సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

16, జులై 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 10

న్యాసక్రమము

వైశంపాయన సంహితయందు ఈ విధంగా చెప్పబడినది - ఉపాస్య మంత్ర న్యాసములో ఋష్యాది న్యాసములు చెయ్యాలి. సిద్ధిపొందగోరువారు ఏ మంత్రమును ఉపాసిస్తారో ఆ మంత్ర న్యాసము చెయ్యాలి. జపము, తర్పణము, హోమము, అర్చనల వలన సిద్ధి కలిగినా సరే అంగన్యాస కరన్యాసములతో చెయ్యని మంత్ర జపము ఫలమునివ్వదు. అన్ని న్యాసములను సాధకుడు తన దేహమునందు చేసినచో అతడు మూడులోకములను వశపరచుకోగలడు. అతడి అన్ని పాపములూ వెంటనే పోవును. అన్ని రాక్షస, సర్పాదులు అతడికి దూరంగా ఉండును. ముందు ఋష్యాది న్యాసము చెయ్యాలి. ఆ తర్వాత వరుసగా కరన్యాస, అంగన్యాసములు, మంత్రవర్ణన్యాసము, మంత్రపద న్యాసము, విశేషమైన మంత్ర కల్పోక్త న్యాసము, మంత్ర పుటితవర్ణములతో సానుస్వార మాతృకా న్యాసములు చెయ్యాలి. మంత్రవిదుడు యుక్తముగా శాస్త్ర నిర్ధిష్ట మార్గములో న్యాసము చేసి, అంగన్యాస, కరన్యాసములు చేసి, ముద్రలను ప్రదర్శించాలి.

 శ్రీవిద్యాన్యాస క్రమము

         శ్రీవిద్యా విషయము నందు శుద్ధ అంతఃకరణముతో ఈ క్రింది న్యాసము చెయ్యాలి. సృష్టి-స్థితి-సంహార న్యాసములు, ఓంకార న్యాసము, కళాన్యాసము, శ్రీకంఠ న్యాసము, కేశవ మాతృకా న్యాసము, శక్తిన్యాసము, లక్ష్మీన్యాసము, కామన్యాసము, సర్వబీజ కలిత న్యాసము, ఆత్మయాగము, షోఢన్యాసము, నవవిధ చక్రన్యాసము, సర్వగుప్తమంత్రములతో న్యాసము.

         పైన చెప్పినవే గాక, త్రివిధాన్యాసములు అనగా షోఢ, శ్రీచక్ర, కరశుద్ధి న్యాసములు కూడా చెయ్యాలి. షోఢాన్యాసాము పూర్వషోఢా న్యాసము, ఉత్తరషోఢా న్యాసము అని రెండు రకములు. పూర్వషోఢా న్యాసము అన్ని ఆమ్నాయముల విషయము. ఉత్తరషోఢాన్యాసము ఊర్ధ్వామ్నాయ విషయము. శ్రీచక్ర న్యాసము సంహార-సృష్టి-స్థితి అను మూడు రకములు. కరశుద్ధి న్యాసము బహువిధములు. శ్రీకంఠాది రతికామాది న్యాసములు అందులో అంతర్భూతములు. షోఢా, సంహార శ్రీచక్ర, కరశుద్ధ్యాది న్యాసములు జపకాలము నందు చెయ్యాలి. స్థితి శ్రీచక్ర న్యాసము ఈ న్యాసములలో అంతర్భూతము. పూజాకాలమునందు సంహార న్యాసము, శ్రీచక్ర న్యాసమునకు ఉపలక్షణము అయిన కారణముగా దానిలో అంతర్భూతమయి నాలుగు రకములుగా ఏర్పడేను.

         షోఢా, అణిమాది, మూలదేవీ, కరశుద్ధి న్యాసములు సాధకునికి త్వరగా సిద్ధిని లభింపచేస్తాయి. ప్రాతఃకాల సమయములో లేదా పూజా సమయములో, హోమకాలములో, జపకాలములో ఈ న్యాసములు చెయ్యాలి. పూజా కాలము నందు సాధకుడు అన్ని న్యాసములనూ చేయాలని యోగినీహృదయ మతము.

పూర్వషోఢా న్యాసము

యోగినీ హృదయము ప్రకారము గణేశ, గ్రహ, నక్షత్ర, యోగినీ, రాశి, పీఠ న్యాసములు క్రమముగా పూర్వషోఢాన్యాసములు. ఈ న్యాసములు చెయ్యడం వలన సాధకుడు సర్వత్ర అపరాజితుడవుతాడు మరియు యోగుల ద్వారా పూజ్యుడవుతాడు. అతడు అందరిచేతా పూజ్యుడయి స్వయంగా పరమేశ్వరుడవుతాడు. ఏ సాధకుడు షోఢాన్యాసము చేయకుండా దేవికి ప్రణామము చేస్తాడో అతడు అల్పకాలములోనే మృత్యువు పొంది నరకమునకు పోవును.

జ్ఞానార్ణవమునందు ఈ విధంగా చెప్పబడినది - షోఢాన్యాసమును బ్రహ్మాండరూపకముగా చెయ్యాలి. ముందుగా గణేశ న్యాసము చెయ్యాలి. ఈ న్యాసము సర్వవిఘ్నవినాశకము. మూలముతో ధ్యానసహితంగా ఈ న్యాసమును మాతృకా న్యాసము ప్రకారము చెయ్యాలి. ఓం ఐంహ్రీంశ్రీం అం శ్రీవిఘ్నేశ్వరాభ్యాం నమః విఘ్నేశ్వరాయ శ్రియై నమః| విఘ్నేశ్వరశ్రీభ్యాంనమః| ఈ విధంగా గణేశ న్యాసము చెయ్యాలి. గణేశ మరియు శక్తి జ్ఞానము మాతృకాన్యాసము నుండి ప్రాప్తిస్తుంది. గణేశ న్యాసము తర్వాత గ్రహన్యాసము చెయ్యాలి. గణేశ ధ్యానము ఈ క్రింది విధంగా చెయ్యాలి.

"తరుణాదిత్య సంకాశాన్ గజవక్త్రాం త్రిలోచనాం| పాశాంకుశ వరాభీతికరాన్ శక్తి సమన్వితాన్||"

గ్రహన్యాస క్రమము

రక్త, శ్వేత, రక్త, శ్యామ, పీత పాండురం, ధూమ్రమ్, కృష్ణం, దూమ్రధూమ్రం వర్ణముల నవగ్రహములను ధ్యానము చెయ్యాలి. సూర్యాది నవగ్రహములు కామరూపధారులు మరియు సర్వాభరణములతో శోభిల్లుతూ ఉంటారు. స్వరములతో సూర్యుని న్యాసము హృదయమున, యవర్గముతో చంద్రుని న్యాసము భూమధ్యన, కవర్గముతో కుజుని న్యాసము నేత్రత్రయమున, టవర్గముతో బుధుని న్యాసము హృదయమున, త వర్గముతో బృహస్పతి న్యాసము హృదయము పైన, చ వర్గముతో శుక్రుని న్యాసము గళమున, ప వర్గముతో శని న్యాసము నాభిస్థానమున, శ వర్గముతో రాహు న్యాసము ముఖమున, ళక్ష లతో కేతు న్యాసము పాదములపైనా చెయ్యాలి.

సూర్యుని శక్తి రేణుక, చంద్రుని శక్తి అమృత, కుజుని శక్తి ధాన్యా, బుధుని శక్తి జ్ఞానరూప, గురుని శక్తి యశస్వినీ, శుక్రుని శక్తి శాంకరి, శని శక్తి శక్తి, రాహు శక్తి కృష్ణ, కేతు శక్తి ధూమ్ర. అంతిమ శక్తి అంబా.

నక్షత్రన్యాస క్రమము

నక్షత్రముల ధ్యానము ఈ క్రింది విధంగా చెయ్యాలి.

జ్వాలాత్కాలాగ్నిసంకాశాః సర్వాభరణ భూషితాః| నతిపాణ్యోశ్వినీపూర్వా వరదాభయ పాణయః||

1. అంఆం - అశ్వినీ - లలాటే| 2. ఇంఈం - భరణి - దక్షనేత్రే| 3. ఉంఊం - కృత్తిక - వామనేత్రే| 4. ఋoo(2)oo(2) - రోహిణి - దక్షకర్ణే| 5. ఏం - మృగశిర - వామకర్ణే| 6. ఐం - ఆరుద్ర - దక్షనాసే| 7. ఓంఔం - పునర్వసు - వామనాసే| 8. కం - పుష్యమి - కంఠే| 9. ఖంగం ఆశ్లేష - దక్షభుజే| 10. ఘంఙo - మఖ - వామభుజే| 11. చం - పుబ్బ - దక్షకూర్పరే| 12. ఛంజం - ఉత్తర - వామకూర్పరే| 13. ఝంఞo - హస్త - దక్షమణిబంధే| 14. టంఠం - చిత్త - వామమణిబంధే| 15. డం - స్వాతి - దక్షహస్తే| 16. ఢంణం - విశాఖ - వామహస్తే| 17. తంథoదం - అనురాధ - నాభే| 18. ధం - జ్యేష్ఠ - దక్షకట్యై| 19. నంపంఫం - మూల - వామకట్యై| 20. బం - పూర్వాషాఢ - దక్షోరౌ| 21. భం - ఉత్తరాషాఢ - వామోరౌ| 22. మం - శ్రవణం - దక్షజానుని| 23. యంరం - ధనిష్ట - వామజానుని| 24. లం - శతభిషం - దక్షజంఘే| 25. వంశం - పూర్వాభాద్ర - వామజంఘే| 26. షంసంహం - ఉత్తరాభాద్ర - దక్షపాదౌ| 27. క్షం - రేవతి - వామపాదౌ|

ఆ తర్వాత యోగినీ న్యాసము చెయ్యాలి.

యోగినీ న్యాస క్రమము

డాకినీ న్యాసము

షోడశదళ విశుద్ధి చక్రమునందు త్వగ్ధాతు దేవత ఉండును. సర్వసిద్ధి కొరకు ఆమెను సాధకులు ఈ క్రింది విధంగా ధ్యానించాలి.

"రక్తాం రక్తత్రినేత్రామ్ పశుజనభయ కృచ్ఛూలఖట్వాంగహస్తాం వామేకేటం దధానం చషకపపి సురాపూరితం చైకవక్త్రామ్| అత్యుగ్రాముగ్ర దంష్ట్రామరికులమథనీం పాయసాన్నే ప్రసక్తాం కంఠస్థానేమృతాద్యైః పరివృతవపుషమ్ భావయేడ్డాకినీమ్||"

డాండీండూండైండోండౌండమలవరయూం డాకినీ మాంరక్షరక్ష సర్వసత్త్వవశంకరీ దేవి ఆగచ్ఛఆగచ్ఛ ఇమాంపూజాంగృహ్ణగృహ్ణ ఐంఘోరేదేవిహ్రీంఔం అః ఘోరే హూం ఘోరరూపే ఏహ్యేహి నమః చాముండే డరలకసహైం శ్రీమహాత్రిపురసుందరీదేవీవిచ్చే వరదే స్వరాన్ విశుద్ధిపీఠస్థే విశుద్ధా డాకినీ విశుద్ధనాథ శ్రీపాదుకాం పూజయామి|

అంగుష్ఠ మరియు అనామికలను కలిపి దళ కర్ణికయందు స్వరములతో న్యాసము చెయ్యాలి. ఆ తర్వాత షోడశదళములందు పూర్వదళముతో మొదలుపెట్టి క్రమంగా ఐంఅంఅమృతాయై నమః| ఐంఆంఆకర్షిణ్యైనమః|... ఈ విధంగా ఇంద్రాణి, ఈశాని, ఉమా, ఊర్ధ్వకేశి, ఋద్ధిద, ఋషా, ఌకార, ఏకపాద, ఐశ్వర్య, ఓంకార, ఔషధాత్మిక, అంబిక, అక్షర| ఈ దేవతల న్యాసము చెయ్యాలి. ఈ శక్తుల రూపము, ఆయుధములు డాకినీ దేవతకు సమానము. న్యాస పూజాదులందు ఈ దేవత ఆయుధములను కూడా పూజించాలి.

రాకినీ న్యాసము

సాధకుడు అన్ని సిద్ధులకొరకు హృదయమున ద్వాదశదళ, రక్తధాతు సహిత అనాహత పద్మమునందు రాకినీ దేవతను ఈ క్రింది విధంగా ధ్యానించాలి.

"శ్యామాం శూలాబ్జహస్తాం డమరుక సహితాం తీక్ష్ణచక్రం వహంతీం ద్వాస్యాం రక్త త్రినేత్రామ్ భృకుటివలీల సద్దష్టదంతప్రభాభిః|

దీప్తాంతాం దేవదేవీం హృదయకమలగాం రక్తధాత్వేకనాథామ్ శుద్ధానేషు ప్రసక్తాం మధుమదముదితాం భావయేద్రాకిణీమ్ తాం"||

దళములందు పూర్వాది క్రమంలో ఈ క్రింది విధంగా న్యాసము చెయ్యాలి -

కం కాలరాత్ర్యైనమః| ఖం ఖండితాయై నమః| గం గాయత్ర్యై నమః| ఘం ఘంటాధారిణ్యై నమః|o ఙ్గార్ణాయైనమః| చం చాముండాయై నమః| ఛం ఛాయాయై నమః| జం జయాయై నమః| ఝం ఝంకారిణ్యై నమః|o ఞర్ణాత్మికాయై నమః| టం టంకహస్తాయై నమః| ఠం ఠంకారిణ్యై నమః|

ఈ శక్తుల రూపము, ఆయుధములు రాకినీ దేవతకు సమానము. న్యాస పూజాదులందు ఈ దేవత ఆయుధములను కూడా పూజించాలి.

లాకినీ న్యాసము

మణిపూరస్థిత దశదళ కమలమునందు మాంసధాతురూపముగా లాకినీ దేవతను దళకర్ణికయందు సర్వసిద్ధికొరకు ఈ క్రింది ప్రకారం ధ్యానించాలి.

కృష్ణాం దేవీంత్రివక్త్రామ్ త్రినయనసహితాం దంష్ట్రిణీముగ్రరూపాం

వజ్రం శక్తించ దండాభయవరదదరాన్ దక్షవామే దధానాం|

ధ్యాత్వా నాభిస్థపద్మేదశదళవిలసత్కర్ణికే లాకినీమ్ తాం

మాంసస్థామ్ గౌడభక్తోత్సుక హృదయవతీం చింతయేత్ సాధకేన్ద్రః||

పూర్వదళమునుండి క్రమముగా - డం డామర్యై నమః| ఢం ఢంకారిణ్యై నమః| ణం ణార్ణాయై నమః| తం తామస్యై నమః| థం స్థాణ్వైనమః| దం దాక్షాయణ్యై నమః| ధం ధాత్రై నమః| నం నందాయై నమః| పం పార్వత్యై నమః| ఫం ఫట్కారిణ్యై నమః|

ఈ శక్తుల రూపము, ఆయుధములు లాకినీ దేవతకు సమానము. న్యాస పూజాదులందు ఈ దేవత ఆయుధములను కూడా పూజించాలి.

                                                                               ఇంకాఉంది.. .. 

కామెంట్‌లు లేవు: