పాపపురుష చింతనము
పాపపురుషుడు వామకుక్షిలో కాటుక రంగులో ఉంటాడు. బ్రహ్మ హత్య వలన శిరస్సు, స్వర్ణమును దొంగలించడం వలన రెండు చేతులనూ, సురాపానము వలన హృదయము, గురుతల్పగమనము వలన కటిద్వయము పాపయుక్తములు. అతడి రోమములు ఉపపాతకములు. అతడి గెడ్డము మరియు కళ్ళు ఎర్రగా ఉండును. ఖడ్గము, డాలు ధరించి ఉండును.
పాపపురుషుడిని
పై విధంగా ధ్యానించి ఈ క్రింది మంత్రమును పఠించాలి.
"యం
పాపశరీరం శోషయశోషయ శోషయామి స్వాహా"
ధూమ్రవర్ణ
యం బీజమును పదహారుసార్లు జపము చేసి వామనాసిక నుండి శ్వాసను తీసుకోవాలి. ఆ తర్వాత
అరవైనాలుగుసార్లు జపముతో కుంభకము చేసి హృదయ షట్ కోణము నుండి వచ్చిన మహావాయువుతో
పాపపురుషుడిని శుష్కింపచెయ్యాలి. ఆ తర్వాత యం బీజమును ముఫైరెండుసార్లు జపము చేసి
కుడి నాసాపుట ద్వారా వాయువును ఈ క్రింది మంత్రము పఠిస్తూ బయటకు వదలాలి (రేచకం). రం శుష్క శరీరం దాహయదాహయ దాహయామి స్వాహా|
రం
బీజమును పదహారుసార్లు జపము చేసి పింగలానాడి ద్వారా వాయువును తీసుకొని
అరవైనాలుగుసార్లు జపము చేసి కుంభక యోగముతో నాభి త్రికోణము నుండి ఉదయించిన మహా
అగ్ని నందు పాపపురుషుడు దగ్ధమైనట్లు చింతించాలి. ఆ తర్వాత ముఫైరెండుసార్లు జపము
చేసి ఈ క్రింది మంత్రము పఠిస్తూ ఇడా నాసిక ద్వారా రేచకం చెయ్యాలి. "టం
చంద్రమండలం ప్రేరయప్రేరయప్రేరయామి స్వాహా". టం బీజము శుక్ల వర్ణము. ఈ బీజమును
పదహారుసార్లు జపము చేసి ఇడ నుండి వాయువును పూరించాలి. అరవైనాలుగుసార్లు జపముతో
కుంభకము చేసి, ఆ యోగముతో సహస్రారమున
మహాఅమృత ఓఘ పూరిత విశ్వాహ్లాదక చంద్రబీజమును చింతన చేసి ముఫైరెండుసార్లు జపము చేసి
పింగళ నుండి రేచకం చెయ్యాలి.
వం
పరామృతం వర్షయవర్షయవర్షాయామి స్వాహా| అను మంత్రంతో వరుణ బీజము వం ను పదహారుసార్లు జపించి పింగలద్వారా శ్వాసను
పూరించి, అరవైనాలుగుసార్లు జపముతో కుంభకము చేసి దానిద్వారా
మాతృకామాయి చంద్రబింబము నిండి మహావృష్టి జాలువారి అస్థిశ్మశానాదులను తడిపినట్టుగా
భావించి, ముఫైరెండుసార్లు జపము చేసి ఇడ నుండి రేచకం
చెయ్యాలి.
లం
పృధ్వీ బీజము, పీతవర్ణము. లం
శరీరముత్పాదయఉద్పాదయఉదయామి స్వాహా| అను మంత్రమును పఠించి, లం బీజమును పదహారుసార్లు జపించి ఇడాద్వారా శ్వాసను పూరించి
అరవైనాలుగుసార్లు జపము చేసి కుంభక యోగముతో "ఓం పరమాత్మ జీవాత్మ చిత్తబుద్ధి
మనఅహంకార నిశ్చయ వ్యవసాయ సంకల్ప వికల్ప వచనాదాన విసర్గానంద గమన వాక్పాణి పాయూపస్థ
పాద శ్రోత్ర త్వక్ చక్షు జిహ్వాఘ్రాణశబ్దస్పర్శ రూపరసగాంధాకాశవాయుతేజజల పృధివీ
సమస్త తత్త్వాత్మక ప్రపంచరూప స్థూలసూక్ష్మశరీరద్వయ సృష్టి క్రమేణ పృథగ్భూతాభ్యాం
పరమశివ చిచ్ఛక్తిభ్యాం నిరూత్పత్తి ప్రయోగేణ పురుషం పురుష పాదాద్యోత్పత్తి
ప్రయోగేణ ప్రకృతిం పకృతేరర్ధోత్పత్తి ప్రయోగేణ మహాన్తం మహతః సర్వోత్పత్తి
ప్రయోగేణాకాశాద్ ఆకాశద్విరూత్పత్తి ప్రయోగేణ వాయుం వాయోస్త్రిరూత్పత్తి
ప్రయోగేణతేజస్ తేజశ్చతురుత్పత్తి ప్రయోగేణ జలం జలాత్పంచోత్పత్తి ప్రయోగేణ పృధ్వీమ్
పృధివ్యాః షడుత్పత్తి ప్రయోగేణ ఉత్పాదయామి స్వాహా" అని పఠించాలి.
ఇతి
సస్థానాని సాక్షరాణి సకారణాని సకార్యాణి సదైవతాణి సాంగోపాంగాని స్థూలాని
సూక్ష్మాణిచ సర్వాణి తత్త్వాని సృష్టిక్రమేణ పరశివచిచ్ఛక్తి సకాశాత్
స్వస్వకారణేభ్య ఉత్పాదితానికృత్వా|
తర్వాత
దేవతా పూజ యోగ్యమైన కొత్త శరీరం ఉత్పన్నమయినట్లుగా భావించాలి. తత్త్వములను వాటి
నిజ స్థానములందు స్థాపించినట్లుగా భావన చెయ్యాలి.
ఆ తర్వాత
లం బీజమును ముఫైరెండుసార్లు జపము చేసి పింగళ ద్వారా శ్వాసను పూరించి
అరవైనాలుగుసార్లు జపము చేసి ఇడ నుండి రేచకం చెయ్యాలి.
"ఓం
హంసః సోహం అవతరఅవతరశివపదాత్ జీవపదేనసుషుమ్నా వర్త్మనా మూల శృంగాటకముల్లస ఉల్లస
ప్రజ్జ్వలప్రజ్జ్వల ఓం హంసః సోహం"
పై మంత్రముతో కుండలినీరూప ధారిణీ చిత్ శక్తి
జీవాత్మతో బాటుగా సృష్టి యోగముతో హృదయము నందు ఉండునట్లుగా భావించాలి.
ప్రాణప్రతిష్ఠా
ప్రాణప్రతిష్టా
వినియోగము ఈ క్రింది ప్రకారముగా ఉంటుంది -
అస్య
శ్రీప్రాణప్రతిష్ఠా మంత్రస్య| బ్రహ్మా-విష్ణు-రుద్ర ఋషయః| ఋగ్యజుస్సామాని ఛందాంసి| చైతన్యరూపప్రాణశక్తి దేవతా| ఓం - బీజం| హ్రీం - శక్తిః| క్రోం - కీలకం| ప్రాణప్రతిష్ఠాపనే వినియోగః|
కరన్యాసం:
అంకంఖంగంఘంఙoఆం ఆకాశవాయుతేజజలపృధివ్యాత్మనే -
అంగుష్ఠాభ్యాం నమః
ఇం
చంఛంజంఝంఞoఈం శబ్దస్పర్శరూపరసగాంధాత్మనే
- తర్జనీభ్యాం నమః
ఉంటంఠండంఢంణంఊం
శ్రోత్రత్వక్చక్షుజిహ్వాఘ్రాణాత్మనే- మధ్యమాభ్యాం నమః
ఏం
తంథందంధంనంఐం వాక్పాణిపాదపాయూపస్థాత్మనే - అనామికాభ్యాం నమః
ఓంపంఫంబంభంమంఔం
వచనాదానవిసర్గానందగమనాత్మనే - కనిష్ఠికాభ్యాం నమః
అంయంరంలంవంశంషంసంహంళంక్షంఅః
చిత్తబుద్ధిమనఃఅహంకారాత్మనే - కరతలకరపృష్ఠాభ్యాం నమః|
ఈ
విధంగానే అంగన్యాసం కూడా చెయ్యాలి.
ఆ తర్వాత,
ఆం నమః
అని చెప్పి నాభి నుండి పాదముల వరకు స్పర్శించాలి.
హ్రీం
నమః అని చెప్పి హృదయము నుండి నాభి వరకు స్పర్శించాలి.
క్రోం
నమః అని చెప్పి మూర్ధ నుండి హృదయము వరకు స్పర్శించాలి.
హృదయము నందు ఈ క్రింది విధంగా న్యసించాలి -
యం
త్వగాత్మనే నమః| రం అసృగాత్మనే నమః| వం మేదాత్మనే నమః| శం అస్థ్యాత్మనే నమః| షం మజ్జాత్మనే నమః| సం శుక్రాత్మనే నమః| హం ప్రాణాత్మనే నమః:| లం జీవాత్మనే నమః| క్షం పరమాత్మనే నమః|
ఈ
క్రింది విధంగా ప్రాణశక్తిని ధ్యానించాలి.
రక్తాబ్ధిపోతారుణపద్మసంస్థామ్
పాశాంకుశావిక్షుశరాసబాణాన్|
శూలంకపాలం
దధతీంకరాబ్జైరక్తాంత్రినేత్రామ్ ప్రణమామి దేవీం||
జ్ఞానముద్రతో
హృదయము మీద చేతిని ఉంచి మూడుసార్లు "ఓం ఆం హంసః" అను మంత్రమును
పఠించాలి.
తర్వాత, దేహమును సర్వానందమయమైనట్లుగా మరియు దృఢముగా
అయినట్లుగా భావించాలి. బయట-లోపల ఉన్న ప్రథానదేవతాత్మను దేహాత్మనందు భావించాలి.
ఇది శ్రీవిద్యారణ్యయతి రచించిన శ్రీవిద్యార్ణవతంత్రమునకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన అయిదవశ్వాస సమాప్తము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి