ఇపుడు ఈ సంస్కారములను విస్తారముగా వివరించబడుచున్నవి.
1. జనన: మారేడు లేదా చందనాదిపీఠము మీద కుంకుమాదులతో
పాంచభౌతిక చక్రమును లిఖించి దానిమీద అ నుండి క్ష వరకు మాతృకలను లిఖించి వాటిలో
మాతృకా సరస్వతిని ఆహ్వానించి, పూజించి, మాతృకలను 108 సార్లు జపము చేసి, వాటి మధ్యన సాధకుని
అభీష్టమంత్రము యొక్క స్వర-వ్యంజన-బిందు-విసర్గ సంయుక్తాక్షరములను వేరువేరుగా
ఉద్ధారము చేసి గురువు ఉపదేశించిన మంత్రమును జపము చేయుట జననము.
2. జీవన: పూర్వ ప్రకారముగా ఉద్ధరింపబడిన మంత్రము యొక్క
ఒకొక్క అక్షరమునకు ఓం ను జోడించి 108 సార్లు జపము చేయుట.
ఉదాహరణ: నమఃశివాయ మంత్రమును ఈ విధంగా జపము చెయ్యాలి.
ఓం న ఓం మః ఓం శి ఓం వా ఓం య
3, 4. తాడన, బోధన ఇంతకు మునుపు చెప్పిన విధంగానే చేయాలి.
5. అభిషేకము: పైన జనన లో చెప్పబడిన పీఠముమీద కుంకుమ, గోరోచనాదులచే అష్టదలపద్మనును లిఖించి, కుంకుమాది
ద్రవ్యములతో మంత్రాక్షరములను ఆ పద్మ కర్ణికయందు మొగ్గలమాలతిలాగ లిఖించి, సుగంధ ద్రవ్యములతో కలిపిన జలమును ఆ మంత్రాక్షరములను అముకమంత్రమభిషించామి
అని చదువుచూ 108 సార్లు అభిషేకించాలి.
6. విమలీకరణము: మూలాధారమునందున్న వహ్నిమండలమునందు
జ్యోతిమంత్రమును భావిస్తూ, దానిపైన సంస్కరించవలసిన
మంత్రమును భావిస్తూ, జ్యోతిమంత్రము యొక్క తేజము ఆ మాత్రమును
శుద్దిచేసినట్లుగా భావించాలి. మంత్రము యొక్క ఆణవ, కార్మిక, మాయిక, మలత్రయ, సహజ, ఆగంతుక మాయారూప దోషములను ప్రత్యేకముగా దగ్ధము చెయ్యాలి. భావన చేసిన
మంత్రము విగత మలత్రయమునుండి విముక్తి చెంది నిర్మలమవుతుంది.
జ్యోతిర్మంత్రము నందు ఓం హం రం ఔం అను బీజములుంటాయి.
7. ఆప్యాయనము: తామ్రపాత్రనందు కర్పూరాది సువాసన జలమును
పూరించి ఇంతకు మునుపు చెప్పబడిన పీఠాదుల మీద జ్యోతిమంత్రమును లిఖించి 108 సార్లు ఆ
జలముతో అభిషేకము చేయాలి. ఆ తర్వాత ఆ మంత్ర జలమును కుశలతో సంస్కరించ వలసిన మంత్ర
వర్ణములను వేరువేరుగా ప్రోక్షణ చెయ్యాలి.
8. తర్పణ: తామ్రాది పాత్రనందు మంత్రమును లిఖించి పాత్రను
కర్పూరాది వాసిత జలముతో నింపాలి. మంత్రముతో బాటుగా తర్పయామి అని చదువుతో 108
సార్లు జలాంజలి ఇవ్వాలి.
9, 10. దీపన, గుప ఇంతకు మునుపు చెప్పిన విధముగానే.
కాదిమతమునందు మంత్రదోషము
ఈ విధముగా కాదిమతమునందు మంత్రదోషములు నిరూపించబడ్డాయి.
ఇప్పుడు ఈ దోషముల పరిహార వర్ణమును సాధకుల హితము కొరకై చెప్పబడుచున్నది.
ఇంకాఉంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి