కాదిమతమున
యంత్రోద్దారము మరియు గురుమండల పూజ
కాదిమతమునందు
గురుమండలమును ఈక్రింది విధముగా శ్రీపర్ణి (మారేడు) పత్రమునమీద గానీ శుద్ధ, ధృడ,
మనోహర భూతలమునందు గానీ నిర్మించాలి.
ఈశాన
|
పూర్వ
|
ఆగ్నేయం
|
||||||||
అం
|
కం
|
ఖం
|
ఝం
|
ఞ్౦
|
టం
|
దం
|
ధం
|
నం
|
||
గం
|
ఘం
|
ఙ0
|
ఠ
|
డం
|
ఢం
|
పం
|
ఫం
|
బం
|
||
చం
|
ఛం
|
జం
|
ణం
|
తం
|
థమ్
|
భం
|
మం
|
యం
|
||
రం
|
లం
|
వం
|
అం
|
కం
|
ఖం
|
రం
|
లం
|
వం
|
||
ఉత్తర
|
శం
|
షం
|
సం
|
గం
|
ఘం
|
ఙ0
|
శం
|
షం
|
సం
|
దక్ష
|
హం
|
ళమ్
|
క్షం
|
చం
|
ఛం
|
జం
|
హం
|
ళమ్
|
క్షం
|
||
దం
|
ధం
|
నం
|
ఝం
|
ఞ్౦
|
టం
|
అం
|
కం
|
ఖం
|
||
పం
|
ఫం
|
బం
|
ఠ
|
డం
|
ఢం
|
గం
|
ఘం
|
ఙ0
|
||
భం
|
మం
|
యం
|
ణం
|
తం
|
థమ్
|
చం
|
ఛం
|
జం
|
||
వాయవ్య
|
పశ్చిమ
|
నైరుతి
|
దీనినే నవనాధ మండలము
అని అంటారు. ప్రకాశానంద, విమర్శానంద, ఆనందానంద, జ్ఞానానంద,
సత్యానంద, పూర్ణానంద, స్వభావానంద, ప్రతిభానంద, సుభగానంద - వీరు నవనాధలు. వీరి
పూజాక్రమము ఈ క్రింది విధంగా ఉంటుంది.
ఐం హ్రీం శ్రీం
ప్రకాశానందనాథ అం కం ఖం గం ఘం ఙ0 చం ఛం జం శ్రీ పాదుకాం
పూజయామి - మధ్యకోష్టే
ఐం హ్రీం శ్రీం విమర్శానందనాథ ఝం ఞ్౦ టం ఠ౦ డం ఢం ణం తం థ౦
శ్రీ పాదుకాం పూజయామి - పశ్చిమే
ఈ విధముగా దక్షిణావృత క్రమంలో మధ్య-పశ్చిమ-వాయు-ఉత్తర-ఈశాన-పూర్వ-ఆగ్నేయ-దక్షిణ-నైరుతి కోష్ఠములందు పైన చెప్పిన నవనాథులను వరసక్రమంలో పూజించాలి.
పూజను నాథవృత్తక్రమంలో నాథ నామమును బట్టి ఆ రోజు ఏ నాథుడో ఆనాథుని రోజుని బట్టి
చెయ్యాలి.
గంధ, పుష్ప,
ధూప, దీప, నైవేద్య, తాంబూల, నమస్కార, స్తోత్రపాఠ
ఉపచారములతో పూజించాలి. ఐక్యభావనతో నాథులను సంతుష్ఠలను చేయాలి. మధ్యనాథుని సుముఖమున
శ్రీగురుని పూజించాలి. నామాది గురుక్రమమును అనుసరించి విద్వాన్ నవగురువులను
పూజించాలి. వీరికి బయట శివాది గురుమండలమును పూజించాలి. ఈ పూజ పంక్తి క్రమములో
ప్రదక్షిణంగా భక్తి భావంతో చెయ్యాలి.
ఈ వింధంగా పర్వదినములలో రాత్రిపూట ఈ పూజ చెయ్యాలి.
గురునామమునకు పాదుకాం పూజయామి అని చేర్చి పూజ చెయ్యాలి. నాథ దినమునకు తాంత్రియక
పంచాంగము చూడవలెను. పౌర్ణమి వంటి పర్వదినములందు ఈ పూజ చేయుట ఉత్తమము.
జీవించి ఉన్న గురువునకు నాథ అని చెప్పాలి. మృతగురువునకు శివ
అని చెప్పాలి. ఈ విధంగా ఏ సాధకుడు నిత్యం గాని, విశేష
పర్వదినములందు గాని పూజ చేస్తాడో అతని దీక్ష శుభదాయకం అవుతుంది. అన్యథా
అశుభమవుతుంది.
పూర్ణాభిషిక్తుని పూజా విశేషము
పూర్ణదీక్షాపరుని గురుచరణకమలముల పూజ పూర్వదినములందే గాక షోడశి
పూజానంతరము చందన, కేశరి,
ఉసిరి, కస్తూరి, కర్పూరము అను సుగంధ
పంచకములతో గురుమండలమును లిఖించి పూజ చెయ్యాలి. ఈ విధంగా భక్తి భావముతో పూజ అయిన
తరువాత సుగంధిపంచకముల లేపనము సాధకుని మస్తకమునందు ధరించాలి. దీనివలన ఆయుష్షు, సంతతి, విజయము, ఆరోగ్యము
ప్రాప్తిస్తాయి.
విద్యాసిద్ధి కొరకు గురుస్తోత్ర పాఠము
నమస్తే నాథ
భగవాన్ శివాయ గురురూపిణే|
విద్యావతార
సంసిద్ధ్యై స్వీకృతానేక విగ్రహా|
నవాయ నవరూపాయ
పరమార్ధైకరూపిణే|
సర్వాజ్ఞాన
తమోభేద మానవే చిద్ఘనాయతే|
స్వతంత్రాయ
దయాక్లుప్త విగ్రహాయ పరమాత్మనే|
పరతంత్రాయ
భక్తానాం భవ్యానాం భవ్య రూపిణే|
వివేకినాం
వివేకాయ విమర్శాయ విమర్శనాం|
ప్రకాశినాం
ప్రకాశాయ జ్ఞానినాం జ్ఞానరూపిణే|
పురస్తాత్
పార్శ్వయోః పృష్టే నమస్కుర్యాముపర్యధః|
సదామచ్చిత
రూపేణా విధేహి భవదాసనం|
గురుస్తోత్ర పాఠఫలం
విద్యాసిద్ధి కొరకు ఈ పాఠమును నిత్యం పఠించాలి. చక్రమునందు
దేవతల పేరు చెప్పిన తర్వాత "శక్తి", గురు
పేరుకు నాథ (జీవించి ఉన్న గురువునకు), మృత గురువునకు శివ అని
జోడించాలి. గురువులు మూడు ప్రకారముగా ఉంటారు. గురుమండలమునందు వీరి స్మరణము ఈ
ప్రకారముగా చెయ్యాలి. వీరు గురు, పరమగురు మరియు పరమేష్ఠీ
గురు అను త్రివిధ రూపములు. పరంపరను అనుసరించి గురుస్మరణ చెయ్యాలి. పరంపర జ్ఞానము
వలన సంప్రదాయము స్థిరమవుతుంది. సంప్రదాయము స్థిరమవుతే ఆ సాధకుడు సంప్రదాయ
వర్తకుడవుతాడు. దీనివలన దేవత, విద్య,
మంత్రము తక్షణం సిద్ధిపొందుతాయి. పురశ్చరణ కాలమందు గురుమండల పూజ నిత్యము చెయ్యాలి.
ఏ సాధకుడికి సంప్రదాయ జ్ఞానము, మంత్ర వీర్య సంస్మృతి ఉండదో
అతడు ఏ రకంగా సాధకుడవుతాడు. నిత్య, నైమిత్తిక మరియు
నిత్యకామ్య రెండూ ప్రాప్తి చెందాలంటే ప్రసిద్ధ మూడుఅనుక్రమముల వలన సిద్ధి
కలుగుతుంది. గురుపరంపర జ్ఞానము గురువునుండి తెలుసుకొని తన శిష్యులకు ఆ జ్ఞానమును
పంచాలి. గురువు, ఆత్మ మరియు తను ఐక్యమనే భావనలో ఉండాలి.
గుర్వాజ్ఞను మనసా, వాచా, కర్మణా ఏ
సాధకుడైతే పాటిస్తాడో అతడు ఉత్తముడవుతాడు.
ఇంకాఉంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి