సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

18, డిసెంబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - అయిదవవశ్వాస - 02

 కుండలినీ మంత్ర స్తోత్రం

ఐంహ్రీంశ్రీం అనే త్ర్యక్షరి మంత్రము కుండలినీ మంత్రము. ఇది ప్రసిద్ధము మరియు సుసిద్ధిదాయకము. ఈ మంత్రమునకు ఋషి - శక్తి| ఛందస్సు - గాయత్రి| దేవత - కుండలీ శక్తి| ఐం - బీజం| శ్రీం - శక్తిః| హ్రీం - కీలకం| సర్వాగమ విశారదులకు కుండలినీ చింతన ప్రసిద్ధము. ఐం హ్రీం శ్రీం బీజముల రెండు ఆవృత్తములతో షడంగన్యాసం చెయ్యాలి.

ధ్యానం ఈ క్రిందివిధంగా ఉంటుంది -

మూలాధార త్రికోణము నందు కోటిసూర్యులకు సమానమైన ప్రభ ఉంటుంది. కుండలిని సుప్తావస్తాలో మూడున్నరచుట్లు చుట్టుకున్న సర్పం వలె ఉంటుంది. నీవారాశూక (=వరిముల్లు?) సమానమైన శరీరము కలిగి ఉంటుంది. కోటి మెరుపుల ప్రభ కలిగిఉంటుంది. కోటి చంద్రులప్రభకు సమానమైన చల్లదనాన్ని కలిగిఉంటుంది. శివశక్తిమయి దేవి శంఖావర్త క్రమములో ఉంటుంది. సుషుమ్నా మార్గమునుండి సహస్రారములో ఉన్న పరమశివుని వరకు పయనిస్తుంది. యోగ మార్గమునందు హ్రీం కారము బీజరూపములో చింతనీయము.

  సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారా నాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం|

        పాణిభ్యాంమణిపూర్ణరత్నచషకంరాక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం                    రత్నఘటస్థ  సవ్యచరణాం ధ్యాయేత్పరామంబికాం||

మూలవిద్యాచింతనము

పంచదశీ మంత్రమునకు ఋషి - దక్షిణామూర్తి| ఛందస్సు - పంక్తి| దేవత - పరబ్రహ్మస్వరూపిణి శ్రీమన్మహాత్రిపురసుందరి| ఐం - బీజం| సకలహ్రీం - శక్తిః| కీలకం - హసకహలహ్రీం| ఈ మంత్ర వినియోగము చతుర్విధ పురుషార్ధాలయిన ధర్మ-అర్ధ-కామ-మోక్షములు. మూడుకూటములను రెండు ఆవృత్తముల ద్వారా షడంగన్యాసము చెయ్యాలి.

ధ్యానం:

సిందూరపుంజనిభమిందుకళావతంసమానందపూర్ణనయనత్రయశోభివక్త్రం|

ఆపీనతుంగకుచనమ్రమనంగతంత్రంశంభోకళత్రమమితాం శ్రియమాతనోతు||

వాగ్భవకూట చింతనప్రకారము

సాధకులు మూలాధారము నందు వాగ్భవకూటమును చింతన చెయ్యాలి. వాగ్భవ కూటముయొక్క ఋషి - బ్రహ్మ| ఛందస్సు - గాయత్రి| దేవత - వాగధీశ్వరి| కం-బీజం| హ్రీం - శక్తిః| ఏఈల - కీలకం| ఈ మంత్రము వాక్శుద్ధిని ఇస్తుంది.

షడంగన్యాసము:

బ్రహ్మవాగ్రూపిణ్యై నమః - హృదయాయనమః| విష్ణువాగ్రూపిణ్యై నమః - శిరసేస్వాహా| రుద్రవాగ్రూపిణ్యై నమః - శిఖాయైవషట్| పరవాగ్రూపిణ్యై నమః - కవచాయ నమః | శివవాగ్రూపిణ్యై నమః - నేత్రత్రయాయవౌషట్| అఖిలవాగ్రూపిణ్యై నమః - అస్త్రాయఫట్|

వాగ్భవకూట ధ్యానం:

శుక్లాం స్వచ్ఛవిలేపమాల్యవసనాం శీతాంశు ఖండోజ్జ్వలాం వ్యాఖ్యామక్షగుణామ్ సుధాఢ్యకలశం విద్యాంచ హస్తాంభుజైః|

విభ్రాణాం కమలాసనాం కుచనతామ్ వాగ్దేవతాం సన్మితామ్ వందేవాగ్విభవప్రభాం త్రినయానాం సౌభాగ్యసంపత్కరీమ్||

కామరాజకూట చింతనము

హసకహలహ్రీం అను కామరాజ కూటమును హృదయమునందు చింతనచెయ్యాలి.

ఈ కూటమునకు ఋషి - సమ్మోహన| ఛందస్సు - గాయత్రి| దేవత - కామేశీ| హం - బీజం| హ్రీం - శక్తిః| సకల - కీలకం| వశీకరణ సిద్ధిగురించి వినియోగము.

షడంగన్యాసము:

ద్రాం సంక్షోభణ బాణాయ హం నమః: - హృదయే

ద్రీం ద్రావణ బాణాయ సం నమః: - శిరసి

క్లీం ఆకర్షణ బాణాయ కం నమః: - శిఖాయై

బ్లూం వశీకరణ బాణాయ హం నమః: - కవచే

సః ఉన్మాదన బాణాయ లం నమః: - నేత్రత్రయాయ

ద్రాంద్రీంక్లీంబ్లూంసః సర్వబాణేభ్యో హ్రీం నమః: - అస్త్రాయఫట్

ధ్యానం:

బాలార్క కోటిరుచిరాం స్పటికాక్షమాలాం కోదండమిక్షుజనితంస్మరపంచబాణాన్|

విద్యాంచహస్తకమలైర్దధతీమ్ త్రినేత్రామ్ ధ్యాయేత్ సమస్తజననీమ్ నవచంద్ర చూడామ్||

శక్తికూట చింతనము

అగ్రసాధకులు ఆజ్ఞా చక్రమునందు శక్తికూటమును చింతన చెయ్యాలి. ఈ కూటమునకు ఋషి - శివ| ఛందస్సు - పంక్తి| దేవత - ఆదిశక్తి| సః - బీజం| హ్రీం - శక్తిః| కల - కీలకం| చతుర్వర్గ సిద్యర్ధే వినియోగః|

షడంగన్యాసము:

ఓం సర్వజ్ఞతాశక్త్యై సం నమః - హృదయే

ఓం నిత్యతృప్తతాశక్త్యై కం నమః: - శిరసి

ఓం అనాదిబోధిన్యై లం నమః: - శిఖాయై

ఓం స్వతంత్రతాశక్త్యై హ్రీం నమః: - కవచే

ఓం నిత్యమలుప్తతాశక్త్యై సకలహ్రీం నమః: - నేత్రత్రయాయ

ఓం సకలహ్రీం నమః: - అస్త్రాయఫట్

ధ్యానం:

కదంబవనమధ్యగాం కనకమండపాంతఃస్థితాం షడంబురుహవాసినీమమరసిద్ధ సౌదామినీమ్|

విజృంభితజపారుచిం విమలచంద్ర చూడామణిం త్ర్యంబక కుటుంబీనీం త్రిపురసుందరీమాశ్రయే||

అభేదచితనం

మూలాధారము నుండి బ్రహ్మరంధ్రము వరకు బ్రహ్మవిద్యాభావన చెయ్యాలి. దాని ప్రభ శరీరమంతా వ్యాపించినట్టుగా చింతన చెయ్యాలి. ఆ తర్వాత ఈ క్రిందివిధంగా భావన చెయ్యాలి.

నేను దేవిని. రెండోవాడిని కాదు. నేను బ్రహ్మని. శోకతప్తుడను కాను. నేను సచ్చిదానంద స్వరూపుడను, నిత్యముక్త స్వభావుడను. నీ శరీరము సంవిన్మాత్రము. మన మధ్యనున్న అంతరము నీయొక్క ఆజ్ఞాబాలము చేత పోగొట్టబడుతుంది. నేను ఘోర సంసారమునకు దూరము.  నాకు చేయవలసిన కృత్యములు ఏమీ లేవు. అయినా సరే నేను నీ ఆజ్ఞా బద్దుడనై నీకు సేవ చేయగోరుచున్నాను. సమాధి స్థితిని పొంది, బుద్ధి చేత నవ ఆధారముల నివాస భూతలమును భావించుచున్నాను. ప్రాతఃకాలముననే లేచి నీయొక్క ప్రసన్నత గురించై సంసారయాత్రను నిర్వర్తించెదను. మహేశుని వామార్ధమును నేను శరణుగోరుచున్నాను. అది జగత్తు మరియు వాణీలకు మూలము.

మూలదేవతా స్తుతి

కళ్యాణవృష్టిభిరివామృతపూరితాభిర్లక్ష్మీస్వయంవరణమంగళదీపికాభిః|

సేవాభిరంబతవపాదసరోజమూలేనాకారికింమనసిభక్తిమతాంజనానామ్|| 1

ఏతావదేవజననిస్పృహణీయమాస్తేత్వద్వందనేషుసలిలస్థగితేచనేత్రే|

సాన్నిధ్యముద్యదరూణాంబుజసోదరస్యత్వద్విగ్రహస్యసుధయాపరయాప్లుతస్య||2

ఈశిత్వభాగకలుషాఃకతినామసంతిబ్రహ్మాదయఃప్రతియుగంప్రళయాభిభూతాః|

ఏకఃసఏవజనని స్థిరసిద్ధిరాస్తే యఃపాదయోస్తవసుకృతప్రణాతింకరోతి|| 3

లబ్ద్వాసకృత త్రిపురసుందరితావకీనమ్ కారుణ్యకందలితకాంతిభరంకటాక్షం|

కందర్పభావసుభగాస్త్వయిభక్తిభాజఃసమ్మోహయంతితరుణిర్భువనత్రయేషు||4

హ్రీంకారమేవతవనామగృణంతివేదామాతస్త్రికోణనిలయే త్రిపురే త్రిణేత్రే|

యత్సంస్మృతౌయమభటాదిభయంవిహాయదివ్యన్తినందనవనే సహలోకపాలౌః||5

హంతుఃపురామధిగలంపరిపూర్యమాణఃక్రూరఃకథంనుభవితాగరలస్యవేగః|

ఆశ్వాసనాయకిలమాతరిదంతవార్ధందేహస్యశశ్వదమృతాప్లుతశీతలస్య||6

సర్వజ్ఞతాంసదసివాక్పటుతామ్ప్రసూతేదేవి త్వదంఘ్రిసరసీరుహయోఃప్రణామః|

కించస్ఫురన్ముకుటముజ్జ్వలమాతపత్రంద్వేచామరేచవసుధాంమహంతీందదాతి||7

కల్పదృమైరభిమతప్రతిపాదనేషుకారుణ్యవారిధిభిరంచభావత్కటాక్షైః|

ఆలోకయాత్రిపురసుందరిమామనాథంత్వయ్యేవభక్తిభరితంత్వయిదత్తదృష్టిమ్||8

హంతేతరేష్వపిమనాంసినిధాయచాన్యేభక్తింవహంతికిలపామరదైవతేషు|

త్వామేవదేవిమనసాహమనుస్మారామిత్వామేవనౌమిశరణంజగతిత్వమేవ||9

లక్ష్యేషుసత్స్వపితవాక్షివిలోకనానామాలోకయత్రిపురసుందరిమాంకథచింత్|

నూనంభయాపిసదృశంకరుణైకపాత్రంజాతోజనిష్యతిజనోనచజాయతేచ|| 10

హ్రీంహ్రీమితిప్రతిదినంజపతాంజనానాం కింనామదుర్లభమిహత్రిపురాధివాసీ|

మాలాకిరీటమాదవారణమాననీయాంస్తాన్సేవతే మధుమతిస్వయమేవలక్ష్మీః||11

సంపత్కరాణిసకలేంద్రియనందనానిసామ్రాజ్యదానకుశలానిసరోరుహాక్షి|

త్వద్వందనానిదురితౌఘహారోద్యతానిమామేవమాతరనిశంకలయంతునాన్యం||12

కల్పోపసంహరణకల్పితతాండవస్యదేవస్యఖండపరశోఃపరభైరవశ్య|

పాశాంకుశైక్షవశరాసనపుష్పబాణాసాసాక్షిణీవిజయతేతవమూర్తిరేకా||13

లగ్నంసదాభవతుమాతరిదంత్వదీయంతేజఃపరంబహృలకుంకుమపంకశోణం|

భాస్వత్కిరీటమమృతాంశుకలావతంశంమధ్యేత్రికోణముదితంపరమామృతార్ధం||14

హ్రీంకారమేవ తవధామతదేవరూపంత్వన్నామసుందరిసరోజనివాసశీలే|

త్వత్తేజసాపరిణతంజగదాదిమూలంసంగతనోతుసరసీరుహసంగమస్య|| 15

హ్రీంకారత్రయసంపుటేనమహతామంత్రేణసందీపితంస్తోత్రంయఃప్రతివాసరం తవపురో మాతర్జపేమంత్రవిత్|

తస్యక్షోణిభుజోభవంతివాసగాలక్ష్మీశ్చిరస్థాయినీవాణీనిర్మలసూక్తిభారభరితాజాగర్తి దీర్ఘంవపుః|| 16

- ఇతి స్తుతిః

భూమిప్రార్ధన

ఈ క్రింది మంత్రంతో భూమిని ప్రార్ధించాలి -

సముద్రమేఖలేదేవిపర్వతస్తనమండలే| విష్ణుపత్నీం నమస్తుభ్యం పాదస్పర్శం క్షమశ్వమే||

శౌచవిధి

సంధ్యా సమయంలో ఉత్తరముఖంగా, పగలు మరియు రాత్రిసమయములలో దక్షిణ ముఖంగా ఉండి చెవికి జందెమును చుట్టి మలమూత్రములను విసర్జించాలి. విసర్జన తర్వాత లింగమునకు ఒకసారి, మలద్వారమునకు అయిదుసార్లు మట్టిని పట్టించి నీటితో శుద్ధిచేసుకోవాలి. చేతులను పదిసార్లు మట్టి మరియు నీళ్ళతో కడగాలి. గృహస్తుడు ఏడుసార్లు, వ్రతము బూనినవాడు పద్నాలుగుసార్లు మట్టి మరియు నీటితో శుద్ధిచేసుకోవాలి. రాత్రులందు ఇప్పుడు చెప్పినదానిలో సగముసార్లు చెయ్యాలి.

దంతశుద్ధి మంత్రము 

శ్రీకామ మంత్రము యొక్క ఋషి - సమ్మోహన| ఛందస్సు - గాయత్రి| దేవత - కామదేవ| క్లీం - బీజం| నమః - శక్తిః| సర్వజనప్రియాయ - కీలకం| షడ్దీర్ఘ కామ బీజములు క్లాం, క్లీం, క్లూం, క్లైం, క్లౌం, క్లః లతో షడంగన్యాసం చెయ్యాలి.

ధ్యానం:

జపారుణంరత్నవిభూషణాఢ్యంమీనధ్వజంచారుకృతాంగరాగం|

కరామ్బుజైరంకుశమిక్షుచాపంపుష్పాస్త్రపాశౌదధతంభజామి||

ఆ తర్వాత దంతములను శుభ్రపరచే కుంచెను (టూత్బ్రష్) ఈ క్రింది కామమంత్రంతో ఎనిమిదిసార్లు మంత్రించాలి. ఆ తర్వాత ఆ కుంచెతో దంతములను శుభ్రపరచుకొని ముఖమును కడుక్కోవాలి.

కామమంత్రము: క్లీం కామదేవాయసర్వజనప్రియాయ నమః

ముఖప్రక్షాళనవిధి

శ్రీవిద్యను బ్రహ్మరంధ్రమున భావించుచూ చతుర్లక్ష్మీ మహామంత్రంతో ముఖప్రక్షాళన చెయ్యాలి.

స్నానవిధి

జలాశయతీరమునకు వచ్చి ఆచమనమ్ చేసి సంకల్పము చెప్పుకొని ఈ క్రింది మంత్రముతో భైరవుని అనుజ్ఞ తీసుకోవాలి.

అతితీక్షణమహాకాయకల్పాంతదహనోపమ| భైరవాయనమస్తుభ్యంఅనుజ్ఞాంధాతుమర్హసి||

భైరవుని ఆజ్ఞ తీసుకున్న తర్వాత వైదిక స్నానము ఆచరించాలి. తాంత్రిక స్నానము మంత్రోక్త మార్గంలో చెయ్యాలి. జలమునందు శ్రీచక్రమును భావించాలి.

బ్రహ్మాండోదరతీర్ధానికరేస్పృష్టానితేరవే| తేనసత్యేనమేదేవతీర్ధందేహిదివాకర| అను మంత్రమును పఠిస్తూ అంకుశముద్రతో సూర్యుని నుండి తీర్ధమును ఆకర్షించి జలములో కల్పించబడిన శ్రీచక్రముతో కలిపినట్లుగా భావించాలి. దేవిని గంగా రూపంగా భావించి మూలమంత్రజపము చెయ్యాలి. జాతవేదాది మంత్రములు మరియు మూలమంత్రమును పఠిస్తూ కుంభముద్రతో మూర్ధాస్థానము మీదనుండి ఏడుసార్లు జలమును పోసుకోవాలి. దేవిని తమ హృదయమునందు మరియు జలమునందు భావించుచూ ఈ క్రింది మంత్రమును పఠించాలి.

యన్మయా దుష్కృతం తోయం శరీరమల సంయుతం| తస్య పాప విశుద్యర్ధం యక్షమాణం  తర్పయామ్యహం||

పై మంత్రముతో తీర్ధమునందు తర్పణము వదలాలి. తర్వాత శుద్ధవస్త్రము ధరించాలి.

విభూతిధారణం

చేతిలోకి విభూతి తీసుకొని పంచతారలతో "ఓంఐంహ్రీంశ్రీంక్లీం", అగ్నిరిత్యాది మరియు ఈశానాది మంత్రములతో ఆ విభూతిని మంత్రించాలి. ఆ తర్వాత మూలమంత్రంతో ధారణ చెయ్యాలి.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: