మంత్రమేలన ప్రకారము
మంత్రరాజమునందు ఈ విధంగా చెప్పబడినది - త్రిపురా మరియు నిత్యాదేవీల మంత్రములందు అంశకాదులు దర్శనీయము కాదు. కానీ అభిచారాది సిద్ధి గురించి ఇక్కడ ఒక విశేషం చెప్పవలసినది ఉంది. మంత్రము యొక్క మొదటి అక్షరమును నామము యొక్క మొదటి అక్షరముతో గణించాలి. ఆరు, ఎనిమిది, పన్నెండు సంఖ్యవస్తే ఆ మంత్రము యొక్క మొదటి వర్ణము శత్రువు అవుతుంది. దీనితో హితము కలగదు. రాశినామము నుండి నక్షత్రము సప్తమ, పంచమ, తృతీయ అయితే సాధ్య నామము యొక్క అంశమును తెలుసుకొని అనుగ్రహ కర్మ చెయ్యాలి.
నిత్యా మరియు
త్రిపుర మంత్రములకు అంశకాది మంత్ర మేలన ప్రకారము ఆవశ్యకము కాదు. దీని అర్ధము నిత్య
నైమిత్తిక కార్యములందు ఆవశ్యకము కాదు కానీ కామ్యకర్మలందు ఆవశ్యకము. నక్షత్ర, రాశి చక్రము నందు బిందు-విసర్గాంతములను వదలి నాలుగు-నాలుగు అక్షరములను
లిఖించాలి. అశ్వనీ మొదలగు నక్షత్ర చక్రము నందు బిందు-విసర్గ సంయుక్త మూడు-మూడు
అక్షరములను లిఖించాలి. ఈ విధానము మాతృకావర్ణమునందు కూడా చెప్పబడినది.
రాశిచక్ర విచారము
|
|
|
|
|
|
|
|
|
|
|
|
పైవిధముగా లిఖించిన చక్రమున తూర్పుదిక్కు నుండి ప్రారంభించి
ప్రదక్షిణ క్రమములో బిందు-విసర్గ-సకారము వదలి నాలుగేసి వర్ణములను ఆ గడులందు
లిఖించాలి. వాటియందు మేషాది రాశులను క్రమముగా కల్పన చేస్తూ రాశిచక్ర విచారము
చెయ్యాలి.
నక్షత్రచక్ర విచారము
రాశిచక్రము లిఖించిన విధంగానే ఇక్కడ కూడా పన్నెండు గడుల
చక్రము లిఖించి, ఒకొక్క గడియందు మూడేసి వర్ణములను
లిఖించాలి. దేవీ మధుమతి ముఫైయారు అక్షరముల వ్యంజనాత్మకము. దీనిలో బిందు యుక్త
విసర్గయుక్త వర్ణములను కూడా లిఖించాలి. ఈ ప్రకారము ప్రతీ ఖండమునందు తొమ్మిది
వర్ణములు ఉంటాయి. మొత్తం నూటఎనిమిది వర్ణములు. ఇరవైఏడు నక్షత్రములకు నూటఎనిమిది
చరణములు (పాదములు). ఒక రాశియొక్క నవాంశక్రమములో సాధకుడు మహాచక్ర విచారము చెయ్యాలి.
యోగినీ హృదయమునందు కూడా మధుమతి ముఫైయారు వ్యంజనాత్మకమని
చెప్పబడినది. కాది మతము మరియు కాళీమతమునందు వర్ణములు యాభై అని చెప్పబడెను.
రాశి-నక్షత్ర ద్వాదశఖండ చక్రమును ప్రదక్షిణ క్రమములో
గణించాలి.
ఏ ఖండమునందు మంత్రము యొక్క మొదటి అక్షరము ఉంటుందో అక్కడి
నుండి ప్రారంభించి ఏ ఖండమునందు నామము యొక్క మొదటి అక్షరము ఉంటుందో అక్కడవరకు
లెక్కించాలి. లేదా నామాక్షరముతో మొదలుపెట్టి మంత్ర అక్షరము వరకు (మొదటి అక్షరాలు)
లెక్కపెట్టాలి. ఈ రెండు విధములలో ఏ ప్రకారంగానైనా లెక్కపెట్టిన సంఖ్య ఆరు, ఎనిమిది లేదా పన్నెండు అయితే ఆ మంత్రము అభిచార ప్రయోగములందు
ప్రశస్తమవుతుంది. ఈ ప్రకారంగా రాశిచక్ర గణనయందు సప్త, పంచమ, తృతీయ సంఖ్యలైతే ఆ మంత్రమును మిత్రునిగా భావించాలి.
ఇంకాఉంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి