సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 15

 సిద్ధారిచక్ర నిర్ణయము

సిద్ధారిచక్రమును ఈ క్రిందివిధముగా నిర్మించాలి.


1 అకథహ 

2 ఉఙప    

3 ఆకథ

4 ఊచఫ

5 ఓడవ

6 లృఘమ 

7 ఔఢశ

8 ల్హూఞయ

9 ఈఘన

10 ర్హుజభ

11 ఇగధ

12 ఋచభ

13 అఃతస

14 ఐఠల

15 అంణష 

16 ఎటర

 

ఈ చక్రమందు నామప్రధమాక్షరమునుండి మంత్ర ప్రధమాక్షరము వరకు క్రమంగా 1. సిద్ధ 2. సాధ్య 3. సుసిద్ధ 4. శత్రు అవుతాయి.


ఏ నాలుగు కోష్ఠములందు సాధకుని నామ ప్రధమాక్షరము ఉంటుందో దానిని సిద్ధచతుష్టయము అంటారు. ప్రదక్షిణ క్రమములో దాని తర్వాత నాలుగు కోష్ఠములను సాధ్య చతుష్టయము, దాని తర్వాత నాలుగు కొష్టములను సుసిద్ధి చతుష్టయము, ఆ తర్వాత మిగిలిన కొష్ఠములను శత్రుచతుష్టయము అని అంటారు. ఒకవేళ, సాధకుని నామ ప్రధమాక్షరము, మంత్ర ప్రధమాక్షరము ఒకే కోష్ఠములో ఉంటే ఆ మంత్రము సిద్ధ-సిద్ధ అవుతుంది. సాధకుని నామ ప్రధమాక్షర కోష్ఠమునకు రెండవ కొష్ఠమునందు మంత్ర ప్రధమాక్షరము ఉంటే ఆ మంత్రము సిద్ధి-సాధ్య, మూడవ కోష్ఠమందుంటే సిద్ధ-సుసిద్ధ, నాల్గవ కొష్ఠమందుంటే ఆ మంత్రమును సిద్ధారి అంటారు. నామ ప్రధమాక్షరము ఉన్న నాలుగు కోష్ఠములకు తర్వాత కోష్ఠమందు మంత్ర ప్రధమాక్షరము ఉంటే నామ ప్రధమాక్షరమున్న కోష్ఠము నుండి ప్రారంభించి ఇంతకు మునుపు చెప్పిన విధంగానే లేక్కించాలి. ప్రధమ కోష్ఠమందు మంత్ర ప్రధామాక్షరముంటే అది సాధ్య-సిద్ధ, రెండవ కోష్ఠమందుంటే సాధ్య-సాధ్య, మూడవ కోష్ఠమందుంటే సాధ్య-సుసిద్ధ, నాల్గవ కోష్ఠమందుంటే ఆ మంత్రమును సాధ్య-శత్రు అంటారు. ఈ ప్రకారంగానే మూడవ, నాలుగు కోష్ఠములందు మంత్ర ప్రధమాక్షరము ఉంటే ఇంతకు ముందు చెప్పిన విధంగానే విచారణ చెయ్యాలి. మూడవ, నాలుగు కోష్ఠములకు ముందు అనగా ఒకటి, రెండు, మూడు, నాలుగు కోష్ఠములందు మంత్రాక్షరములుంటే ఆ మంత్రము క్రమముగా అరిసిద్ధ, అరిసాధ్య, అరిసుసిద్ధ, అరి-అరి అవుతుంది. దీని తర్వాత క్రింద చెప్పబడిన విధముగా కూడా విచారణ చేయవలసి ఉంటుంది.

1. సిద్ధ-సిద్ధ మంత్రము నిర్ధారిత సంఖ్య జపము చేస్తే సిద్ధి కలుగుతుంది. సిద్ధ-సాధ్య మంత్రమును నిర్ధారిత సంఖ్యకు రెండుసార్లు జపము చేస్తే సిద్ధి కలుగుతుంది. సిద్ధ-సుసిద్ధ మంత్రము నిర్ధారిత సంఖ్యలో సగము జపము చేస్తే సిద్ధి కలుగుతుంది. సిద్ధారి మంత్రము బంధువుల నాశనకారి అవుతుంది. అందువలన ఆ మంత్రమును త్యజించాలి.

2. సాధ్య-సిద్ధ మంత్రము నిర్ధారిత సంఖ్యకు రెండు సార్లు జపము చేస్తే సిద్ధి కలుగుతుంది. సాధ్య-సాధ్య మంత్ర జపము వలన ఎటువంటి ఫలము లభించదు. సాధ్య-సుసిద్ధ మంత్రము కూడా నిర్ధారిత సంఖ్యకు రెండుసార్లు జపము చేస్తే సిద్ధి కలుగుతుంది. కానీ సాధ్య-అరి మంత్ర జపము స్వగోత్రికులను నాశనము చేస్తుంది. కనుక ఈ మంత్రమును కూడా త్యజించాలి.

3. సుసిద్ధ-సిద్ధ మంత్రము నిర్ధారిత సంఖ్యకు సగము జపము, సుసిద్ధ-సాధ్య నిర్ధారిత సంఖ్యకు రెండుసార్లు, సుసిద్ధ-సుసిద్ధ దీక్షామాత్రము చేత సిద్ధిదాయకములు. కానీ, సుసిద్ధ-అరి మంత్రము కుటుంబమును నాశనము చేస్తుంది కనుక త్యజనీయము.

4. అరిసిద్ధ మంత్రము పుత్రునికి, అరిసాధ్యమంత్రము కన్యకి, అరిసుసిద్ధమంత్రము భార్యకి మరియు అరిఅరి మంత్రము స్వయంగా సాధకునికి మృత్యుకారణములవుతాయి. అందువలన ఈ మంత్రములు సర్వదా వర్జనీయములు.

ఉదాహరణ: దేవదత్తుడు తీసుకొనదలచిన మంత్రము యొక్క ప్రధమాక్షరము "ఏ" నామ ప్రధమాక్షరము "దే". ఇది మూడవ కోష్ఠమునందు ఉంటుంది. మంత్ర ప్రధమాక్షరము "ఏ" పదహారవ కోష్ఠమునందు ఉంటుంది. ఈ ప్రకారముగా దేవదత్త నామాక్షరమునుండి మంత్రాక్షరము సుసిద్ధ చతుష్టయములో చతుర్ధ కోష్ఠమునందు ఉంటుంది. ఈ మంత్రము దేవదత్తునికి సిద్ధ-అరి అవుతుంది. కనుక త్యజనీయము.

ఋణ-ధన శోధన ప్రకారము   

తంత్రరాజమునందు ఈ విధముగా చెప్పబడినది - సాధకుని ప్రధమ నామాక్షరము నుండి మంత్రము యొక్క ప్రధమనామాక్షరము వరకు ఉన్న వర్ణములను మూడు భాగములుగా చేసి, స్వర మరియు వ్యంజనములను వేరు చేసి మంత్రాక్షరములను వ్యతిరేకముగా చేస్తే అది అధిక ఋణమవుతుంది. ఆ మంత్రము ఉత్తమం అవుతుంది. సాధకుడు స్వయం ఋణి అయితే ఆ మంత్రము త్యజనీయము. ఇక్కడ యాభై వర్ణాత్మిక మాతృకలలో నామము యొక్క ప్రధమాక్షరము నుండి ప్రారంభించాలి. ముఫైయారు వ్యంజనములనందు పూర్ణమాతృకా మండలమునందు కూడా ఈ విధంగానే విచారణ చెయ్యాలి. మధుమతి మహాదేవి యందు ఋణశోధన విశిష్టమని త్రిపురార్ణవము నందు చెప్పబడినది. కాళీమత మాలిని యందు అంశకాదులు ప్రశస్తములు. ఇక్కడ, మధుమతీ ముఫైయారు వ్యంజనాత్మిక. మహామధుమతి పూర్ణమండల రూపము మరియు మాలిని యాభై వర్ణముల రూపము.

త్రిపురార్ణవమునందు ఈ క్రింది విధంగా చెప్పబడినది -

సాధకుడు మరియు మంత్రము మధ్యనా ఋణత్వము ఏమిటి? పూర్వజన్మలో చేసిన అభ్యాసము వలన కొంత పాపఫలము ఉంటుంది. ఆ పాపము వలన ఫలము లభించదు మరియు సమయము మించి, దేహాంతము చేరును. కనుక ఈ జన్మలో సిద్ధ మంత్రము గురువునుండి ప్రాప్తించినచో సాధకుడు సిద్ధిపొందుతాడు. లక్ష్మీ రూపంలో మంత్రము భోగప్రాప్తమిచ్చును. పూర్వజన్మలో చేసిన జపము వలన ఆ మంత్రమునకు సాధకుడు ఋణపడతాడు. ఇందువలననే సదైవ ఋణవిశుద్ధి కార్యము చెయ్యాలి.

ఇంకాఉంది

కామెంట్‌లు లేవు: