సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, ఆగస్టు 2020, సోమవారం

మహామనుస్తవం 3



మూర్తిమపశ్యమమూర్తేరపి యద్ దేవ్యాఃపురా శిలాశిల్పే|
చేతంత్యథ చేతయన్తీకృపాహి సేతిస్మరామి సుందర్యాః||

పాతరోజుల్లో త్రిపురసుందరీ అమ్మవారి విగ్రహాన్ని చూసినప్పుడు అది విగ్రహంలా కాక, ఒక చైతన్యరూపంగా కనపడి నాయందు ఆ చైతన్యమును ప్రవేశపెట్టినట్టుగా భావన కలిగేది.

ఇది కపిలశాస్త్రి గారి ఒక అద్భుత దర్శనము. ఆయన తిరువొత్తియూర్ లోని త్రిపురసుందరి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొనేటప్పుడు ఆయనకు ఆ విగ్రహము ఒక శిల్పము లాగకాక చైతన్య రూపిణి అయిన అమ్మవారు అక్కడ ఉన్నట్టుగా దర్శించేవారు. అంతేగాక, ఆ చైతన్యము ఆయనలో కూడా ప్రవేశించినట్టుగా అనుభూతి చెందేవారు. శ్రీ శాస్త్రిగారు తన చిన్నతనంలో కలిగిన ఈ అద్భుత దర్శనభాగ్యమును గుర్తుచేసుకొంటున్నారు.

దీనినే శక్తిపాతము అని అంటారు. ఒక సద్గురువు తన సాధనా సంపత్తియైన చైతన్యమును తన్నాశ్రయించిన శిష్యునియందు ప్రవేశపెట్టడమే శక్తిపాతము. అప్పుడు గురువుకు, శిష్యునకు అభేదము కలుగుతుంది. అదేవిధంగా గురువుకు, దేవతకు అభేదము. అనగా, దేవత, గురువు, శిష్యుడు ముగ్గురూ ఒక్కటే. వీరికి భేదము లేదని భావము. చిన్నతనంలోనే అమ్మవారి ద్వారా శక్తిపాతమును కలిగించుకున్న శాస్త్రిగారు ఎంత ధన్యాత్ములో కదా.

ఇంకాఉంది

కామెంట్‌లు లేవు: