సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

24, మార్చి 2020, మంగళవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ప్రధమశ్వాస - 10


గురుయంత్ర పూజ:

సాధకునికి ముందు ఉన్న త్రికోణములో శ్రీనాథాది గురుత్రయం పూజ చెయ్యాలి. వీరిపక్కన చక్రాధిష్టాన దేవత గణేశుని పూజించి ఆ తర్వాత ద్వితీయావరణ పూజ చెయ్యాలి. ద్వితీయావరణము సాధకుని ముందున్న కోణమున ప్రారంభించి కామరూప, జాలంధర, పూర్ణగిరి పీఠముల పూజ చెయ్యాలి. ఆ త్రికోణమునకు మధ్యన ఓఢ్యానపీఠమును పూజించాలి. కామరూపమునకు కుడివైపున ద్వితీయచక్రాధిష్ఠాన దేవత అయిన భైరవునికి భైరవ మంత్రంతో పూజ చెయ్యాలి. వీరి కుడివైపున చక్రనాథుడైన వటుకుని పూజించాలి. నవకోణమునందు సాధకుని ముందు నుండి ప్రారంభించి ప్రదక్షిణ క్రమంలో విద్యావతారగురువుల పూజ చెయ్యాలి. వీరి ముందున కుడివైపున  "సిద్ధేభ్యో నమః" అను మంత్రంతో సశక్తి సిద్దౌఘ పూజ చక్రాధిష్ఠాన రూపంలో చెయ్యాలి. అష్టదళమునందు సాధకుని ముందు దళమునుండి ప్రారంభించి ఎనిమిది దూతీల పూజ చెయ్యాలి. వీరి ప్రారంభమున దక్ష-వామ భాగమునందు రక్త, శుక్ల పదద్వయమును వారి మంత్రములతో మూడు వృత్తములందు పూజ చెయ్యాలి. వీరి పూజ వామావర్త క్రమంలో సిద్ధి కోసం చెయ్యాలి. ఇందు నూటడెభైయారు వీరేశమండల పూజ జరుగుతుంది. గురుపూజన మంత్రములో చెప్పినట్టుగానే బీజసహితముగా వీరేశ పాదుకాం పూజయామి అని చెప్పాలి. ఈ విధంగా నూటడెభైయారు వీరేశుల పూజ చెయ్యాలి. సాధకునికి ముందున మధ్య వృత్తమునందు శాంభవుని పూజ వాని మంత్రముతో భక్తి పూర్వకముగా చెయ్యాలి. సప్తమావరణ మాలినీ చక్రమునకు ప్రథమ రేఖనందు బ్రాహ్మీ మొదలగు అష్టమాతృకలను పూజించాలి. ఆ తర్వాత ద్వితీయ రేఖను ఐదు భాగములుగా విభజించి భూతముల పూజను వాని మంత్రములతో చెయ్యాలి. ఇందు ఇరవైనాలుగు వర్ణ దేవతల పూజ జరుగుతుంది. తృతీయరేఖనందు ఇంద్రాది దశ దిక్పాలకుల పూజ చెయ్యాలి. రేఖకు బయట వారి అస్త్రములను పూజించాలి. సాధకుని ముందు భాగమున విశ్వవిగ్రహామాలినీ పూజ భక్తి సహితముగా మంత్రముతో పీఠము నందు చెయ్యాలి. ఈ ప్రకారముగా పూజ చేస్తే దేవి నిశ్చయముగా ప్రసన్నురాలవుతుంది.

కులతిథులందు గురుమండల పూజ

సరిసంఖ్య తిధులు - ద్వితీయ, చతుర్ధి మొదలగు తిధులందు, సరిసంఖ్య నక్షత్రములు భరణి, రోహిణి మొదలగు నక్షత్రముల యోగము ఏ శుక్రవారము, మంగళవారములందు  కలుగునో ఆ శుభదినమున రాత్రికాలమున గురుమండల పూజ చెయ్యాలి. అలా పూజ చేసిన సాధకుని దీక్ష ఉత్తమము అవుతుంది. ఆ సాధకుడు సంప్రదాయకుడు మరియు గురువు అవుతాడు. అతడు సాక్షాత్ దేవీ స్వరూపుడు అవుతాడు. అతని దీక్ష శుభమంగళము అవుతుంది. అన్యథా నిష్ఫలమవుతుంది. అంతేకాదు గురువు, శిష్యుడు ఇద్దరూ నాశనమవుతారు. అందువలన కులతిధులందు సాధకుడు ఈ పీఠశక్తులను పూజించాలి.

గురుమండల పూజయందు అష్టదూతియలు

సుందరి, సుముఖి, విరూప, విమల, అంతరి, బదరి, దూతరి, పుష్పభద్రిక.

గురుమండల పూజయందు పీఠశక్తులు

ఉపాస్యుని మహావిద్య పీఠశక్తులు గురుమండలమందు తెలియబడతారు.

మాలినీ మంత్రము

ఐం హ్రీం శ్రీం హ్ఫ్రేం హ్సౌం తం ఫం అం రం హం హ్రీం మాలిన్యై నమః

శాంభవ విద్య

ఐం హ్రీం శ్రీం హ్ఫ్రేం హ్సౌం తం ఫం అం రం హం హ్రీం మాలిన్యై నమః హ్సౌం హ్స్క్ఫ్రేం శ్రీం హ్రీం ఐం ఓం

ఇంకాఉంది

కామెంట్‌లు లేవు: