సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

11, జూన్ 2021, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఆరవశ్వాస - 6

జ్యోతిరష్టా త్రింశత్కళా న్యాసము

ఓం ఐం హ్రీం శ్రీం అం అమృతాయై నమః - శిరసి| ఈ విధంగా స్వరకళా న్యాసము చెయ్యాలి.

దక్షహస్తసంధి అగ్రమునందు (=దక్షబాహుమూల?) ఓం ఐం హ్రీం శ్రీం కంభం తపిన్యై నమః మొదలుగా ఙo నం జ్వాలిన్యై నమః వరకు న్యాసము చెయ్యాలి. వామహస్తసంధి అగ్రమునందు (=వామబాహుమూల?) ఓం ఐం హ్రీం శ్రీం చంధం రుచ్యై నమః నుండి ఞo ణం బోధిన్యై నమః వరకు న్యాసము చెయ్యాలి. దక్షపాద సంధి మరియు అగ్రభాగము నందు ఓం ఐం హ్రీం శ్రీం టంఢంధారిణ్యై నమః నుండి ఓం ఐం హ్రీం శ్రీం లం జ్వలిన్యై నమః వరకు న్యాసము చెయ్యాలి. వామపాదసంధి మరియు అగ్రభాగమునందు ఓం ఐం హ్రీం శ్రీం వం జ్వాలిన్యై నమః నుండి ఓం ఐం హ్రీం శ్రీం హం కపిలాయై నమః వరకు న్యాసము చెయ్యాలి. మిగిలిన రెండు కళలను మస్తకమునందు వ్యాపకము చెయ్యాలి. మిగతా కళాన్యాసముల వర్ణన తర్వాత చెప్పబడినవి. వాటి తర్వాత ప్రపంచ యాగము ఇంతకు ముందు చెప్పిన విధంగా (నాల్గవ శ్వాస చూడండి) చేయవలెను.

ప్రపంచయాగ ఫలము

        ఈ విధమైన వర్ణమయ హోమము వలన మనుష్యుడు దివ్యశరీరుడవుతాడు. అతడు ఏ మంత్రమును జపిస్తాడో ఆ మంత్రము సిద్ధిస్తుంది. ప్రపంచయాగమును ఆచరించడం వలన ఆ సాధకుడు కృతకృత్యుడవుతాడు మరియు అతనికి అన్ని మంత్రములూ స్ఫురిస్తాయి. అతడు సదాత్మయాగి అవుతాడు. ఈ విధానమును పాటించిన సాధకుడు ఎక్కడైనా, ఎప్పుడైనా మృత్యువు పొందితే అతడికి మోక్షము లభిస్తుంది.

        శుద్ధన్యాసము, సానుస్వారన్యాసము, కళాన్యాసము, కేశవమాతృకలు, శ్రీకంఠమాతృకలు, శక్తికమలాది దశవిధ న్యాసములతో చేసే ప్రత్యేక న్యాసమును బ్రహ్మయాగము అని అంటారు. ఇది సాధకుల కోరికలను సాధించుటకు కల్పవృక్షము వంటిది. విశేషంగా ప్రపంచయాగ సాధన సాంసారిక విపత్తులను నాశనము చేయు అగ్నివంటిది. ఎవరైతే ఈ సాధనను అర్ధసహితంగా నిత్యమూ ఆచరిస్తారో వారికి ఈ సాధన, విపత్తి నాశకము వవుతుంది. ఈ విషయము ప్రపంచ సారము నందు చెప్పబడినది.

        ఏ సాధకుడు ఏకాగ్రబుద్ధితో విశ్వమాతృకా న్యాసము, మంత్రజపము, దేవతాపూజ, హోమము యథావిధిగా చేస్తాడో అతడు సాక్షాత్ దేవతా సమీపమున కూర్చుంటాడు. ఈ విషయము శ్రుతులయందు కూడా చెప్పబడినది. ఎవరైతే న్యాసమును కవచయుక్తముగా చేసి మంత్రజపము చేస్తాడో అతడిని చూడడంతోనే అన్ని విఘ్నములు సింహమును చూసిన ఏనుగుల్లాగా పారిపోతాయి. న్యాసము చేయకుండా ఏ మూర్ఖుడు మంత్రజపము చేస్తాడో అతడిని అన్ని విఘ్నములూ పీడించుతాయి.

షట్రింశ తత్త్వ న్యాసము

ఓం ఐం హ్రీం శ్రీం క్షం పృథివీ తత్త్వవ్యాపికాయై శ్రీమహాత్రిపురసుందర్యైనమః - పాదయోః| ఈ విధంగా విలోమక్రమంలో ళమ్ - జలతత్త్వలింగే| తేజో - హృది| వాయుః - ముఖే| ఆకాశం - శిరసి| గంధ - పాదయోః| రసో - లింగే| రూపం - హృది| స్పర్శే - ముఖే| శబ్ద - శిరసి| ఉపస్థో - లింగే| పాయుః - పాయో| పాద - పాదయోః| పాణి - పాణ్యోః| వాక్ - ముఖే| ఘ్రాణం - ఘ్రాణయోః| జిహ్వా - జిహ్వాయాం| చక్షుః - చక్షో| త్వక్ - సర్వాంగే| శ్రోతం - శ్రోత్రయోః| మనో - హృది| అహంకారో - హృది| బుద్ధి - హృది| ప్రకృతి - సర్వగాత్రే| పురుష - సర్వగాత్రే| రాగో - హృది| విద్యా - హృది| కళా - హృది| నియతి - సర్వగాత్రే| కళాతత్త్వం - సర్వగాత్రే| మాయా - హృది| శుద్ధవిద్యా - హృది| ఈశ్వరో - హృది| సదాశివో - గ్రీవాయాం| శక్తి - మూలాధారే| శివ - సహస్రారే||

ప్రాణాయామవిధి

ప్రాణాయామము చెయ్యడం ద్వారా సాధకుడు మంత్రజపాదులందు అధికారి అవుతాడు. వాయువును నిగ్రహించి మంత్రజపము చెయ్యడం వలన మనః వాంఛితములు నెరవేరును. ఈ ప్రకారము ప్రాణాయామము చేసి యోగపీఠ న్యాసము చెయ్యాలి. మూలవిద్యతో ప్రాణాయామ త్రయము చేసి యోగపీఠ న్యాసము చెయ్యాలి. ప్రాణాయామ వివేచన ఈ క్రింది విధంగా ఉంటుంది.

శరీరము నుండి పన్నెండు అంగుళముల వరకు ప్రాణము విస్తరించి ఉంటుంది. ఈ విస్తారమును ఆయామము అంటారు. శరీరమును సంకుచితము చెయ్యడం, న్యూనత చెయ్యడంను కూడా ఆయామము అంటారు. ఈ విధమైన భావములను ప్రాణాయామము అంటారు. దీనిని పవన సంయమనము అని కూడా అంటారు.

        త్రిపురాసార సముచ్ఛయము ప్రకారము - ఈ శరీరము సాధకుని అంగుళికి తొంభైయారు అంగుళములు ఉంటుంది. నాసాఛిద్రము నుండి పన్నెండు అంగుళముల దూరం వరకు ఏ సాధకుని ప్రశ్వాస వెడుతుందో ఆ విద్వాన్ ను యోగి అంటారు. ఏ సాధకుని ప్రశ్వాస దూరము తక్కువ ఉంటుందో అతడు తన శరీర సమత్వము చేత ఈ భూమి యందు పూజ్య ఉత్తమ యోగజ్ఞాని అవుతాడు. ప్రాణాయామము పూరక-కుంభక-రేచక అని త్రయాత్మకము. కుంభక సమయంలో కనిష్ఠిక, అనామిక మరియు అంగుష్ఠములతో నాసాఛిద్రమును బంధించాలి. తర్జనీ మరియు మధ్యమును వదలి ప్రాణాయమము చెయ్యాలి.

        ప్రాణాయమము రెండు రకములు. ఒకటి, కుంభక సహిత మరియు రెండవది కుంభక రహిత. ఇందులో కుంభక సహిత తిరిగి రెండు రకములు. అవి రేచకము మరియు పూరకము.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: