సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

22, జూన్ 2020, సోమవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 8



నారాయణీయ మంత్ర ప్రబోధకాలము
తారాంత మరియు విసర్గాంత మంత్రములు ఆగ్నేయములు. మిగిలినవి సౌమ్యములు. ఇవి అన్నీ క్రూర మరియు సౌమ్య కర్మములందు ప్రయుక్తములవుతాయి. ఆగ్నేయమంత్రములు నమోన్విత ప్రశస్తములు. ఫట్కారా మంత్రములు సౌమ్యములు. పింగళా నాడి నుండి శ్వాస జరిగే సమయ్మున మంత్రము ఆగ్నేయము అవుతుంది. ఇడా నాడి నుండి శ్వాస జరిగే సమయమున మంత్రము సౌమ్యము అవుతుంది. పింగళా-ఇడా నాడుల రెండింటి నుండి శ్వాస జరిగే సమయమున మంత్రము ప్రబుద్ధమవుతుంది. అన్ని ప్రబుద్ధ మంత్రములు సాధకులకు ఫలప్రదాయకములు.

వృహన్నారాయణీయము
ఇందు ఈ విధంగా చెప్పబడినది - సుప్త మరియు ప్రబుద్ధ మంత్రములు సిద్ధిప్రదాయకములు కావు. ఇడా శ్వాస నుండి మంత్రము సుప్తమవుతుంది. పింగళా శ్వాస సమయమున మంత్రము జాగృతమవుతుంది. ఆగ్నేయ మంత్రము మంత్రము సౌమ్య మంత్రమునాకు విపరీతమవుతుంది. ప్రబోధకాలమునందు రెండు మంత్రములూ జాగృతమవుతాయి. మంత్రము సుప్తమయితే అది అది అనర్ధదాయకమవుతుంది.

శివ యామళే
మంత్రముతో బిందు సహితముగా "న" నుండి "ల" వరకు మరియు సవిసర్గ స్థానమునందు క్షకారం సంపుటీకరణ చేస్తే ఆ మంత్రము ప్రబుద్ధిదాయకమయ్యి శీఘ్రముగా సిద్ధిని ప్రసాదిస్తుంది.

కాళీమతము, శారదాయామలమునందు మంత్రదోషములు

మంత్రదోషము మరియు బాహ్యాంతర భేదము, దోషములు ఏ మంత్రము ద్వారా పరిహారమవుతాయో సాధకుల హితముకొరకై ఇక్కడ చెప్పబడుచున్నది.
ఛిన్నాది దోషములుగల మంత్రములు సాధకులకు ఉపయుక్తము కావు. మంత్ర దోషములు ఈ క్రింది ప్రకారము ఉంటాయి.
ఛిన్న(=ఛేదింపఁబడినది): ఏ మంత్రమునకు ఆది, మధ్యమ మరియు అంతమునందు వాయు బీజమైన యం ఉంటుందో మరియు ఆ బీజము సంయుక్త లేక వియుక్త లేక మూడు, నాలుగు లేక అయిదుసార్లు స్వరాక్రాంతమయితే ఆ మంత్రము ఛిన్నమవుతుంది.

రుద్ధ్వ: ఏ మంత్రమునకు ఆది, మధ్య మరియు అంతమునందు భూ బీజమైన లం రెండుసార్లు వుంటుందో ఆ మంత్రము రుద్ధమవుతుంది. అది ముక్తి వివర్జితమవుతుంది.

శక్తిహీన: ఏ మంత్రము మధ్యన హ్రీం, త్రితత్త్వ ఫ్రేం, హూం, ఓం, శ్రీం, ఫం ఉండవో ఆ మంత్రము శక్తిహీనమవుతుంది.

పరాఙ్ముఖ (=పెడమొగము): ఏ మంత్రమునకు ముందర క్లీం, నమః, స్వాహా, క్రోం ఉండవో ఆ మంత్రమును పరాఙ్ముఖ అంటారు.    

వధిర: ఏ మంత్రమునకు ఆది, మధ్యమ మరియు చివర హం, ఐం, ద్రాం ఉంటాయో ఆ మంత్రము వధిర అవుతుంది.

నేత్రహీన: పంచాశ్వర మంత్రములందు రేఫ, లుం,O, హం, ఐం ఉండవో అవి నేత్రహీనమంత్రములు. అవి దుఃఖ,శోక మరియు భయప్రదములవుతాయి.

కీలిత: ఏ మంత్రమునకు ఆది, మధ్యమ, చివరన మ,,,,,హౌం,ఐం,హం,,,,ఫ్రేం,హ్రీం,హూం,నమామి ఉండవో ఆ మంత్రమును కీలిత మంత్రము అంటారు.
స్తంభిత: ఏ మంత్రమునకు మధ్యన ఒక ఫట్, చివరన రెండు ఫట్లు,,,ల ఉండవో ఆ మంత్రములు స్తంభితములయి సిద్ధిరోదకములవుతాయి.

దగ్ధ: ఏ మంత్రము మూర్ధయందు యం,రం ఏడుసార్లు ఉంటాయో ఆ మంత్రమును దగ్ధ అంటారు.

త్రస్త: ఏ మంత్రాక్షరములందు రెండు, మూడు, ఆరు, ఎనిమిది ఫట్ లు ఉంటాయో ఆ మంత్రములను త్రస్తములంటారు.

భీత: ఏ మంత్రమునకు ముందు "ఓం" ఉండదో ఆ శివ లేదా శక్తి మంత్రమును భీతి అంటారు.

మలిన: ఏ మంత్రమునకు ఆది-మధ్యమ-అంతమున మణిచతుష్టయము ఉండునో, మంత్రజ్ఞులద్వారా అవి వివర్జితములు.

నిరస్కృత: ఏ మంత్రమునకు మధ్యన డకారము, హుంకారము చివర రెండు ఫట్ లు ఉంటాయో ఆమంత్రము నిరస్కృత అవుతుంది.

భేధిత: ఏ మంత్రమునకు ప్రారంభమున రెండు ఓంకారములు, మధ్యన వషట్, ఫట్ ఉంటాయో ఆ మంత్రము భేధిత అవుతుంది.

సుషుప్త: ఏ మంత్రమునందు మూడు అక్షరములుండి మధ్యన "హంస" ఉండదో ఆ మంత్రము సుషుప్త అవుతుంది.

మదోన్మత్త: ఏ మంత్రమునందు పదిహేడు కన్నా ఎక్కువ అక్షరములుండి, అయిదు ఫట్లు ఉంటే ఆ మంత్రము మదోన్మత్త అవుతుంది.

మూర్ఛిత: ఏ మంత్రమునకు మధ్యన ఫట్ ఉంటుందో అది మూర్చిత మంత్రము.

హ్యతవీర్య: ఏ మంత్రమునకు అంతమున గం ఉంటుందో అధి హ్యతవీర్య అవుతుంది.

హీన: పద్దెనిమిది అక్షరముల మంత్రమునకు ఆది-మధ్యమున-అంతమున నాలుగు ఫట్ లుంటాయో ఆ మంత్రము హీన మంత్రము.

ప్రధ్వస్త: పంతొమ్మిది అక్షరముల మంత్రమునందు ఓం,హ్రీం,క్రోం ఉంటే ఆ మంత్రమును ప్రధ్వస్త అంటారు.

బాలక: సప్తాక్షర మంత్రమును బాలక మంత్రమంటారు

కుమార: అష్టాక్షర మంత్రమును కుమార మంత్రమంటారు

యువ: షోడశాక్షర మంత్రమును యువ మంత్రమంటారు

ప్రౌఢ: నలభై అక్షరముల మంత్రమును ప్రౌఢ మంత్రమంటారు

వృద్ధ: ముఫై, అరవైనాలుగు, వంద, నాలుగువందల అక్షరముల మంత్రములను వృద్ధమంత్రములంటారు.

నిస్త్రింశక: ఓంకార సహితా నవాక్షారమంత్రమును నిస్త్రింశక మంత్రమంటారు.

నిర్బీజ: ఏ మంత్రమునకు చివర నమః, మధ్యన శిరోమంత్రక స్వాహా, వషట్, హూంఫట్, ఫట్ ఉండునో, హం మరియు క్లీమ్ ఉండవో ఆ మంత్రము నిర్బీజ మంత్రము.

సిద్ధిహీన: ఏ స్థానమునైనా ఆరుఫట్కారములుంటే ఆ మంత్రము సిద్ధిహీనమవుతుంది.

మంద: ఏ మంత్రమందు యం ఉంటుందో అది మంద మంత్రము.

నిరంశక: కూట ఏకాక్షర మంత్రమును నిరంశక అంటారు.

సత్త్వహీన: రెండు వర్ణముల మంత్రము సత్త్వహీనమవుతుంది.

కేకర: నాలుగు వర్ణముల మంత్రము కేకరవుతుంది.

బీజహీన: ఆరు అక్షరముల మంత్రము బీజహీనమవుతుంది.

ధూమిత: ఏడున్నర, ఆరున్నర వర్ణముల మంత్రమును ధూమిత లేదా నిందిత అంటారు.

ఆలింగిత: మూడున్నర, ఇరవైఒక్కటి,ఇరవై, ముఫై అక్షరముల మంత్రము ఆలింగిత.
మోహిత: ఇరవై రెండు వర్ణముల మంత్రము మోహిత.

క్షుధార్త: ఇరవైనాలుగు, ఇరవైఏడు వర్ణముల మంత్రము క్షుధార్త.

దృప్త: ఇరవైనాలుగు, పదకొండు, ఇరవైఐదు, ఇరవైమూడు వర్ణముల మంత్రము దృప్త అవుతుంది.

అంగహీన: ఇరవైయారు, ముఫైయారు, ఇరవైతొమ్మిదివర్ణముల మంత్రము అంగహీన.

అతికృద్ధ: ఇరవైఎనిమిది, ముఫైఒక్కటి అక్షరముల మంత్రము అతికృద్ధ. ఇది అన్ని కర్మములందూ నిందితము.

అతిక్రూర: ముఫై, ముఫైమూడు వర్ణముల మంత్రము అతిక్రూర. ఇది అన్ని కర్మములందు నిందితము.

సవ్రీడ: నలభై నుండి అరవీమూడు వర్ణముల వరకు గల మంత్రము సవ్రీడ.

శాంతమానస: అరవైఐదు అక్షరముల మంత్రము శాంతమానస.

స్థానభ్రష్ట: అరవైఅయిదు నుండి తొంభైతొమ్మిది అక్షరముల మంత్రము స్థానభ్రష్ట.

వికల: పదమూడు మరియు పదిహేను అక్షరముల మంత్రము వికల.

అతివృద్ధ: నాలుగువందల నుండి వెయ్యి అక్షరముల వరకు ఉన్న మంత్రములు అతివృద్ధ.

నిఃస్నేహ: నూరు, నూటయాభై, రెండువందలతొంభై, మూడువందలు అక్షరములు కల మంత్రమును నిఃస్నేహ అంటారు.

పీడిత: వెయ్యికన్నా ఎక్కువ అక్షరములున్న మంత్రము.
                                                                            ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: