సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

5, అక్టోబర్ 2020, సోమవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - తృతీయశ్వాస - 02

 

శ్రీవిద్యా మాతృకా నిరూపణ

ఇప్పుడు మాతృకా మంత్రరూప జగద్ధాత్రి వర్ణన చేయబడుచున్నది. దీని వలన మంత్రము యొక్క న్యాస-పూజ-జపములు సౌకర్యవంతమవుతాయి. విశేషంగా కాలీమత సాధకుల గురించి అయిదు రకముల కళలను యాభైవర్ణములనుండి ఉద్దరించబడినవి.


స్వరజాకలా: వివృత్తి - ప్రతిష్ఠా - విద్యా - శాంతి - ఇంధికా - దీపికా - రేచకా - మోచికా - సూక్ష్మాసూక్ష్మ- అమృత - జ్ఞాన - మృత - ఆప్యాయినీ - వ్యాపిని -వ్యోమరూప - అనంతా (మొత్తం 16)

కచవర్గకలా: సృష్టి - ఋద్ధ్వి -  స్మృతి - మేధా - కాంతి - లక్ష్మీ - ధృతీ - స్థిరా - స్థితి - సిద్ధి  (మొత్తం 10)

టతవర్గకలా: జరా - పాలినీ - శాంతి - ఐశ్వర్య - రతి - కామికా - వరదా - హ్లాదినీ - ప్రీతి - దీర్ఘా (మొత్తం 10)

పయవర్గజాకలా: తీక్షణా - రౌద్రీ - భయా - నిద్రా - తంద్రీ - క్షుధా - క్రోధినీ - క్రియా - ఉత్కారీ - మృత్యు (మొత్తం 10)

షవర్గోథ్యకలా: పీతా - శ్వేతా - అరుణా - అసీతా - అనంతా

స్వరజాకలా (చంద్రకలలు)* : అమృతా - మానదా - పూషా - తుష్టి - పుష్టి - రతి -ధృతి - శశినీ - చంద్రికా - జ్యోత్స్నా - కాంతి - శ్రీ - ప్రీతి - అంగదా - పూర్ణా - పూర్ణామృతా - కామదాయినీ (మొత్తం 17). (ఇంతకు ముందు చెప్పినవి, ఇవి వేరు వేరు)

సౌరఠాంత కలా: తపినీ - తాపినీ - ధూమ్రా - మరీచి - జ్వాలినీ - శుచి - సుషుమ్నా - భోగదా - విశ్వా - బోధినీ - ధారిణీ - క్షమా (మొత్తం 12). ఇవి ధనధాత్రులు.

ఆగ్నేయకలా:  ధూమ్రా - అర్చి - ఊష్మా - జ్వలినీ - జ్వాలినీ - విస్ఫులింగినీ - సుశ్రీ - సురూపా - కపిలా - హవ్యకవ్యవాహ. (మొత్తం 10) ఇవి ధర్మప్రదములు.

* ప్రీతి-అంగదా కలలను ఒక్కటిగా (ప్రీతిరంగదా) చెబితే 16 సోమ కలలు అవుతాయి. సోమ, సూర్య, అగ్నికలలు సాధకునికి ఫలప్రదములు.

శ్రీకంఠ మాతృకలు

శ్రీకంఠ - అనంత - సూక్ష్మ - త్రిమూర్తి - అమరేశ్వర - భారభూతీశ - తిధీశ - స్థాణు - హర - ఝండీశ - భౌతిక - సద్యోజాత - అనుగ్రహేశ్వర - అక్రూర - మహాసేన| ఈ పదహారూ స్వరమూర్తులు

క్రోధీశ - చండీశ - పంచాంతక - శివోత్తమ - ఏకరుద్ర - కూర్మ - ఏకనేత్ర - చతురానన - అజేశ - సర్వ - సోమేశ - లాంగలీశ - దారుక - అర్ధనారీశ్వర - ఉమాకాంత - ఆషాఢీ - దండీ - అద్రి - మీన - మేష - లోహిత - శిఖీ - ఛగలాండ- ద్విరండ - మహాకాల - కపాలీ - భుజంగేశ - పినాకీ - ఖడ్గీశ - బక - శ్వేత - భృగు - నకులీ - శివ - సంవర్తక| ఇవి వ్యంజన మూర్తులు

రుద్రశక్తి మాతృకలు 

పూర్ణోదరి - విరజ - శాల్మలీ - లోలాక్షీ - వర్తులాక్షీ - దీర్ఘఘోణ - సుదీర్ఘముఖీ - గోముఖీ - దీర్ఘజిహ్వా - కుండోదరి - ఊర్ధ్వకేశీ - వికృతముఖీ - జ్వాలాముఖీ - ఉల్కాముఖీ- శ్రీముఖీ - విద్యాముఖీ| ఇవి స్వరశక్తులు

మహాకాలీ - సరస్వతి - సర్వసిద్ధ - గౌరీ - త్రైలోక్యవిద్య - మంత్రశక్తి - ఆత్మశక్తి - భూతమాత - లంబోదరి - ద్రావిణీ - నాగరీ - ఖేచరీ - మంజరీ - రూపిణీ - వీరిణీ - కాకోదరీ - పూతనా - భద్రకాళీ - యోగినీ - శంఖిని - గర్జిని - కాలరాత్రి - కుర్దినీ - కపర్దినీ - వజ్రికా - జయా - సుముఖీ - రేవతీ - మాధవీ - వారుణీ - వాయవీ - రక్షోవిదారిణీ - సహజా - లక్ష్మీ - వ్యాపినీ - మహామాయా|

ఇవి రుద్ర శక్తులు. రుద్రుని రంగు ఎరుపు. అతని హస్తమునందు త్రిశూలము, కపాలము ఉంటాయి. రుద్రుని పీఠము మీద ఉన్న శక్తులు సిందూర వర్ణమును కలిగి ఉంటాయి. వీరి చేతులందు ఎర్రని కమలము మరియు త్రిశూలము ఉంటాయి.

కేశవ మాతృకలు

కేశవా - నారాయణా - మాధవా - గోవిందా - విష్ణు - మధుసూదన - త్రివిక్రమ - వామన - శ్రీధర - హృషీకేశ - పద్మనాభ - దామోదర - వాసుదేవ - సంకర్షణ - ప్రద్యుమ్న - అనిరుద్ధ| వీరు స్వరమూర్తులు

చక్రి - గదీ - శాఙ్గి - ఖడ్గీ - హలీ - ముసలీ - శూలధృత - పాశీ - అంకుశీ - ముకుంద - నందజ - నందీ - నారా - నరకజిత్ - హరి - కృష్ణ - సత్య -సాత్వత్ - శౌరి - శూర - జనార్ధన - భూధర - విశ్వమూర్తి - వైకుంఠ - పురుషోత్తమ - బలీ - బలానుజ - బాల - వృషఘ్న - వృషభ - హంస - వరాహ - విమల - నృసింహ| ఇవి వ్యంజన శక్తులు

కేశవ శక్తులు

కీర్తి - కాంతి - తుష్టి - పుష్టి - ధృతి - శాంతి - క్రియా - దయా - మేధా - హర్షా - శ్రద్ధా - లజ్జా - లక్ష్మీ - సరస్వతి - ప్రీతి - రతి - రమా - జయా - దుర్గా - ప్రభా - సత్యా - చండా - వాణీ - విలాసినీ - విజయా - విశ్వ - వినదా - సునందా - స్మృతి - ఋద్ధి - వసుదా - పరా - పరాయణా - సూక్ష్మా - సంధ్యా - ప్రజ్ఞా - ప్రభా- నిశా - అమోఘ - విద్యుతా| ఇవి హరియొక్క కాది మూర్తులు

కేశవాదులు శ్యామవర్ణులు మరియు వారి హస్తములందు శంఖము, చక్రము కలిగి ఉంటారు. వీరి శక్తులు వారి అంకము మీద కూర్చొని దరమందహాస ముఖము కలిగి ఉంటారు.

సూర్య మాతృకలు

సూర్యమూర్తులు విద్యుత్తు సమానమైన ప్రభలను చిందిస్తూ కమలము మరియు అభయ ముద్రలను కలిగి ఉంటారు.

రవి - ప్రభాకర - భాస్వాన్ - ద్యుమణి - పూషణ - భగ - ఆదిత్య - అర్క - వేదమూర్తి - కర్మసాక్షి - దివాకర - మిత్రా - అర్యమా - ఉష్ణరశ్మి - ద్వాదశాత్మ - విభాకర | ఇవి స్వర మూర్తులు

సూర - సూర్య - విభావసు - అహస్కర - అరుణ - వ్రఘ్న - భాస్వాన్ - సప్తతురంగం - హరిదశ్వ - గ్రహాధీశ - మార్తాండ - భాను - అవ్యయ - వికర్తన - సహస్రాంశు - మిహిర - మిత్ర - మాఠర - కర్మసాక్షి - జగన్నేత్ర - తరణి - పద్మినీప్రియ - చండాంశు - పింగల - దండ - గభస్తి - ఘృణి - అంశుమాన్ - ప్రద్యోతన - జగచ్చక్షు - తపన - లోకబాంధవ - హంస - తమోహంస - త్రయీమూర్తి | ఇవి వ్యంజన శక్తులు

సూర్యుని యాభై శక్తులు

విద్యా - పుష్టి - ప్రజ్ఞా - సినీవాలీ - కుహూ - రుద్రవీర్య - ప్రభానంద - పోషణీ - ఋద్ధిదా - శుభా - కాలరాత్రి - మహారాత్రి - భద్రకాళీ - కపాలినీ - వికృతీ - దండముండినీ - ఇందుఖండా - శిఖండినీ - నిశుంభశుంభమథినీ - మహిషాసురమర్ధినీ - ఇంద్రాణీ - శంకార్ధశరీరిణీ - నారీ - నారాయణీ - త్రిశూలినీ - పాలినీ - అంబికా - హారిణీ - సమృద్ధి - వృద్ధి - పింగళాక్షి - విశాలాక్షి - మాయా - సంజ్ఞా - వసుంధర - శ్రద్ధా - స్వాహా - సుధా - భిక్షా - దేవకీ - కమలాసనా - త్రిలోకధాత్రీ - సావిత్రీ - గాయత్రీ - త్రిదశేశ్వరీ  - సురూపా - బహురూపా|


ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: