కాలీమతము - ప్రాణాగ్ని హోమవిధానము
ఇప్పుడు సమస్త భూమండలము కొరకు విశేషంగా మంత్రసాధకుల కొరకు సర్వసిద్ధిదాయక ప్రాణాగ్ని హోమ విధానము చెప్పబడుచున్నది. ముందుగా స్వచ్ఛ శుభాసనము మీద పద్మాసనము వేసి ప్రసన్న అచంచల మనస్సుతో పూర్వాభిముఖుడై కూర్చోవాలి. హ్రీంలో హ సత్త్వగుణముగా, ఈ రజోగుణముగా, ర తమోగుణముగా ఒక త్రికోణమును పూర్వ-నైఋతి-వాయవ్య క్రమముగా మూలాధారమునందు చింతన చెయ్యాలి. ఆ త్రికోణములో మధ్యన, తూర్పున,
పశ్చిమమున, ఉత్తరమున, దక్షిణమున అయిదు కుండములను కల్పించుకోవాలి. ఆ కుండములందు అవసధ్యాగ్ని, సభ్యాగ్ని, ఆహవనీయాగ్ని,
అన్వాహార్యాగ్ని మరియు గార్హపత్యాగ్ని అను పంచాగ్నులను భావించాలి. ఈ క్రమము మధ్య
కుండమునుండి వరసగా చెప్పబడెను. ప్రభాజ్వాలాబుద్ధి, జ్ఞానరూప
నిరంజన, మూలప్రకృతిరూప కల్పాది నిరంజన ద్వాదశ శక్తి స్థిత
వర్ణములనుండి వచ్చిన పరాత్మాశుద్ధ సుధ మాతృకల ప్రత్యేక అక్షరములతో ఆ కుండములలో
జ్వలించుచున్న అగ్నియందు హోమము చెయ్యాలి. క్ష, ళ, హ, స, ష - ఈ అయిదూ మరకత (=ఆకుపచ్చ)
వర్ణములు. శ, వ, ర, ల, య, వ - ఇవి గోమేధ
వర్ణములు. మ, భ, బ, ఫ, ప - ఇవి పగడ వర్ణములు. న,
ధ, ద, థ, త, ణ, ఢ, డ, ఠ, ట - ఇవి హీర (=వజ్రము) వర్ణములు. ఞ, ఝ, జ, ఛ, చ - ఇవి పద్మరాగ వర్ణములు. ఙ, ఘ, గా, ఖ, క - ఇవి వైడూర్య
వర్ణములు. అః, అం, ఔం, ఓ, ఐ, ఏ, ఌ, ఌ(2) - ముత్యము వర్ణములు. ఋ, ఋ(2), ఊ, ఉ, ఈ, ఇ, ఆ, అ - ఇవి మాణిక్య వర్ణములు. ఈ నవవర్ణములను నవరత్నములంటారు.
ఈ నవవర్ణములకు చివరి
క్రమమునుండి కేతువు, రాహువు, శని, శుక్రుడు, గురువు, బుధుడు, కుజుడు, చంద్రుడు, సూర్యుడు అధిపతులు మరియు అధిదేవతలు. ఈ విధముగా హోమమును ప్రతిదినమూ
చెయ్యాలి. హోమము యొక్క సర్వసమ్మత సంఖ్య యాభై. ఈ విధమైన హోమము వలన బంగారము మరియు
వస్త్రములతో ధనికుడయి భాగ్యవంతుడు మరియు కళ్యాణవంతుడవుతాడు.
అవసధ్యాగ్ని కుండమునందు క్ష, శ, మ, న, మా, ఙ, అః, ఐ, ఌ వీటితో హోమము చెయ్యాలి. సభ్యాగ్ని కుందామునాడు ల,
వ, ధ, డ, ఝ, జ, ళ, ఊ తో హోమం చెయ్యాలి.
ఆహవనీయాజ్ఞి యందు హ, ల, బ, ద, డ, జ, గా, ఔ, ఌ, ఈ లతో హోమం చెయ్యాలి. అణ్వాహార్యాగ్ని యందు స, ర, ష, థ, ఠ, ఛ, ఖ, ఓ, ఏ, ఋ, ఇ వర్ణములతో హోమము
చెయ్యాలి. గార్హపత్యాగ్ని యందు ష, య, ప, త, ట, చ, క, ఐ, ఋ, అ వర్ణములతో హోమం చెయ్యాలి.
ఆకాశమునుండి ఉత్మన్నమైన అన్ని వర్ణములతో అవసాధ్యాగ్ని కుండము
నందు హోమం చెయ్యాలి. పూర్వకుండములోని వాయువర్ణములతోనూ, పశ్చిమకుండములోని అగ్నివర్ణములతోనూ,
ఉత్తరకుండములోని జలవర్ణములతోనూ, దక్షిణకుండములోని భూమి
వర్ణములతోనూ హోమం చెయ్యాలి. అహర్నిశము ప్రళయానలసమానమైన అగ్ని జ్వలిత కుండమునందు
మాతృకావర్ణములతో హవనం చెయ్యాలి. ఈ విధంగా చెయ్యడం వలన సాధకుడు నిత్యశుద్ధ పరానంద
చిత్స్వరూపుడవుతాడు. జపము-హోమము మంత్రముల ప్రారంభమున ఓంహ్రీంశ్రీం జోడించాలి.
యథావిధిగా న్యాసము చెయ్యాలి. దీనివలన సాధకుడు జీవన్ముక్తుడయి చిరంజీవి అవుతాడు.
అతడి తేజము సూర్యునితో సమానముగా ఉంటుంది. అతడు శివునితో సమానముగా కర్తా-హర్తా
అవుతాడు.
మంత్ర ఉదాహరణ:
ఓంహ్రీంశ్రీం హంసఃసోహంస్వాహా - ఈ క్రమములో అన్ని అగ్నుల మొదటి వర్ణములను మానసిక
హోమం చెయ్యాలి. ఆ తర్వాత దశవర్ణములోని ఒకొక్క వర్ణములను హోమం చెయ్యాలి. ఇక్కడ అః
ను బ్రహ్మ రూపంగా భావించాలి.
భోజనకాలే ప్రాణాగ్ని
హోత్రవిధి
ఉత్తరతంత్రము ప్రకారము
భోజన సమయంలో సాధకుల కొరకు ప్రాణాగ్ని హోమ విధిని నిరూపించే ముందర ప్రాణాది
పంచమాత్రముల యొక్క ఉద్ధారము గార్హపత్యాదులతో చెప్పబడుచున్నది.
గార్హపత్యమునందు ప్రాణము:
హిరణ్యవర్ణాశుచయఃపావకాఃఅగ్నింవిహ్యత్యాత్మానముపచయోర్ధ్వగచ్ఛంతుస్వాహా|
అన్వాహార్యమునందు అపానము:
గగనవర్ణాశుచయఃపావకాః
ఆహవనీయమునందు వ్యానము:
రక్తవర్ణాశుచయఃపావకాః
అగ్నింవిహ్యత్యాత్మానముపచర్యనిర్యగ్గచ్ఛంతు స్వాహా|
సభ్యమునందు ఉదానము:
కృష్ణవర్ణాశుచయఃపావకాఃఅగ్నింవిహ్యత్యాత్మానముపచర్యయోర్ధ్వగచ్ఛంతు
స్వాహా|
అవస్థ్యయందు సమానము:
సుప్రభావర్ణాశుచయఃపావకాఃఅగ్నింవిహ్యత్యాత్మానముపచర్యాధస్తిర్యగచ్ఛంతు
స్వాహా|
ఈ మంత్రములతో అయిదు
కుండములందు హోమము చెయ్యాలి. "గార్హ్యపత్య,
అన్వాహార్య, ఆహవనీయ, సభ్య, అవస్థ్యామే ప్రాణోపానవ్యానఉదానసమాన స్వర్ణనీల రక్త కృష్ణ సుప్రభావర్ణ
పవిత్రఅగ్నిం విహ్యత్యాత్మానముపచర్య అహం వైశ్వానరోభూత్వాజూహోమ్యన్నం చతుర్విధం
పంచాన్యేవ విధానేన ఊర్ధ్వ, అధః,
తిర్యక్ సమం గచ్ఛంతు స్వాహా "
గార్హ్యపత్య, అన్వాహార్య, ఆహవనీయ, సభ్య, అవసధ్య అగ్నులందు యమ, శశి,
వరుణ, ఇంద్రులను భావించుచూ పూర్వము చెప్పబడిన విధంగానే హోమము
చెయ్యాలి. హోమబుద్ధిచేత భోజనం చేసిన తర్వాత "అమృతాపిథానమసి" అను
మంత్రంతో అంజలిలో నీళ్ళు తీసుకొని ఆచమనము చెయ్యాలి. ప్రాతఃకాలమున, సాయంకాలమున ప్రపంచబిందు వినిర్గత అమృతధార నుండి సమాసితమైన మకార వినిర్గత
చంద్రమండలముయొక్క రెండు రూపములలో ఉండు విసర్గను ధ్యానము చేసి దానియందు అగ్ని-చంద్ర
తేజము నుండి వికసించిన అమృతపూర్ణ ఉకారము రవి నిర్గత అమృతధార నుండి సమాసితయై నాడీ
మార్గము నుండి మొత్తం శరీరమంతా ప్రసరించి శరీరమునందున్న అన్నిరోగబాధలను
శమింపచేయును.
కాదిమతమునందు
ప్రాణాగ్నిహోత్రవిధి
హే ప్రియా! సూక్ష్మ పరానుండి హోమము సిద్ధి విధానము విను. మూలాధారము యొక్క అగ్నియందు
కుండలినీ అగ్రగామినిని వాచ్యవాచరూపములో ప్రపంచ హవనము చెయ్యాలి. ఈ హవనము వలన మొత్తం
శరీరము స్వస్థమవుతుంది. ప్రాజ్ఞశివాను దీని యొక్క సంపూర్ణ విధాన వర్ణనను అడుగగా ఈ
క్రింది విధముగా సమాధానము వచ్చినది.
మూలాధారము యొక్క అగ్ని సంస్థానమునందు కుండలినీ ఉంటుంది. మూడు
ప్రాణాగ్నుల హోత్రవిద్యను ఎవరైతే తెలుసుకుంటారో ఆ మనుష్యునికి పునర్జన్మ ఉండదు.
అతడు వ్యత్యాసరహిత, అనన్యాపేక్షనిర్వహ, క్లేశరహిత మనస్థాన, పాపరహిత సుఖాస్పద విశ్వము యొక్క
ఆత్మరూపుడవుతాడు. ఇక్కడ ఏదైతో చెప్పబదలేదో అవి మొత్తం 36వ
శ్వాసలో చెప్పబడుతాయి. ఇక్కడ దాని వర్ణన కొంచెం చెప్పబడుచున్నది. నిత్యా, నిత్యోదిత మూలాధారమునందు అగ్ని కలదు. అన్ని ప్రాణుల హృదయమునందు ప్రభాకరడు
కలదు. మూర్ధమున ఉన్న బ్రహ్మరంధ్రము క్రిందన చంద్రుడు ఉంటాడు. అక్కడ త్రయాత్మక
ఆద్యానిత్య మూడు రూపములో ఉంటుంది. ఆ మూడింటిని మనస్సుతో ఐక్యభావన చెయ్యాలి. దీని
తేజస్సు సమిధలు. ఆ తేజత్రయములు అగ్ని-సూర్య-సోమాత్మకములు. అన్ని వర్ణములు
అగ్ని-సూర్య-సోమాత్మకములు. పదహారు స్వరములు సోమాత్మకములు. క నుండి త వరకు వర్ణములు
సూర్యాత్మకములు. థ నుండి స వరకు వర్ణములు అగ్న్యాత్మకములు.
ఈ క్రింది విధంగా సూర్య
మరియు అగ్ని వర్ణములను సోమాత్మక స్వర వర్ణములతో సంపుటీకరించి హుంకృతము చేసి
కుండలినీ యందు హోమము చెయ్యాలి.
ఉదా: క అ ఓం, ఖ ఆ షోం, గ ఇ శోం, ఘ ఈ ఓం, ఙ ఉ లోం, చ ఊ రోం, ఛ ఋ యోం, జ ఋ(2) మోం, ఝ ఋ భోం, ఞ ఌ బోం, ట ఎ ఫోం, ఠ ఐ పోం, డ ఓ నోం, ఢ ఔ ఘోం, ణ అం దోం, త అం థోం|
ఈ క్రింది విధంగా అగ్ని-సూర్య వర్ణములను చంద్ర వర్ణములతో
సంపుటీకరించి హోమము చెయ్యాలి -
థ అ తోం, డ ఆ ణోం, ధ ఇ ఢోం, న ఈ డోం, ప ఉ ఠోమ్, ఫ ఊ టోం, బ ఋ ఞమ్, మ ఌ జోం, య ఌ(2) భోం, ర ఏ చోం, ల ఐం ఙ్గోమ్, వ ఓ ఘోం, శ ఔ
గోం, ష అం ఖోం, స అః కోం|
ఈ క్రింది విధంగా చంద్ర
సూర్య వర్ణములను అగ్నివర్ణములను సంపుటీకరించి హోమము చెయ్యాలి -
అ థ తోం, ఆ ద ణోం, ఇ ధ డోం, ఉ ప ఠోమ్, ఊ ఫ టోం, ఋ బ ఞమ్, ఋ(2) భ ఝోం, ఌ మ జోం, ఌ(2) య ఛోం, ఏ ర చోం, ఓ వ ఘోం, ఔ శ గోం, అం ష ఖోం, అం స కోం|
ఈ క్రింది విధంగా సూర్య
చంద్ర వర్ణములను అగ్నివర్ణములతో సంపుటీకరించి హోమము చెయ్యాలి -
క థ ఓం, ఖ ద ఓం, గ ధ ఓం, ఘ న ఓం, ఙ ప ఓం, చ ప ఓం, ఛ బ ఓం, జ భ ఓం, ఝ మ ఓం, ఞ య ఓం, ట ర ఓం, ఠ ల ఓం, డ వ ఓం, ఢ శ ఓం, ణ ష ఓం, త స ఓం|
ఈ క్రింది విధంగా చంద్ర
అగ్ని వర్ణములతో సూర్యవర్ణములను సంపుటీకరించి హోమము చెయ్యాలి -
అ క సోం, ఆ ఖ షోం, ఇ గ శోం, ఈ ఘ వోం, ఉ ఙ లోం, అ చ రోం, ఋ ఛ యోం, ఌ ఝ భోం, ఌ(2) జ బోం, ఏ ట ఫోం, ఐ ఠ పోం, ఓం డ నోం, ఔ ఢ ధోం, అం ణ ధోం, అః ట థోం|
ఈ క్రింది విధంగా అగ్ని
చంద్ర వర్ణములకు సూర్యవర్ణములతో సంపుటీకరించి హోమము చెయ్యాలి -
థ క ఓం, ద ఖ ఓం, ధ గ ఓం, న ఘ ఓం, ప ఙ ఓం, ఫ చ ఓం, బ ఛ ఓం, భ జ ఓం, మ ఝ ఓం, య ఞ ఓం, ర ట ఓం, ల ఠ ఓం, వ డ ఓం, ష ఢ ఓం, ష ణ ఓం, స త ఓం|
ఈ విధంగా ప్రతిలోమక్రమంలో కూడా పదహారువర్ణముల హోమము చెయ్యాలి. ఈ
విధంగా నూటతొంభైరెండు దివ్య హోమము అవుతుంది. దాని ద్వారా
జ్ఞాతృ-జ్ఞాన-జ్ఞేయ-వాచ-వాచకరూపకముల నుండి మూడేసి అక్షరముల చొప్పున మొత్తం
పన్నెండు తేజత్రయాత్మక వర్ణముల హోమము అవుతుంది. శివుడు-శక్తి కూడా తేజత్రయాత్మకలు.
కనుక వారి ఇచ్ఛననుసరించి అన్యరూపములు గ్రహించగలరు. ఈ ప్రకారము అన్యదేవతల శరీరము
కూడా ఇచ్ఛానుసార రూపమును పొందగలరు.
ఇది శ్రీవిద్యారణ్యయతి రచించిన
శ్రీవిద్యార్ణవతంత్రమునకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస
గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు
మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ
ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము
కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన నాల్గవశ్వాస
సమాప్తము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి