కాలీమతము ప్రకారము మంత్ర మేలనము
రుద్రయామలము నందు ఈ విషయము చెప్పబడినది -
రుద్రయామల అనుసారము నక్షత్రచక్ర రచనా విధానము ఈ క్రింది విధముగా ఉంటుంది. దక్షిణం నుండి ఉత్తరము వరకు నాలుగు రేఖలు,
తూర్పునుండి పశ్చిమం వరకు పది రేఖలు గీయగా ఇరవైఏడు కోష్ఠల చక్రము
ఏర్పడుతుంది. అందు కాది నాలుగు, చాది నాలుగు, టాది నాలుగు, తాది అయిదు, పాది
అయిదు, యాది ఎనిమిది వర్గముల అక్షరములను ప్రధమ కోష్ఠము నుండి
ప్రారంభించి ఒకొక్క పంక్తి క్రమంలో రాసి వానిలో అశ్వన్యాది ఇరవైఏడు నక్షత్రములను
లిఖించాలి. ఏ కొష్ఠము నందు సాధకుని ప్రధమ నామాక్షరము ఉంటుందో దాని అంశవర్ణము
తెలుసుకొని అక్కడ ఉన్న నక్షత్రమును సాధకుని జన్మ నక్షత్రముగా తెలుసుకొని అక్కడ
నుండి మంత్ర నక్షత్రము వరకు విచారణ చెయ్యాలి. దీని నుండి
జన్మ-సంపత్తి-విపత్తి-క్షేమ-శత్రు-సాధక-వధ-మైత్రీ-పరమమిత్ర- వీటిని తెలుసుకోవాలి.
కులార్ణవోక్త ప్రకారము జన్మాది నవకములను తెలుసుకొని ఫలనిర్దేశము చెయ్యాలి. ఒకటవ
తార మృత్యు, తృతీయతార ఆయునాశనము,
పంచమతార మృత్యు మరియు సప్తమతార ఘాతకము అవుతాయి. రెండు,
నాలుగు, ఆరు, ఎనిమిది, తొమ్మిది తారలు శుభములవుతాయి. ఈ విధముగా తారాబలము తెలుసుకొని
బుద్ధిమంతులు మంత్రదానము చెయ్యాలి.
నక్షత్రములందు గణభేదములు
అశ్వనీ - మృగశిర - పుష్య - పునర్వసు - హస్త - స్వాతి - అనురాధ
- రేవతి -శ్రవణ నక్షత్రములు దేవతా గణములు. భరణి - రోహిణి - ఆరుద్ర - పుబ్బ - ఉత్తర-పూర్వాషాఢ
- ఉత్తరాషాఢ - పూర్వాభాద్ర - ఉత్తరాభాద్ర నక్షత్రములు మనుష్య గణములు. కృత్తిక - ఆశ్లేష
- మఖ - చిత్రా - విశాఖ - జ్యేష్ఠ - మూల -ధనిష్ఠ-శతభిషం రాక్షస గణములు. సాధకుని
గణమునకు సంబంధించిన మంత్రము ఉత్తమము. దేవ-మానుష మధ్యమము. రాక్షస-దేవతా అధమము. ఈ
విషయములు కులార్ణవము నందు కూడా చెప్పబడినవి.
కులార్ణవము నందు రాశి చక్రము
బాల, గౌర,
ఖుర, శోణ, శామీ,
శోభా, కన్యా రాశులందు క్రమముగా శ-ష-స-హ-ళ-క్ష వర్ణములుంటాయి.
జాతక చక్రములు (రాశి చక్రము) గీసిన విధంగా ఇక్కడ ఒక చక్రమును గీయాలి. ఇందు మొత్తం
12 ఖండములుంటాయి. ఆ ఖండములందు పూర్వఖండముతో మొదలుపెట్టి ప్రదక్షిణ క్రమములో
వర్ణములను లిఖించాలి. కన్య అంశములో శ-ష-స-హ-ళ-క్ష లిఖించాలి. ఖండములందు పూర్వ దిశ
నుండి ప్రారంభించి, ప్రదక్షిణ క్రమములో అంకెలు వేయాలి.
వాటిలో మేషాది రాశుల స్త్తులను తెలుసుకోవాలి. నామ ప్రధామాక్షరముతో ప్రారంభించి
మంత్రము యొక్క ప్రధామాక్షరము వరకు లగ్న, ధన, భ్రాత, బంధు, పుత్ర, శత్రు, కళత్ర, మరణ, ధర్మ, కర్మ, ఆదాయ, వ్యయాల రూపంలో పన్నెండు రాశులుంటాయి.
రాశిచక్ర ఫలము
లక్షసాగరము ప్రకారము వీని ఫలము ఈవిధంగా ఉంటుంది.
నామాక్షరము నుండి మంత్రాక్షరము ఏక, పంచమ, నవమ రాశులు సద్భాంధవులు. దశమ, ద్వితీయ, షష్ట సేవకులు. పదకొండు, మూడు పోషకములు. ద్వాదశ, చతుర్ధ రాశులు
ఘాతకములవుతాయి. (సప్త-అష్టమ రాశుల గురించి చెప్పబడలేదు)
రాశుల వర్ణభేదములు
కర్కాటక-వృశ్చిక-మీన విప్ర రాశులు. సింహా-ధనస్సు-మేషము
క్షత్రియ రాశులు. తుల-కుంభ-మిథున వైశ్య రాశులు. కన్య-వృషభ-మకర శూద్ర రాశులు.
పాంచభౌతిక చక్రము
దక్షిణామూర్తి సంహిత ప్రకారము -
పార్ధివ (పృధ్వి) వర్ణములు: ఉ, ఊ, ఓ, గా, జ, డ, ద, బ, ల, ళ
జల వర్ణములు: ఋ, రూ, ఔ, ఘ, ఝ, ఢ, భ, వ, స
ఆగ్నేయ వర్ణములు: ఇ, ఈ, ఐం, ఖ, చ, ఠ, థ, ఫ, ర, క్ష
వాయవ్య వర్ణములు: అ, ఆ, ఎ, క, చ, ట, త, ప, య, ష
ఆకాశ వర్ణములు: లృ, ల్హు, అం, ఙ, __, ణ, న, మ, శ, హ
శ్రీకులార్ణవము ప్రకారము పృధివి మరియు జలములు మిత్రులు.
వాయు మరియు అగ్ని కూడా మిత్రులు. పృధ్వీ-అగ్ని సమభావములు. జలము-వాయువు సమభావములు.
అపసవ్య క్రమంలో శత్రువులవుతాయి. మిగిలినవన్నీ మిత్రులు. మంత్రములందు పరస్పర
విరుద్ధి సంగతులయితే వాటిని విసర్జించాలి. ఆ మంత్రములు సాధకుడిని నాశనము చేయును.
సిద్ధ-సాధ్యాది శోధన ప్రకారము
కులమూలావతారము ప్రకారము ద్వాదశార చక్రములో నపుంసక వర్ణములను
వదలి, అ నుండి హ వరకు వర్ణములను లిఖించాలి. 12 ఖండములందు 1 నుండి 12 వరకు
అంకెలు వేయాలి. పూర్వాది నుండి గణిస్తే సిద్ధ, సాధ్య, సుసిద్ధ, అరి అను చతుర్వర్గములు స్పష్టమవుతాయి.
వీటిఫలము ఈ విధంగా ఉంటుంది.
1-5-9 సిద్ధ, 2-6-10
సాధ్య, 3-7-11 సుసిద్ధ, 4-8-12
రిపు/అరి/శత్రు అవుతాయి. ఇవి తెలుసుకొని బుద్ధిమంతుడైన గురువు మంత్ర దానము
చెయ్యాలి. వీని ఫలము సిద్ధారి చక్రము నుండి తెలుసుకొనవచ్చును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి