మంత్రములందు బ్రహ్మ క్షత్రాది భేదములు
మంత్రములు బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర మరియు సంకర జాతులవుతాయి. వర్ణానుసారము
అనులోమక్రమములో మంత్రములను ఇవ్వవలెను. కొన్ని మతముల ప్రకారము ప్రతిలోమ క్రమమునందు
మంత్రములను ఇవ్వవలెను.
వామకేశ్వరము నందు కూడా ఈవిధముగానే చెప్పబడెను.
సౌత్రామణితంత్రము ప్రకారము
సౌత్రామణి తంత్రమునందు ఈ విధముగా చెప్పబడినది. మాయా బీజము
"హ్రీం" బ్రహ్మజాతి. శ్రీ బీజము "శ్రీం" క్షత్రియ జాతి.
కామదేవ మంత్రము "క్లీం" వైశ్య జాతి. వాగ్భవ బీజము "ఐం" శూద్ర
జాతి. ఏ మంత్రమునందు ఈ నాలుగు బీజములుండునో ఆ మంత్రమును పౌరస్త్య (=మొదటిది) మంత్రము అని అంటారు. బ్రాహ్మణులకు నాలుగు బీజములును, క్షత్రియులకు మూడు బీజములును, వైశ్యులకు రెండు
బీజములను మరియు శూద్రులకు ఒక బీజమును ఇవ్వవలెను.
కులమూలావతార ప్రకారము
కులమూలావతారమునందు ఈ విధంగా చెప్పబడినది - శ్రీదేవి
శంకరునితో చెప్పినది - హే శంకరా! శాక్త, శైవ, సౌర, గాణపత్య మరియు వైష్ణవ మంత్రములందు బ్రాహ్మణ, క్షత్రియాది వర్ణులకు విశేషంగా సంకరులకు, ప్రవృత్తి
సాధకుల హితము కొరకై వినడానికి ఇచ్ఛ ఉంటుంది. వారికి ఏఏ మంత్రములు హితమో తమరు
చెప్పాలి.
ఈశ్వర ఉవాచ:
ఉమాదేవీ-
ఉమా, మహేశ్వర, దక్షిణామూర్తి, అఘోర, హయగ్రీవ
మరియు అష్టాక్షర వారాహీ మంత్రములు శ్రేష్ఠములు.
ప్రణవాద్య వాసుదేవ, లక్ష్మీ
నారాయణ మంత్రములను మూడు వర్ణముల వారికి ఇవ్వవచ్చు. శూద్రులకు ఈ మంత్రములను
ఇవ్వరాదు.
పాశుపత, నారసింహ మరియు సుదర్శన
మంత్రములు రెండు వర్ణములకు మాత్రమే ఇవ్వవలెను. వేరొకరికి ఈ మంత్రములు ఇవ్వరాదు.
అగ్నిమంత్రము,
కుచ్ఛసూర్యమంత్రము, ప్రణవసహిత ఘృణిమంత్రము మూడు వర్ణముల
వారికీ ఇవ్వవచ్చు.
అనుష్టుభ శక్తి మంత్రము,
వింధ్యవాసినీ, నీలాసరస్వతీ మంత్రములు కూడా మూడు వర్ణముల
వారికి ఇవ్వవచ్చును. మాతంగీ, ఉగ్రతార,
శ్యామ, ఛిన్నమస్త మరియు బాలా మంత్రములను అన్ని వర్ణముల
వారికీ ఇవ్వవచ్చు.
తారా, గణేశ,
హరిద్ర గణేశ మంత్రములు మూడు వర్ణముల వారికీ ఇవ్వవచ్చు. ఈ మంత్రములు సర్వాసిద్ధి
ప్రదాయకములు.
త్రిపుర, వటుకాది మంత్రములు అన్ని
వర్ణముల వారికి ఇవ్వవచ్చు మరియు విశేషంగా స్త్రీలకు ఇవ్వవచ్చు.
హ్రీం, శ్రీం,
ఓం, ఐం మరియు అన్యబీజ సంయుక్త మంత్రములను బ్రాహ్మణులకు, హ్రీం, శ్రీం, ఓం, ఐం సంయుక్త మంత్రములను క్షత్రియులకు, శ్రీం, ఐం బీజమంత్రములను వైశ్యులకు, ఐం మరియు అన్యబీజములను
శూద్రులకు ఇవ్వవచ్చును. హృదాది 'హృం',
ఫట్కారాది మంత్రములు సంకరులకు ప్రశస్త్యములు.
కులప్రకాశతంత్రము ప్రకారము మంత్రముల లింగ నిర్ణయము
యాభై వర్ణముల భేదము చేత అన్ని మంత్రములూ ఉత్మన్నమయ్యాయి.
మంత్రవిద్యా విభాగము నుండి అన్ని మంత్రములూ రెండు రకములుగా ఉంటాయి. స్వాహాంత
మన్త్రములు స్త్రీ మంత్రములుగాను, నమోన్త మంత్రములు నపుంసక
మంత్రములుగాను చెప్పబడును. మిగిలిన మంత్రములు పురుష మంత్రములు. స్త్రీ మంత్రములు
శాంతికర్మములందు, నపుంసకమంత్రములు ప్రయోగవిద్వేషణ మరియు
అభిచారవిధులయందు ప్రయోగయుక్తములు. పురుష మంత్రములు సర్వావశీకరణ మరియు ఉచ్చాటన
కర్మలందు ప్రయుక్తములు. అన్ని మంత్రములూ అగ్నిషోమాత్మకములు. రేఫ, ఓంకార, వియతయుక్త మంత్రములు ఆగ్నేయ, క్రూరకర్మ, మారణాది కర్మలందు ప్రయుక్తములు.
సౌమ్యమంత్రములు సుధాత్మకములు మరియు సౌమ్య కర్మలందు ప్రయుక్తములు.
ఇంకాఉంది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి