ని)

అంఆంఇం - మేషం - దక్ష గుల్ఫే| ఉంఊం - వృషభం - జానునే|oo(2)oo(2) - మిధునం - దక్షఅండకోశము| ఏంఐం - కర్కాటకం - దక్షకుక్షే| ఓంఔం - సింహం - దక్షభుజే| శంషంసంహంళం - కన్యా - శిరోదక్షభాగే| క వర్గము - తులా - శిరోవామ భాగే| చ వర్గము - వృశ్చికము - వామభుజే| ట వర్గము - ధనస్సు - వామకుక్షే| త వర్గము - మకరము - వామ అండ కోశము| ప వర్గము - కుంభము - వామజానుని| యంరంలంవంక్షం - మీనం - వామగుల్ఫే|

ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన - ఈ అయిదు వాయువులు మేషము నుండి సింహము వరకు ఉన్న రాశి రూపములు. నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయ - ఈ అయిదు వాయువులు కన్య నుండి మకరము వరకు ఉన్న రాశి రూపములు. జీవాత్మ, పరమాత్మ కుంభము మరియు మీనా రాశుల రూపములు. సిద్ధి గురించి మేషాది రాశుల న్యాసము చెయ్యాలి.

పీఠన్యాసము

సర్వపథమంగా పీఠన్యాసము విధిప్రకారము చెయ్యాలి. ఈ పీఠములు శ్వేత, కృష్ణ, అరుణ, శ్యామ, హరిత, పీత వర్ణములు కలిగి ఉంటాయి. యాభై స్థానములందు వీటి న్యాసము యాభై వర్ణములతో చెయ్యాలి. అన్ని కోరికల సిద్ధికి పీఠములను స్మరించాలి. పీఠములు కామరూపాదులుగా ఉండును.

కామరతి న్యాసము

కామదేవ ఉపాసకులు కేవలము మాతృకలతో న్యాసము చెయ్యాలి. ఈ న్యాసములకు ఋషి - సమ్మోహన| ఛందస్సు - జగతి| దేవత, దేవి - కాముడు, అతని శక్తి| క్లీం - బీజం| నమః - శక్తిః| మాతృకా - కీలకం| క్లాం, క్లీం, క్లూం, క్లైం, క్లౌం, క్లః - వీటితో షడంగ న్యాసము చెయ్యాలి.

ధ్యానం:

అథ కామవరారోహే దాడిమీ కుసుమ ప్రభాం| వామాంగ శక్తి సహితాః పుష్ప బాణేక్షు కార్ముకాః||

శక్తయః కుంకుమనిభాః సర్వాభరణభూషితాః| నీలోత్పలకరాధ్యేయాస్త్రైలోక్యాకర్షణ క్షమాః||

ఓంఐంహ్రీంశ్రీం అం కామాయ రత్యై నమః| ఈ విధంగా కామరతి మాతృకలతో క్రమంగా న్యాసము చెయ్యాలి.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: