సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

18, జనవరి 2021, సోమవారం

మహామనుస్తవం - 13, 14

 

13.   ఈశ్వరి మాయికమఖిలం ప్రావరణం చక్షుశోపహర మాతః|

       యేనామాయికమఖిలం ప్రేక్షేయతవేతి యాచతే విద్వాన్||

శ్రీమహారాజ్ఞి అమ్మా! నా కళ్ళకు పట్టిన భ్రాంతి అనే ముసుగును తొలగించు. అప్పుడు నేను మాయ రహితమైన నిన్ను చూడగలను. ఈ విధంగా విద్వాంసులు ప్రార్థిస్తున్నారు.

అమ్మ సత్యమైనది. నిజానికి ఆమెకు ఎటువంటి మాయలు, భ్రాంతులు లేవు. కానీ సాధారణ జీవులకు, ఆమెకు మధ్యన మాయ అనే ఒక బ్రాంతి, తెర లేదా ముసుగులాగా ఉంది. ఎవరైతే ఆ మాయ అనే తెరను తొలగించుకోగలగుతారో వారికి అమ్మవారి నిజరూపము కనబడుతుంది. పరతత్త్వ జ్ఞాన వాసన కలుగకపోవడమే ఆ భ్రాంతి లేదా మాయ.

14.   లలితే భగవతి భవతి ముపగచ్ఛామస్తదత్ర కురు దయితమ్|

       అంతస్సంతమసంనో హరేన్తి దేవీముపాసతే విజ్ఞాః||

అమ్మా భగవతీ లలితా! మేము నీ దగ్గరకు వచ్చాము. మమ్మల్ని నీ ప్రియమైన బిడ్డలుగా చేరదీయు. అజ్ఞానమనే మా చీకట్లను తొలగించు. విజ్ఞులు అమ్మను ఈ విధంగా ప్రార్థిస్తారు.

ఉపాసన, ఉపస్థాన మరియు ఉపవాస అనునవి భగవంతునికి దగ్గరగా ఉండడం అన్న అర్ధమును సూచిస్తాయి. ఆరాధన వలన సాధకుడు భగవంతుని దగ్గరకు చేరుకోగలుగుతాడు. ఆ సామీప్య స్థితి వలన సాధకుడు భగవంతునికి ప్రియమైనవాడు అవుతాడు.

భగవంతుని ఆరాధన చాలా ముఖ్యమని ఈ శ్లోకం వలన మనకు తెలుస్తున్నది. ఆరాధనే మనం భగవంతుని చెంతకు చేరడానికి సులభమైన మార్గము.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: