సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

13, నవంబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - నాల్గవశ్వాస - 02

 

అవరోహణ క్రమము

లోపాముద్ర పదిహేనువర్ణముల మంత్రమునందు మిధునము ఉన్నది. నవవర్ణములందు 16 స్వరముల యోగము వలన 9x16 = 144 యుగ్మములు అవుతాయి. పంచబ్రహ్మత్రిమూర్తి రశ్ములకు తారోత్థ కళలు రెండేసి ఉంటాయి. నవాత్మేశ్వర వర్ణముల కలలనుండి అన్యకలలు వేరు.

సంధివర్ణములకు 360 కళలు ఉంటాయి. నవాత్మేశ్వర మంత్రము యొక్క మిధునములకు 720 రశ్ములు ఉంటాయి. వీటితర్వాత 20760 కళానిత్యలు ఉంటాయి. కళానిత్యలను కలుపుకొని మూలసంఖ్య 21600 అవుతుంది. కులాగమము నందు వీటిగురించి చెప్పబడినది.  మూలాధార చక్రముక్రింద ఉన్న సహస్రదల పద్మమునందు ఒక వెయ్యి రశ్ములు ఉంటాయి. ఈ ప్రకారముగా బ్రహ్మ రంధ్రమునకు సంబంధించి ఆరు సంధుల పైన-కింద కలిపి 320 సంఖ్యతో 29440 రశ్ములు అవుతాయి. సంకీర్ణ సంఖ్యలు 2600 భాగములుంటాయి. ఈ వర్ణములు క్రమముగా పార్థివ, జల, తైజస, వాయవ్య, ఆకాశ మరియు మానస అవుతాయి. అ వర్ణమునకు 3(1/2) మరియు 3(1/4) అష్టమ అంశము త్యాగము చేయగా 64 రశ్ములు అవుతాయి. దీనికి అధికముగా 4(1/2) రశ్ములు క్రమముగా చెప్పబడ్డాయి. ఇ కారాది స్వరముల క్రమము కూడా ఇక్కడే చెప్పబడ్డాయి. ఒకొక్క స్వరమునకు క్రమముగా 22(1/2) రశ్ములుండును.

       క వర్ణ రశ్ములు 5/4, 5, 4(1/2) మరియు 6(1/4) ఉంటాయి. ఖ వర్ణ రశ్ములు అయిదు. గ వర్ణ రశ్ములు 4(1/4), 5, 4(1/2) ఉంటాయి. ఘ వర్ణ రశ్ములు 6 మరియు 5(1/2), ఙ్గ వర్ణ రశ్ములు 4(1/2), 4(1/4), 5(1/2), 4(1/2), 6(1/4), చ మరియు ఛ వర్ణ రశ్ములు కూడా ఇదే క్రమంలో ఉంటాయి. జ వర్ణ శక్తులు 5, 4(1/4), 5, 4(1/2), 6(1/4), ఝ వర్ణ రశ్ములు 4(1/2), 4(1/4), 5, 4(1/2), 6 ఞ్,, ఠ వర్ణముల రశ్ములు జ వర్ణ రశ్ములకు సమానంగా, డ వర్ణ రశ్ములు 6/4, 51/4, 5, 7 మరియు 6(1/2) ఉంటాయి. డ,, త రశ్ములు కూడా ఈవిధంగానే ఉంటాయి. థ రశ్ములు 5(1/2), 5(1/4), 6/4, 6, 7, 6(1/2). ఈ విధంగానే ద,, న రశ్ములు కూడా ఉండును. ప, ఫ వర్ణ రశ్ములు 5(1/2), 5, 6, 8(1/2), 6.  బ వర్ణ రశ్ములు 10, 8(1/2), 10, 9, 12, 10(1/2). భ వర్ణ రశ్ములు 9, 9(1/2), 10, 9, 12, 10(1/2). మా వర్ణ రశ్ములు 8(1/2), 11, 9, 12, 10(1/2). య వర్ణ రశ్ములు 9, 8(1/2), 10, 9, 12, 11(1/2). ర వర్ణ రశ్ములు 9, 8(1/2), 11, 9, 12, 10(1/2). ల వర్ణ రశ్ములు 10, 8(1/2), 10, 9, 12, 10(1/2). వ వర్ణ రశ్ములు 14, 8, 15, 1(1/4). శ,, స వర్ణముల రశ్ములు 18, 16, 10. హ వర్ణ రశ్ములు 28, 36, 31, 37, 32. క్ష వర్ణ రశ్ములు హ వర్ణ రశ్ములకు సమానము.

ఈ సంకీర్ణ మరియు సహజ రశ్ముల జ్ఞానము వలన ఉత్తమ వైభవము కలుగుతుంది. ఇందు సందేహము లేదు. ఇది సత్యము. ఇదే సత్యము. అన్యథా మరి ఏదీ లేదు.

క నుండి ఠ వరకు వున్న వర్ణముల రశ్ముల సంఖ్య 30-30. కుల సంఖ్య 360. డ నుండి ఫ వరకు ఉన్న వర్ణముల రశ్ముల సంఖ్య 36-36. కుల సంఖ్య 360. బ నుండి ల వరకు వున్న 6 వర్ణముల రశ్ముల సంఖ్య 60. కుల సంఖ్య 360. వ నుండి స వరకు ఉన్న నాలుగు వర్ణముల కుల సంఖ్య 90-90 మరియు కుల సంఖ్య 360. హ - క్ష వర్ణముల రాశ్ములు 180-180 మరియు కుల సంఖ్య 360. వీటి సంకీర్ణ రశ్ములు వేరువేరుగా 22(1/2). క నుండి ఠ వరకు ప్రత్యేక రశ్ముల సంఖ్య 300-300. ప్రత్యేక రశ్ములకు 30-30 సంకీర్ణ రాశ్ములు. ప్రత్యేక రశ్ములు 270-270. డ నుండి ఫ వరకు వర్ణముల రశ్ములు 360. ప్రత్యేక సంకీర్ణ రశ్ములు 36-36. వీటి సహజ రశ్ములు 260-260. బ నుండి ల వరకు ఉన్న ఆరు వర్ణముల మూల భూత రశ్ములు 106-106 మరియు సంకీర్ణ రశ్ములు 60-60. వ నుండి స వరకు ఉన్న నాలుగు వర్ణముల ప్రత్యేక రశ్ములు 90-90 మరియు సంకీర్ణ రశ్ములు 90-90. సహజ రశ్ములు 108-108. హ-క్ష మూల రశ్ములు 1108. సంకీర్ణ రశ్ములు 180-180. సహజ రశ్ములు 1630.

పార్థివ రశ్ములు 360, జలరశ్ములు 312, అగ్ని రశ్ములు 372, వాయవ్య రశ్ములు 324, ఆకాశ రశ్ములు 432 మరియు మానస రశ్ములు 384. ఈ విధమైన రశ్మి జ్ఞానము వలన సాధకుడు సాక్షాత్తు పరమశివుడవుతాడు. అతడిని మించిన మంత్రవీర్యుడు, ప్రకాశకుడు భూమిమీద వేరొకడు ఉండడు. ఇది రహస్యమునకే రహస్యము. ఇది ఎవ్వరికీ ఇవ్వరానిది. ఇవ్వడం వలన సిద్ధి లభించదు. ఇది పరమేశ్వరుని ఆజ్ఞ.

పార్థివ మంత్రముల ప్రయోగము స్తంభన కర్మలకు, జల వర్ణముల మంత్రములు శాంతి ప్రయోగములకు, తైజస వర్ణముల మంత్రములు వశీకరణ మంత్రములకు, ఆకాశ వర్ణ మంత్రములు ఉత్తమకార్యములకు, వాయవ్య వర్ణమంత్రములు ఉచ్ఛాటన కర్మలకు ప్రశస్తములు. మానస మంత్రములు మోక్షదాయకములు. ఇందు శాక్త మంత్రము చైతన్యమవుతుంది. ఈ మంత్ర పరిపూర్ణ జ్ఞానము గురువు నుండి గానీ శాస్త్రము నుండి గానీ తెలుసుకొని ఆరోహణ - అవరోహణ క్రమములో రశ్ముల న్యాసము చెయ్యడం వలన తక్షణమే మంత్రసిద్ధి కలుగుతుంది. రశ్మి న్యాసము చేయకుండా ఏ సాధకుడు మంత్ర సిద్ధి గురించి ప్రయత్నిస్తాడో అతడికి నూరుకోట్ల కల్పముల వరకు కూడా సిద్ధి లభింపదు. కాళీ మతమునందు చెప్పబడిన రశ్ములు సిద్ధిదాయకములు.

కాది మతము - షట్చక్రగత రశ్ములు

స్వరహీన మరియు ఏడు హ్రస్వముల స్వరాన్విత వర్ణములను పార్థివ వర్ణములంటారు. వీటి కుల సంఖ్య 35. దీర్ఘయుక్త రశ్ములు 70. అవి బిందు-విసర్గలచేత శుద్ధి అయ్యి మొత్తం 15 అవుతాయి. అయిదు స్వరయుక్త పార్థివ రశ్ములు 300. ఉదాత్త-అనుదాత్త-స్వరితములు 15. ఇవి బిందు-విసర్గ చేత శుద్ధి అయ్యి 45 అవుతాయి. ఇవి మూలాధార పృద్ధ్వీ స్థానమునందు 360 రశ్ములు.

జలాశ్రయ మణిపూర రశ్ములను సంకీర్ణములంటారు. స్వాధిష్ఠాన అగ్నిస్థానము అనాహత వాయు స్థానము, విశుద్ధి ఆకాశ స్థానములందు ప్రత్యేకంగా 360 రశ్ములుంటాయి. మానస స్థానమైన ఆజ్ఞాచక్రమునందు హ-ళ-క్ష వర్ణములుంటాయి. హ్రస్వ, దీర్ఘ స్వరముల చేత యుక్తమై ఈ సంఖ్య 45 అవుతుంది. ఇవి తిరిగి స్వానునాసిక - అనునాసికల చేత 90 అవుతాయి. ఇవి బిందు-విసర్గ యుక్త ఉభయాత్మక రశ్ములచేత 360 అవుతాయి. స్వరముల భాగముల చేత పార్థివ రశ్ములు ఆరు ప్రకారములుగా ఉంటాయి. ప్రత్యేక వర్ణముల రశ్ములు 22(1/2).

కాది 12 వర్ణముల రశ్ములు ఆరు విధములు. ప్రత్యేక వర్ణముల రశ్ములు 60 మరియు కుల సంఖ్య 360. డ నుండి ఫ వరకు ఉన్న పది వర్ణముల ప్రత్యేక పార్థివాది రశ్ములు 36 మరియు వాని కుల రశ్మి సంఖ్య 360. బ నుండి ల వరకున్న ఆరు వర్ణముల పార్థివాది రశ్ములు 60-60 మరియు వీని కుల రశ్ములు 360. వ నుండి స వరకున్న నాలుగు వర్ణముల పార్థివాది రశ్ములు 90-90 మరియు కుల రశ్ములు 360.

హ - క్ష వర్ణముల రశ్ములు 180-180. కుల సంఖ్య 360. ఈ విధముగా 2180 సంకీర్ణ రశ్ములు షట్చక్రములందుంటాయి. కుల సంకీర్ణ రశ్ముల సంఖ్య 12960. ఆరు సంధులకు పైన, క్రింద 8640 సంకీర్ణ రశ్ములు ఉంటాయి. జల రశ్ములు 2180. మూల భూత రశ్ములు 43200. ముందు చెప్పబడిన రశ్ములు సగం సూర్య రూపము మిగిలినవి చంద్ర రూపము.

కంఠమునందుండు విశుద్ధి చక్రమునందు స్వర మరియు భూతవర్ణములు 3-3 ఉండునని తంత్రాంతరమునందు చెప్పబడెను. వీటి రశ్ములు 300-300. రెండవవాటిలో 5-5 విసర్గలు. మానస 300 మరియు అన్య 14 ఉంటాయి. కాది మొదలగు వాయు వర్ణములందు 105 రశ్ములు ఉంటాయి. రెండవదానిలో 5-5, 9-9 వాయు రశ్ములు ఉంటాయి. ఆగ్నేయ 3 వర్ణములందు 105 మరియు రెండవడానిలో 5-5, 9-9 ఆగ్నేయ రశ్ములు ఉంటాయి. భూమివర్ణములందు 125 మరియు మిగిలిన 12 వర్ణములలో క్రమముగా 10-10 జలరశ్ములుంటాయి. రెండు ఆకాశవర్ణములందు ప్రత్యేకంగా 125 మరియు మిగిలిన వాటిలో 10-10 రశ్ములు ఉంటాయి.

డ నుండి ఫ వరకు ఉన్న పదివర్ణములందు భూతరశ్ములు 150-150 ఉంటాయి. మిగిలిన 8 వర్ణములందు 12(1/2) రశ్ములుంటాయి. బ నుండి ల వరకున్న వర్ణ షటకములందు వేరువేరుగా ధరావర్ణములుంటాయి. ధరాంశువులందు 108 మరియు మిగిలిన వాటిలో 10-10 రశ్ములుంటాయి. భాది భూతవర్ణములందు 300 రశ్ములుంటాయి. మిగిలిన 3 వర్ణములందు ప్రత్యేకంగా 20 రశ్ములుంటాయి. వ నుండి స వరకుగల నాలుగు వర్ణములందు జల రశ్ములుంటాయి. వీటి సంఖ్య 150-150. మిగిలిన వాటిలో 20-20 ఉంటాయి. ద్వితీయములో 150 మరియు రెండవవాటిలో 70-70 ఉంటాయి. మూడవ నాభస రశ్ములందు చాలా ఎక్కువ ఉంటాయి. హ యొక్క వాయవ్య రశ్ములు 300 ఉంటాయి. క్ష యొక్క నాభస రశ్ములు 60 మరియు అగ్నిరశ్ములు 300.

హ రశ్ములు 60 మరియు అగ్ని రశ్ములు కూడా 60. రశ్మిక్రమము యొక్క వర్ణన సాధకుల హితముకోరి చెయ్యడం జరిగింది. ఇవి సాధకుల యోనికి సమానముగా గోపనీయము. శిష్యులు కానివారికి, భక్తులు కానివారికి వీటిని తెలుపరాదు. ఒకవేళ తెలియపరిచితే సిద్ధికి హాని కలుగుతుంది. ఇది పరమేశ్వరి ఆజ్ఞ. గురువు నుండి లేదా శాస్త్రముల ద్వారా ఈ జ్ఞానమును సాధించిన సాధకుడు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడవుతాడు.

స్వరములు 16 మరియు స్పర్శలు 25. దశ వ్యాపకములు సోమ-సూర్య-అగ్ని స్వరూపములు. ఇవి క్రమముగా కామ-ధన-ధర్మ ప్రదాయకులు. ఈ తత్త్వ త్రయాత్మకలు భూః, భువః, స్వః స్వరూపములు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరరూపములైన ఈ వర్ణములు సృష్టి, స్థితి, సంహారకారకములు. ఇవి స్వర్గ, పృద్ధ్వి, పాతాళ రూపములు మరియు ఆది, మధ్య, అంతర రూపములు.

ఇంకాఉంది...


కామెంట్‌లు లేవు: