సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

12, డిసెంబర్ 2020, శనివారం

మహామనుస్తవం - 11, 12

 

11.   క ఇతి త్రిజగజ్జననీ మాదికలాం భువనశిల్పనిర్మాతుః

       కమలోద్భవస్య కాంతామాదౌవిద్యారతాః ప్రభాషన్తే

ఇక్కడ నుండి పంచదసీ మహా మంత్రమును వివరించబడుచున్నది. ఈ శ్లోకము నుండి ఇరవైఐదవ శ్లోకము వరకు అన్ని శ్లోకములు పంచదసీ మంత్రములోని ఒకొక్క బీజముతో ప్రారంభమవుతాయి.

పంచదసీ మహామంత్రము పదిహేను బీజముల మంత్రము. ఇందు క తో ప్రారంభమయ్యే మంత్రమును కాది మతమని, హ తో ప్రారంభమయ్యే మంత్రమును హాది మతమని, స తో ప్రారంభమయ్యే మతమును సాది మతమని అంటారు. శాస్త్రిగారు కాది మతమును ఉపాసించారని మనకు ఈ శ్లోకము ద్వారా స్పష్టమవుతున్నాది.

క భువనశిల్ప నిర్మాతైన బ్రహ్మను సూచించును. జగత్తును చెక్కిన శిల్పంతో సూచించారు. బ్రహ్మ శిల్పి అయితే అతడి మొదటి సృష్టి అతని శక్తి అయిన సరస్వతి.   


12.   ఏ మాతరఖిలబోధన దక్షే రక్షేత్ నఃసమాయూహ|

       స్వాత్మానమర్పయంతి ప్రాజ్ఞాయై తంత్రవేదినో విబుధాః||

హే మాతా! అన్ని ప్రజ్ఞలందూ నిపుణత కలదానా. మమ్ము రక్షింపుము. ఈ విధంగా తంత్ర శాస్త్రములు తెలిసిన సాధకులైనా అమ్మవారి ప్రజ్ఞానఘనరూపమునకు వశమై శరణుకోరుతారు.

ఇక్కడ రహస్యమేమనగా, పంచదసీ మంత్రములోని రెండవ బీజము "ఏ" సరస్వతీ రూపము. సరస్వతి అన్ని విద్యలకూ తల్లి అన్న సంగతి విదితమే. ఆమెకు తెలియని ప్రజ్ఞలేదు. ఆమెనుండి పుట్టని విద్యలేదు. జీవులు ఏవో కొన్ని విద్యలందు నిష్ణాతులవచ్చు. కానీ ఆమె అన్ని విద్యలన్దూ నిష్ణాతురాలు. అందువలన కొన్ని శాస్త్రాలు బాగా తెలిసిన విజ్ఞానవంతులు కూడా ఆమె శరణు కోరక తప్పదు.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: