సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, సెప్టెంబర్ 2020, సోమవారం

మహామనుస్తవం - 7

 

    దుర్గమమంతర్ధ్వాంత ప్రాకారం విహసితేన భిందంతీ|

    ముఖమండలభా యస్యాః కురుతే స్వచ్ఛాంతరానిమానస్మాన్||

శ్రీమాత యొక్క అత్యద్భుతమైన చిరునగవు భేదింపశక్యము కాని గట్టి కోటవంటి మన అంతర అంధకారమును ధ్వంసం చేసి, ప్రకాశవంతమైన ఆమె ముఖ బింబము మన హృదయమును పరిశుద్ధము గావించుచున్నది.


అజ్ఞానమే అంధకారము. ఈ అంధకారము దేవునికి, జీవునికి మధ్యన ఒక గోడలాగా అడ్డుగా ఉంటుంది. ఈ గొడనే భేదింపశక్యము గాని గట్టి కోట అని చెప్పబడినది. ఈ అజ్ఞాన అంధకారము శ్రీమాత యొక్క అత్యద్భుతమైన సాటిలేని చిరునవ్వునుండి వెలువడు వెలుగుల వలన పోతుందని తెలియబడుచున్నది.

అమ్మవారి నవ్వునుపాసించడము వలన మనసు రాగరహితము అవుతుంది. అలా రాగరహితమైన మనస్సు ఆనందమునకు స్థానము అవుతుంది. ఆ ఆనందము ముఖమున ద్యోతకమవుతుంది. ఆనందమే బ్రహ్మము. ఆనందం బ్రహ్మేతివ్యజానాత్ అని వేద వచనం కదా. ఇక్కడ కొన్ని శ్రీవిద్యా ఉపాసనా రహస్యములు గలవు. అమ్మ నవ్వును ఎప్పుడు మనము చూడగలము? మనము ఆమె వైపు బుడిబుడి అడుగులు వేస్తూ ఆమెను చేరడానికి ప్రయత్నిస్తే అప్రయత్నంగానైనా ఆమె మనలను క్రింద పడకుండా తనవైపుకు నడిపిస్తుంది. ఆ బుడిబుడి నడకలే సాధన. సాధన ద్వారా అజ్ఞానము తొలగి జ్ఞానము సిద్ధిస్తుంది. విజ్ఞులు గమనించగలరు.

శ్రీలలితారహస్యనామములలోని మందస్మితప్రభాపూర మజ్జత్కామేశ మానసా అను నామము సదా స్మరణీయము.

శ్రీ గణపతిముని గారు తమ ఉమాసహస్రమున అమ్మవారి నవ్వును కీర్తిస్తూ ఎన్నో శ్లోకాలు రచించారు.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: