మంత్రములను దోషరహితము చేయు విధానము
శారదాతిలకతంత్రము ప్రకారము, మంత్రముల
దోషములను, మంత్రమును ఆత్మతో జోడించి కుంభకంలో యోనిముద్రను
బంధించి శుద్ధము చెయ్యాలి.
యోనిముద్రాలక్షణం
పశ్చిమాభిముఖలింగమునకు యోనిస్థ అని పేరు. హృదయగ్రంథి బ్రహ్మ
సంస్థానము, స్వయంభూ. ఇది వామవాచకము. ఇతర లింగముల
అంతరాలమున ఉన్న చిద్గ్రంధస్థిత మహాపద్మావనంను యోగపీఠ అంటారు. కదంబ (=?) వక్రబిందురూపము. అక్కడ పరబ్రహ్మరూప సుషుమ్నాధార మండలము ఉంటుంది. కోదండద్వయ
మధ్యన భ్రూమధ్యము ఉంటుంది. దానిపైన నాదము అను పేరుగల ఓడ్యానము ఉంటుంది. అక్కడ
కామరూప శక్తి, శివుడు ఉంటారు. అదే ఆకులము. సహస్రార మహాపద్మము
ఎర్రని కాలువపూవు వలే శోభితమవుతూ ఉంటుంది. అక్కడ నుండి రక్త బిందువులకు
సమానమైనటువంటి వర్షము కురుస్తూ ఉంటుంది. అక్కడ, వ్యాపక యోగము
ద్వారా, మూలాధారమునందు మనస్సును జోడించాలి. గుద మరియు
మేఢమునకు అంతరాలమున స్థితయైన యోనిని చింతించాలి. శాంతిగా ఉన్న యోనిని బన్ధూక
పుష్పవర్ణముగా భావిస్తూ ధ్యానం చెయ్యాలి. ప్రజ్వలితకాలానాల సమానమైన, తటిత్ప్ర కోటిప్రభకు మీదన సూక్ష్మ శిఖా బిందువునందు పరమకల ఉంటుంది.
సాధకుని ఆత్మ దానితో ఏకీకృతమినట్టుగా భావించుకోవాలి. ఆ బ్రహ్మ మార్గము నుండి
లింగభేద క్రమముగా పరమానంద లక్షణము అమృతము వరకు ప్రయాణిస్తుంది. ఆ మార్గము పూర్తిగా
ఎర్రని మార్గముగా అయిపోతుంది. అక్కడ ఉన్న దివ్యకులామృతమును తాగి తిరిగి కులమునకు
వచ్చును. ఆ శక్తి సాధకుని కులమునకు మాత్రాయోగముగానే తిరిగివస్తుంది. అన్యధా కాదు.
ఈ తంత్రము నందు దీనినే ప్రాణము అంటారు. ఆ ప్రాణము లోపల ఉన్నంతవరకు ఉత్తేజముగా
ఉంటుంది. దీనిని ప్రతిదినమూ అభ్యాసము చేస్తీ నిశ్చింతగా జరా-మృత్యు-దుఃఖరూప
భవబంధనాల నుండి ఆ సాధకుడు ముక్తుడవుతాడు. మహాయోని నుండి ఉద్భిజాలైన అన్ని జీవులూ
శివాంతకమందు విలీనమయిపోతాయి. యోనిముద్రా అభ్యాసము ద్వారా ముద్రా బంధము
సిద్ధిపొందుతుంది.
మంత్రముల దశ సంస్కారములు
శారదాతిలక తంత్రము ప్రకారము మంత్రదోషముల నివారణకు పది విధానములు
కలవు. ఈ దశసంస్కారముల వలన మంత్రము సిద్ధిదాయకము అవుతుంది.
1. జనన: మాతృకల మధ్యనుండి ఉద్ధరింపబడడం
2. జీవన: మంత్రవర్ణములలో రెండేసి వర్ణముల మధ్యన ఓం ను
చేర్చి జపము చేయుట
3. తాడన: మంత్ర వర్ణములను భోజపత్రము మీద లిఖించి చందనము
కలిపిన జలమును ఒకొక్క మంత్ర వర్ణము మీద వాయు బీజమైన యం తో చిలకరించడం.
4. బోధన: భోజపత్రము మీద మంత్ర వర్ణములను లిఖించి, ఆ మంత్రవర్ణముల సంఖ్యకు సమానమైన కరవీర (=గన్నేరు) పుష్పాలు తీసుకొని, ఒక్కొక్క వర్ణమును ఒకొక్క పుష్పంతో తాడనం చేయుట. తాడనం చేసేటప్పుడు అగ్ని
బీజము రం ను ఉచ్చరించాలి.
5. అభిషేకము: స్వతంత్ర తంత్రోక్త విధానముగా మంత్రాక్షర
సంఖ్యామీద అశ్వత్థ (=రావి) ఆకులతో నీళ్ళు జల్లుట.
6. విమలీకరణము: మంత్రమును మనస్సునందు చింతించుచూ
జ్యోతిర్మంత్రముతో దగ్ధమైనట్లు భావించగా మంత్రముయొక్క మూడు మాలిన్యములు
నష్టమైపోవును. ఇదియే విమలీకరణము.
7. ఆప్యాయన: అం, హం, రం, అం, త్రాం అను
బీజాక్షరములను జపించిన కుశోదకముతో మంత్ర వర్ణములను ఒక్కొక్క దానిని విధివిధానంగా
ప్రోక్షణ చేయుట.
8. తర్పణ: మంత్రోచ్ఛారణ సహితముగా పాత్రలోకి జలమును విడుచుట.
9. దీపన: ఓంహ్రీంశ్రీం బీజములతో 108
సార్లు మంత్ర జపము
10. గుప్తి: జపము చేసే మంత్రమును ప్రకటించకపోవడం
అన్ని తంత్రములందు గుప్తదశ సంస్కారములు వర్ణించబడినవి. ఎవరి
సంప్రదాయము ప్రకారము వారు ఈ సంస్కారములను చేసి సాధన చేస్తే ఆ సాధకుని వాంఛితఫలములు
తీరుతాయి.
ఇంకాఉంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి