అవిచిన్వన్ దేవపథం యదయం నీతో యదుఛ్చయేత్ యయా|
జనమిమమజ్ఞమవంతి
విజ్ఞా సా త్రిపురసుందరీ విద్యా||
ప్రజ్ఞానఘన రూపిణి అయిన అమ్మ ఏమీ తెలియని అజ్ఞానిని, అతడు ఏమీ అడగపోయినా
అకస్మాత్తుగా, దైవికముగా అతడిని రక్షిస్తూ ఆధ్యాత్మిక సాధనా
మార్గంలోకి నడిపించింది.
ఇక్కడ శాస్త్రిగారు తనను తాను అజ్ఞానిగా చెప్పుకున్నారు. అది
ఆయన గొప్పతనము మరియు వినయశీలత. కర్మ పరిపక్వము చెందక, సాధన భ్రష్టుపట్టిపోయి జీవితము
చాలించిన సాధకులను అమ్మ ఎప్పుడూ విడవదు. ఆ జీవుడు (సాధకుడు) తన తర్వాత జన్మలో ఆ సాధనను
కొనసాగిస్తాడు. అలా కొనసాగించడానికి శ్రీమాత ఆ జీవుడిని అతడి చిన్నతనము నుండి ఆ సాధనా
మార్గము వైపుకి నడిపిస్తుంది. ఇదే విషయాన్ని భగవానుడు ధ్యానయోగంలో 37వ
శ్లోకమునుండి 45వ శ్లోకమువరకు విశదీకరించెను. శాస్త్రిగారి అపరిపక్వ సాధనను కొనసాగించడానికి
వీలుగా శ్రీమాత అతనిని చిన్నతనము నుండే నడిపించెను. దీనికి హేతువు ఇంతకు ముందు చెప్పిన
సూత్రములే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి