శ్రీవిద్యామాతృకా న్యాసము
ఋషి -
దక్షిణామూర్తి| ఛందస్సు - గాయత్రి| దేవత - మాతృకారూప మహాత్రిపుర సుందరి| కూటత్రయములను
రెండు ఆవృత్తములతో షడంగ న్యాసము చెయ్యాలి.
ధ్యానం:
ఆరక్తభాం
త్రినేత్రాం మణిముకుటవతీం రత్నతాటంకరమ్యాం హస్తంభోజైః సపాశాంకుశ మదన ధనుః
సాయకైర్వీస్ఫురంతీం|
ఆపీనోత్తుంగ
వక్షోరుహ తటవిలుఠత్తా రహారోజ్జ్వలాంగీం ధ్యాయన్నంభోరుహస్థా మరుణ
నివాసనామీశ్వరీమాశ్రయామి||
ఓం ఐం
హ్రీం శ్రీం మూలం అం నమః| ఓం
ఐం హ్రీం శ్రీం మూలం ఆం నమః| ఈ విధంగా న్యాసం చెయ్యాలి.
హంస మాతృకా న్యాసము
ఋషి -
దక్షిణామూర్తి| ఛందస్సు - గాయత్రి| దేవత - హరగౌరీ మహాదేవి| హంసాం, హంసీం, హంసూం, హంసైం, హంసౌం, హంసః - ఈ బీజములతో షడంగ న్యాసము చెయ్యాలి.
ధ్యానం:
ఉద్యద్భాను
స్ఫుటితతడిదాకారమార్ధాంబికేశం పాశాభీతి వరదపరశు సంసధానం కరాబ్జైః|
దివ్యాకల్పైర్ణవమణిమయైః
శోభితం విశ్వమూలం సౌభ్యాగ్నేయం వపురవతు వశ్చంద్రచూడం త్రినేత్రం||
ఓం ఐం
హ్రీం శ్రీం హంసః నమః - శిరసి| ఈ విధంగా న్యాసం చెయ్యాలి.
పరమహంస మాతృకా న్యాసము
ఋషి -
పరమహంస| ఛందస్సు - విరాట్| దేవత - చిన్మయి పరమాత్మ స్వరూపిణి| ఓం తో వర్గములను
(క-చ-ట-త-ప-య) సంపుటీకరణ చేసి షడంగ న్యాసము చెయ్యాలి.
ధ్యానం:
శ్రీమత్పరాత్మమనుజృంభితవర్ణరూపాం
మానైరగమ్య పదవీపరిచీయమానామ్|
విద్యాక్షసూత్రకలశం
దధతీంచముద్రాం ధ్యాయేత్ సమస్తజననీం విశదాం త్రినేత్రామ్||
ఓం ఐం
హ్రీం శ్రీం సోహం క్షం నమః| ఓం ఐం హ్రీం శ్రీం సోహం ళo నమః| ఈ విధంగా విలోమమాతృకలతో న్యాసము చెయ్యాలి.
పంచవిధ కళా న్యాసములు
తారోత్థ
కళా, కామకళా, సోమకళా, త్రిమూర్తికళా,
అష్టత్రింశకళా - ఇవి పంచవిధ కళా న్యాసములు. అష్టత్రింశకళా న్యాసములు రెండు
ప్రకారములు. అవి జ్యోతిరష్టా త్రింశత్కలా మరియు శివాష్టా త్రింశత్కలా న్యాసములు. తారోత్థకళా
న్యాసములు ఇంతకు ముందు చెప్పబడినది. (=కళామాతృకా న్యాసములు). అయితే ఇక్కడ విశేషము ఏమనగా, ఓం నకు నమః కు మధ్య తారాది వర్ణములను చేర్చి ఓం అం నమః అని న్యాసము
చెయ్యాలి. ఉదా: ఓం (తారాది వర్ణము) నమః ఓం అం నమః| తారాపంచ
భేదములతో యాభై వర్ణముల కళాన్యాసము చెయ్యాలి.
స్వరకళా
న్యాసము తర్వాత ఈ క్రింది విధంగా ధ్యానము చెయ్యాలి.
సదాశివేనసంజాతానాదాదేతాఃసితత్విషః|అక్షస్రక్పుస్తకకరాః కపాలాఢ్యకరాం బుజాః|
క-చవర్గ
కళాన్యాసము తర్వాత ఈ క్రింది విధంగా ధ్యానము చెయ్యాలి.
అకారాద్
బ్రహ్మణోత్పన్నాస్తపతా చామీకరప్రభాః| కరాంబుజధృతాక్షస్రక్పంజాభయ కుండికా||
ట-తవర్గ
కళాన్యాసము తర్వాత ఈ క్రింది విధంగా ధ్యానము చెయ్యాలి.
ఉకారాద్విష్ణునోత్పన్నాస్తమాలదలసన్నిభాః| అభీతిదరచక్రేష్టబాహవః పరికీర్తితాః||
ప-యవర్గ
కళాన్యాసము తర్వాత ఈ క్రింది విధంగా ధ్యానము చెయ్యాలి.
ఈశ్వరేణోదితా
బిందోర్జపాకుసుమసన్నిభాః|
ఉద్వహన్త్యోభయంశూలంకపాలం బాహుభిర్వరం||
షవర్గ
కళాన్యాసము తర్వాత ఈ క్రింది విధంగా ధ్యానము చెయ్యాలి.
ఈశ్వరేణోదితా
బిందోర్జపాకుసుమసన్నిభాః|
అభయంహరిణంటంకందధానా బాహుభిర్వరం||
(విశేషపూజను
పాత్రా సాధన ప్రకరణంలో తెలుసుకోవచ్చును)
ఇంకాఉంది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి