సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, ఫిబ్రవరి 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ప్రధమశ్వాస - 5


కాలీమతానుసారము లోపాముద్ర గురుక్రమము

దివ్యౌఘః - శ్రీవిద్యానందనాథ, పరశంభునాథ, పరమాత్మ
సిద్దౌఘః - స్వప్రకాశ, భగీరథ, విరూపాక్ష
మానవౌఘః - జ్ఞానానంద, ఆచలానంద, యోగానంద
పైన చెప్పబడిన గురుక్రమమునే గాక క్రింద చెప్పబడిన గురు క్రమమును కూడా పాటించాలి.
దివ్యౌఘః - కుముద, కమల, సుభోజ
సిద్దౌఘః - ఆత్రేయ, భార్గవ, గౌతమ
మానవౌఘః - శౌనక, వసుద, సురధ
వీరి పూజా మంత్రము ఈ విధంగా ఉంటుంది:
ఓం ఐం హ్రీం శ్రీం కుముదానందనాథ శ్రీపాదుకాం పూజయామి నమః|
పంతొమ్మిది అక్షరములు కలిగిన ఈ మంత్రములు సాక్షాత్ విష్ణుస్వరూపములు.
గమనిక: ఈ పంతొమ్మిది అక్షరముల మంత్రములు పైన చెప్పిన రెండవ గురుక్రమమునకు వర్తించును.

దీక్షా గురుక్రమము
దీక్షాగురువుల పూజ తొమ్మిది వరుసల క్రమంలో చెయ్యాలి. వీరు -
కపిల, అగస్త్య, అనసూయ, అత్రి, లోపాముద్ర, వశిష్ఠ, సనక, సనంద, భృగు, సనత్సుజాత, వామదేవ, నారద, గౌతమ, శునక, శక్తి, మార్కండేయ, కౌశిక, పరాశర, శుక, అంగిరా, కణ్వ, జాబాలి, భరద్వాజ, వేదవ్యాస, ఆదిత్య, మహాదేవ, వాగానంద, వామదేవ, రతీదేవ, అనంత, యోగ, ధరాధవ, సుహస్త, సత్యసంధ, బ్రహ్మానంద, భైరవ, దత్తానంద, కుంతీ, చిద్ఘన, సోమ, గౌరవ, త్రిపురేశ, మహాబాహు, క్రోధన, శివాంబిక, విద్యానంద, గుణానంద, గౌరీష, విబుధ, హర, భూతేశ, సోమనాథ, సర్వజ్ఞ, సరస, హరి, గౌడ, పావక, పరాశర, సత్యనిధి, రామచంద్ర, గోవింద, శంకరాచార్య.

మను ఉపాసిత విద్యావతార గురు క్రమం:
దివ్యౌఘః - మహాదేవ, పరాంబా, కూర్మేశ
సిద్దౌఘః - సద్యోజాత, కుమార, భూతేశ
మానవౌఘః - ప్రియానంద, లీనా, అఘోర

కులమార్గ సాధకుల గురుక్రమం ఈ క్రింది విధంగా ఉంటుంది.
దివ్యౌఘః - పూర్ణేశ, శంకర, ప్రగల్భ
సిద్దౌఘః - భౌతిక, త్రిదశ, పరమ
మానవౌఘః - విద్యేశ, వాసవ, యతీశ
విద్యావతార గురువులను గగనాంబుజము నందు స్మరించుకోవాలి. ఈ గురు క్రమము ఈ క్రింది విధంగా ఉంటుంది.
దివ్యౌఘః - పరప్రకాశ, పరవిమర్శక, కామేశ్వరి, మోక్ష, అమృత, పురుష, అహోర
సిద్దౌఘః - శివరూపిణి, ప్రకాశ, సదానంద, ఉత్తమ
మానవౌఘః - ఉత్తర, పరమ, సర్వజ్ఞ, సర్వసిద్ధ, గోవింద, శంకర, మానవోఘ - ఈ ఏడుగురూ దీక్షగురువుల సంతతి.
శ్రీదేవి యొక్క పృష్ఠ భాగమునందు వరుస క్రమములో వీరి పూజ జరుగుతుంది.

దీక్షా గురు క్రమము
శంకరుని తర్వాత సాధకుని గురుమండల పూజ చేయవలెను. ఈ క్రమము -
కపిల, అత్రి, వశిష్ఠ, సనక, సనంద, భృగు, సనత్సుజాత, వామదేవ, నారద, గౌతమ, శునక, శక్తి, మార్కండేయ, కౌశిక, పరాశర, శుక, అంగిర, కణ్వ, జాబాలి, భరద్వాజ, వేదవ్యాస, పరేశ, విద్యేశ, త్రిపుర, విజయ, హర, కామేశ, త్రిపురాంత, పురుష, పరమ, హరి, గాలవ, ముద్గర, శౌరి, పరమాత్మ, ధనేశ్వర, ధనంజయ, భాస్కర, భల్లాట, విభావసు, జీవనాథ, గోరక్ష, మత్స్యనాథ, సదాశివ, గురుభక్త, జీతక్రోధ, బోధానంద, సురేశ్వర, భైరవ, సచ్చిదానంద, కృనీశ, కరుణాకర, శ్రీకర, వేదమూర్తి, సర్వేశ, దుర్లభ, వశీ, నాగదేవ, క్షమానాధ, భావేశ, కేశవ, నందీశ, గణప, వీర, దుర్జయ, మిహిర, ప్రియ, గౌడ, పావక, పరాశర, సత్యనిధి, రామచంద్ర, గోవింద, శంకరాచార్య.
ఈ గురువులను స్మరించి, పూజించితే సాధకులు సిద్ధిదాయకులు అవుతారు.

...ఇంకాఉంది

కామెంట్‌లు లేవు: