మండపధ్యానం
అమృతాబ్దౌమణిద్వీపేచింతయేన్నందనవనం| చంపకాశోకపున్నాగపాటలైరుపశోభితం||
లవంగమూలతీబిళ్వదేవదారునమేరుభిః| మందారపారిజాతాద్యౌఃకల్పవృక్షైఃసుపిష్పితైః||
చందనైఃకర్ణికారైశ్చమాతులుఙ్గైశ్చవంజులైః| దాడిమీలకుచ్చాఙ్కోలైఃపూగైఃకురుబకైరపి||
కదలీకుందమందారనారికేలైదలంకృతం| అన్యైఃసుగంధిపుష్పాఢ్యైవృక్షషండైశ్చమండితం||
మాలతీమల్లికాజాతీకేతకైఃశతపత్రకైః| పారంతీతులసీనంద్యావరైర్దమనకైరపి||
సర్వర్తుకుసుమోపేతైర్లసద్భిరూపశోభితంమందమారుతసంభిన్నకుసుమామోదిదిఙ్ముఖం||
తస్యమధ్యేపరజ్యోతిఃస్వరూపోమేరుపర్వతః|తస్యమధ్యేసదాఫుల్లైఃకుముదోత్పలపంకజైః||
సుగంధికైశ్చకల్హారైర్నవైఃకువలయైరపి|హంససారసకారండభ్రమరైశ్చక్రనామభిః||
అన్యైఃకలకలారావవిహంగైరుపశోభితం|మహాసరసి తన్మధ్యే పులినేతిమనోహరే||
పరితఃపారిజాతాఢ్యంమహాకల్పతరుంస్మరేత్|నీపోపవనమధ్యస్థంనానాపుష్పసుపిష్టితమ్||
నానారత్నఫలాకీర్ణంఛాయాశ్రితజగత్రయం|ఉద్భూతరత్నచ్ఛాయాభిరరుణీకృతభూతలం||
ఉద్యాద్దినకరేన్దుభ్యాముద్భాసితదిగంతరం|ఋతుభిఃసేవితం షడ్ భిరనిశంప్రీతివర్ధనం||
పరామృతాఖ్యమధుభిఃసించంతమ్ మండపంముహుః| తస్యాధస్తాన్మహా వేదిర్మాణిక్యైక వినిర్మితా||
వజ్రప్రాకారసందీప్తా శతయోజనవిస్తృతా|తన్మధ్యేచింతయేద్దీప్తంమండపంమణికుట్టిమం||
ఉద్యదాదిత్యసంకాశంభాస్వరంశశిశీతలం|చతుర్ద్వారసమాయుక్తం హేమప్రాకారశోభితం||
రత్నోపక్లుప్తసంశోభికపాటాష్టకశోభితం|నవరత్నసమాక్లుప్తతుంగగోపురతోరణం||
హేమదండసమాలంబిధ్వజావలిపరిష్కృతం|నవరత్నసమాబద్ధస్తంభరాజివిరాజితం||
సహస్రదీపసంయుక్తదీపమండలరాజితం|తప్తహటకసంక్లుప్తవాతాయనమనోహరం||
నానావర్ణాంశుకాబద్ధసువర్ణశతకోటిభిః|కింకిణీమాలికాయుక్తపతాకాభిరలంకృతం||
హేమకుంభావలీరమ్యనానాచిత్రవిచిత్రితమ్|జాతరూపమయైరత్నఖచ్చితైరతివిస్తృతైః||
మాణిక్యరాట్నవైడూర్యస్వర్ణమాలావలీయుతైః|అంతరాంతరసంబద్ధరత్నైర్దుష్టిమనోహరైః||
విచిత్రైశ్చిత్రవర్ణైశ్చవితానైరూపశోభితం|సర్వరత్నసమాయుక్తహేమకుట్టిమముజ్జ్వలం||
కేతకీమాలతీజాతీచంపకోత్పలకేసరైః|మల్లికాతులసీయూథీనంద్యావర్తకదంబకైః||
ఏతైరన్యైశ్చకుసుమైరలంకృతమహీతలం|రత్నసోపానసన్నద్ధభూమికాభిరుపస్కృతం||
చంద్రకాశ్మీరకస్తూరీమృగనాభితమాలకైః|చందనాగురుకర్పూరైరాదీపితదిగంతరం||
పుష్పమాలావలీరమ్యముక్తాశ్రేణివిరాజితం|కర్పూరదీపభాస్వంతంమాణిక్యదీపమండితం||
కల్పవృక్షతరుప్రాంతమంతరారత్నవేదికామ్|రత్నసింహాసనేనద్ధమ్ శ్రీమచ్ఛీచక్రమండితం||
ఇంద్రాదిదేవతావృందైర్బ్రహ్మవిష్ణుశివాదిభిః|అనేకయోగినీవృన్దైరస్త్రదైవతకైరపి||
సంసేవ్యమానపాదాబ్జాయుగ్మయాతత్స్వరూపయా|మహాత్రిపురసుందర్యాధిష్ఠితంసర్వకామదం||
సుధాసందోహకల్లోలలోలితంమోక్షకామదం|అనేకధూపబహుళంమండపంచింతయేత్ సుధీః||
తన్మండపస్థమాత్మానంధ్యాయేన్నాకులచేతసం|భైరవోహమితిజ్ఞాత్వాసర్వజ్ఞాదిగుణాన్వితా||
- ఇతి మండపధ్యానం
మండపద్వారపూజ
స్వర్ణప్రాకారమునకు
పూర్వద్వారమునుండి లోపలికి ప్రవేశించి ప్రదక్షిణక్రమములో మణిమండప పశ్చిమద్వారమునకు
వచ్చి అక్కడ నుండి ప్రారంభించి ప్రదక్షిణచేసి తిరిగి పశ్చిమద్వారమునకు వచ్చి
అందునుండి లోపలికి ప్రవేశించాలి. ద్వారదేవతలకు పూజ చెయ్యాలి.
యాగమండపము
లేనిచో గోమయముతో అలికిన యాగభూమికి పశ్చిమ భాగమున సామాన్యార్ఘ్యముతో ఒక ద్వారమును
కల్పించుకొని ఆ ద్వారమునకు పూజచెయ్యాలి. కోటియోజన విస్తృతమైన అమృతసాగరములో అత్యంత
అద్భుతమూ, నవరత్నమయమైన, సహస్రాదిత్యుల తేజస్సు కలిగిన ద్వీపము ఉంటుంది. దాని తృతీయాంశ మధ్యమున
మదనోన్మాదన అను పేరుగల పుష్పలతాయుక్త కదంబ అటవీ గర్భమున నందనోద్యానము ఉంటుంది. దాని
తృతీయాంశములో కోటిసూర్యులతో భాసితమైన, దీప్తమానమైన
సూర్యప్రాకారము, అనేక సుగంధి తోరణములతోనూ, బహువిధములైన రత్నములతోనూ అలంకరింపబడిన ద్వారము ఉంటుంది. ఇంద్రాది దేవతలచే
సుపూజితమైన శ్రీమండపమును ధ్యానించి సామాన్యార్ఘ్యముతో ప్రోక్షణ చేసి ద్వారమును ఈ
క్రింది మంత్రములతో క్రమంగా పూజించాలి.
ఓం ఐం హ్రీం శ్రీం సుధార్ణవాయ నమః
ఓం ఐం హ్రీం శ్రీం రత్నమయద్వీపాయ నమః
ఓం ఐం హ్రీం శ్రీం నందనోద్యానాయ నమః
ఓం ఐం హ్రీం శ్రీం స్వర్ణప్రాకారాయ నమః
ఆ ద్వారమునకు
దక్షిణ, ఉత్తర,
ఊర్ధ్వ, అధో ద్వారబంధములకు ఈ క్రింది మంత్రములతో పూజ
చెయ్యాలి.
ఓం ఐం హ్రీం శ్రీం గాం గణేశపాదుకాం
పూజయామి
ఓం ఐం హ్రీం శ్రీం క్షాం
క్షేత్రపాలపాదుకాం పూజయామి
ఓం ఐం హ్రీం శ్రీం ద్వాం ద్వారశ్రీపాదుకాం
పూజయామి
ఓం ఐం హ్రీం శ్రీం దేం దేహలీశ్రీపాదుకాం
పూజయామి
ఆ తర్వాత
మండపము లోనికి ముందుగా కుడికాలు పెట్టి ప్రవేశించాలి. పూర్వాది ఎనిమిది దిక్కులందు
అష్టదిక్పాలకుల పూజ చెయ్యాలి. పశ్చిమ భాగమున తిరస్కరిణిని పూజించాలి. వృత్త, త్రికోణ, చతురస్ర
మండలము నిర్మించి ఆ మండలమును ఈ క్రింది విధంగా ధ్యానించాలి.
నీలం
తురంగమధిరుహ్య సుశోభమానా నీలాంశుకాభరణమాల్య విభూషణాఢ్య|
నిద్రాపటేన
భవనాని తిరోదధానా ఖడ్గాయుధా భగవతీ పరిపాతుచాస్మాన్||
పైవిధంగా
ధ్యానించి గంధపుష్పాదులతో ఈ క్రింది మంత్రముతో పూజించాలి.
"ఓం
ఐం హ్రీం శ్రీం ఐం నమో భగవతి మహేశ్వరి పశుజన మనశ్చక్షు స్తిరస్కరణం కురుకురుస్వాహా"
ఆ తర్వాత, ఓం ఐం హ్రీం శ్రీం కదంబవనాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం రత్నమండపాయ నమః అని పూజించాలి.
ఆ తర్వాత
మండప ద్వారదేవతలను ఈ క్రింది విధంగా పూజించాలి.
సౌః
అస్త్రాయఫట్ - పశ్చిమద్వారే (నీళ్ళు జల్లాలి)
ఓం ఐం
హ్రీం శ్రీం మాం మహాలక్ష్మీ పాదుకాం పూజయామి - ఊర్ధ్వ శాఖాయాం
ఓం ఐం
హ్రీం శ్రీం సాం సరస్వతీ పాదుకాం పూజయామి - ఉత్తర శాఖాయాం
ఓం ఐం
హ్రీం శ్రీం దుం దుర్గా పాదుకాం పూజయామి - మధ్యే
ఓం ఐం
హ్రీం శ్రీం ద్వాం ద్వారశ్రీ పాదుకాం పూజయామి - మధ్యే
ఓం ఐం
హ్రీం శ్రీం శం శంఖనిధివాసుదారాభ్యాం నమః - దక్ష శాఖాయాం
ఓం ఐం
హ్రీం శ్రీం పం పద్మనిధివసుమనీభ్యాం నమః - వామ శాఖాయాం
ఓం ఐం
హ్రీం శ్రీం గం విఘ్నేశ పాదుకాం పూజయామి - ఊర్ధ్వ దక్షే
ఓం ఐం
హ్రీం శ్రీం క్షం క్షేత్ర పాదుకాం పూజయామి - ఊర్ధ్వ వామే
ఓం ఐం
హ్రీం శ్రీం గం గంగా పాదుకాం పూజయామి - ఊర్ధ్వ దక్షే
ఓం ఐం
హ్రీం శ్రీం యం యమునా పాదుకాం పూజయామి - ఊర్ధ్వ వామే
ఓం ఐం
హ్రీం శ్రీం ధాం ధాత్రేనమః - ఊర్ధ్వ దక్షే
ఓం ఐం
హ్రీం శ్రీం విం విధాత్రే నమః - ఊర్ధ్వ వామే
ఓం ఐం
హ్రీం శ్రీం దేం దేహళీ పాదుకాం పూజయామి - అధోదేహళ్యాం
ఓం ఐం
హ్రీం శ్రీం వాం వరుణ పాదుకాం పూజయామి - అధోదేహళ్యాం
- ఇతి
పశ్చిమ ద్వారపూజ
ఉత్తర
ద్వారపూజ
ఊర్ధ్వ
శాఖాయాం - ఓం ఐం హ్రీం శ్రీం వం వటుకనాథ పాదుకాం పూజయామి
ఓం ఐం హ్రీం శ్రీం ద్వాం
ద్వారశ్రీ పాదుకాం పూజయామి
ఆ తర్వాత
ముందు చెప్పిన విధముగా శంఖనిధి నుండి దేహళీ వరకు పూజ చెయ్యాలి.
ఆ తర్వాత
ఓం ఐం హ్రీం శ్రీం కుం కుబేరాయ నమః అని పూజించాలి.
పూర్వద్వార
పూజ
ఊర్ధ్వశాఖాయాం:
ఓం ఐం హ్రీం శ్రీం క్షాం క్షేత్రపాలాయ
పాదుకాం పూజయామి
దక్షశాఖాయాం:
ఓం ఐం హ్రీం శ్రీం విం విఘ్ననాథ పాదుకాం
పూజయామి
క్షేత్రపాలునికి
దక్షిణ వామాగ్రములందు మహాలక్ష్మి, సరస్వతి, ద్వారశ్రీలను పూజించి, ఇంతకు ముందు చెప్పిన విధంగా శంఖనిధి నుండి దేహళీ వరకు పూజచెయ్యాలి.
దేహళీ
పూజ తర్వాత ఓం ఐం హ్రీం శ్రీం లాం ఇంద్రనాథ శ్రీపాదుకాం పూజయామి అని పూజించాలి.
దక్షిణద్వార
పూజ:
ఊర్ధ్వశాఖాయాం:
ఓం ఐం హ్రీం శ్రీం గ్లౌం గణనాథ పాదుకాం
పూజయామి
ఓం ఐం హ్రీం శ్రీం
ద్వాంద్వారశ్రీ పాదుకాం పూజయామి.
దక్ష, వామ శాఖలందు కామదేవుడిని, వసంతుడిని పూజించాలి. ఆ తర్వాత శంఖనిధి నుండి దేహళీ వరకు ఇంతకు ముందు
చెప్పినవిధంగా పూజచెయ్యాలి. ఆ తర్వాత ఓం ఐం హ్రీం శ్రీం యాం యమనాథ పాదుకాం పూజయామి
అని పూజాచేయాలి.
ఆ తర్వాత
మళ్ళీ పశ్చిమద్వారమునకు వెళ్ళి వామపాదమును ముందుగా పైకిలేపి తోరణముల వరకు వెళ్ళి
మండపాభిముఖస్థ మంచ దేవత పూజచెయ్యాలి.
ఓం ఐం
హ్రీం శ్రీం రం రత్నసోపానాయన నమః
పశ్చిమ
ద్వారమునకు దక్షిణమున -
ఓం ఐం హ్రీం
శ్రీం సాం సరస్వతీ పాదుకాం పూజయామి
పశ్చిమ
ద్వారమునకు వామమున -
ఓం ఐం హ్రీం
శ్రీం మాం మహాలక్ష్మీ పాదుకాం పూజయామి
పశ్చిమ
ద్వారమునకు ఊర్ధ్వ అధోభాగములందు -
ఓం
ఐం హ్రీం శ్రీం గౌం గౌరీ పాదుకాం పూజయామి
ఓం ఐం హ్రీం శ్రీం లోం లోకధాత్రి పాదుకాం
పూజయామి
ఓం ఐం హ్రీం శ్రీం వాం వాగీశ్వరీ పాదుకాం
పూజయామి
ఓం ఐం హ్రీం శ్రీం దివ్యౌఘశ్రీ పాదుకాం
పూజయామి
ఓం ఐం హ్రీం శ్రీం సిద్ధౌఘశ్రీ పాదుకాం
పూజయామి
ఓం ఐం హ్రీం శ్రీం మానవౌఘశ్రీ పాదుకాం
పూజయామి
తర్వాత, ఉత్తరద్వారము నందు మాయా, దుర్గా, గౌరీ నుండి మనవౌఘ వరకు పూజచెయ్యాలి. ఆ
తర్వాత పూర్వద్వారము నందు భద్రకాళీ, సరస్వతీ, గౌరీ నుండి మానవౌఘ వరకు పూజచెయ్యాలి. తర్వాత దక్షిణద్వారమునందు స్వాహా, శుభంకరీదేవి, గౌరీనుండి మానవౌఘవరకు పూజచెయ్యాలి.
తర్వాత మళ్ళీ పశ్చిమ ద్వారమునకు వెళ్ళి ఈ క్రింది మంత్రము పఠించాలి.
"పాలితం
బహిరిన్ద్రాద్యౌః పరమైశ్వర్యశోభితం| ప్రపద్యే పశ్చిమం ద్వారం భావాన్య మందిరం మహత్||"
తర్వాత
ఓం ఐం హ్రీం శ్రీం పశ్చిమద్వారాయ రత్నమండపాయనమః| అని మండపమును పూజించి మూడుసార్లు చప్పట్లు
కొట్టి ద్వారములను తెరవాలి. తదనంతరం ఆవాలు, అక్షింతలు, పువ్వులు తీసుకొని నారాచ అస్త్రముద్రతో ఈ క్రింది మంత్రమును పఠించాలి.
ఆం
అపసర్పంతుతే భూతా యే భూతా భువిసంస్థితా| యేభూతావిఘ్నకర్తారస్తేనస్యంతు శివాజ్ఞయా||
హ్రః
అస్త్రాయఫట్| అని చెబుతూ మండపము చివరదాక
ఆపువ్వులు మొదలగు వానిని జల్లాలి. దీనితో విఘ్నసంఘం బయటకు వెడుతుంది.
అస్త్రమంత్రమును మానసికంగా జపించాలి. ఎడమకాలి మడమతో భూమిని మూడుసార్లు చరచాలి.
మూడుసార్లు చప్పట్లు కొడుతూ అంతరిక్షంలోకి దివ్యదృష్టితో చూడాలి. దీనితో
దివ్యవిఘ్నముల ఉత్సారణము జరుగుతుంది. ఆ తర్వాత క్రింది మంత్రమును పఠించాలి.
ఓం
పాఖండకారిణోభూతా భూమౌ యే చాంతరిక్షగాః| దివ్యలోకే స్థితాయేచతే నశ్యంతు శివాజ్ఞయా|
ఎడమపాదమును
ముందు లేపి గడపను దాటి మండపము లోపలకు ప్రవేశించి మౌనంగా ఉండి హృదయములో దేవిని
ధ్యానించుచూ పూర్ణసమాహిత చిత్తము కలిగి యాగభూమి మీద ఆసనమును గ్రహించవలెను.
ప్రతీ
ద్వారమునకు పూజ చెయ్యడం అసంభవమైతే పశ్చిమ ద్వారమునందు ఆయా ద్వారములను కల్పించుకొని
పూజ చెయ్యాలి. కొన్ని మతముల ప్రకారము కేవలము పశ్చిమ ద్వారమునకు పూజ చెయ్యవచ్చును.
ఇంకాఉంది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి