కాదిమత గ్రంధములు
కాదిమతములో
విఖ్యాతములైన గ్రంధములు నాలుగు. అవి తంత్రరాజ తంత్రము, మాతృకార్ణవము, త్రిపురార్ణవము మరియు యోగినీహృదయము. వీటిలో తంత్రరాజ గ్రంధము సుదర్లభము
(దొరుకుటలేదు)
ఇవి కాక, కాళీశక్తి మతము కూడా
ప్రసిద్ధమైనది.
ఈ రెండు మతముల
పరిజ్ఞానమును అందించుటకై శంకరుడు మానవ శరీరమును ధరించెను.
ఈ రెండు మతముల
సమన్వయముతోనే ఉర్ధ్వామ్నాయమును క్రమబద్ధీకరించబడినది. గురువు చూపిన మతానుసారముగా
సాధక శ్రేష్ఠులు సాధన చేయవలెను. మతములను కల్తీ చేయరాదు. అలా చేసినచో సిద్ధి కలగదు.
కామరాజ విద్య కొరకు
కాళీమతానుసారము గురుక్రమమును తెలుసుకొని ఉపాసన చెయ్యాలి. ఈ మతము యొక్క గురుక్రమము
క్రింద చెప్పబడుచున్నది.
కామరాజ విద్యయందు
కాళీమత గురుక్రమము:
ఈ మతమునందు తొమ్మిది
గురువులు కలరు. వారు,
ప్రహ్లాదానందనాథ, సనకానంద, వశిష్ఠానందనాథ, కుమారానంద,
క్రోధానంద, శుకానంద, ధ్యానానంద, బోధానంద, సురానంద.
కులగురువుల ధ్యాన
మంత్రము:
అన్ని కుల గురువులు
ద్వినేత్రులు,
ద్విభుజులు. చేతులందు వర మరియు అభయ ముద్రలు ఉండును.
దివ్యౌఘః - చిద్రూప, చిన్మయ, చిత్శక్తి
సిద్దౌఘః - ప్రబోధ, సుబోధ,
అనంత
మానవౌఘః - సుధామ, త్రిమూర్తి, ఝింటీస
వీరి మంత్రములకు
ముందు ధృవ(=ఓం),
త్రితారి, ఆనందనాథ, ఆ తర్వాత పాదుకాం
పూజయామి ఉండాలి.
ఉదా: ఓం ఐం హ్రీం
శ్రీం చిద్రూపానందనాథ పాదుకాం పూజయామి|
శివ మరియు శక్తి
మంత్రములు పదిహేడు అక్షరములు కలిగి ఉంటాయి. ఈ మంత్రములతో కూడా పూజ చెయ్యాలి. ఈ
గురు క్రమము:
దివ్యౌఘః -
పరప్రకాశానందనాథ, పరశివానందనాథ, పరాశక్తి,
కౌలేశ, శుక్లదేవీ, కులేశ్వరానందనాథ, కామేశ్వరి.
సిద్దౌఘః - భోగ, క్లిన్న, సమయ, సహజ.
మానవౌఘః - గగన, విశ్వ,
విమల, మదన, భువన,
లీలాంబా, స్వాత్మా, ప్రియానంద.
వీరందరూ
విశ్వవిగ్రహలు. వీరిపూజ దేవీ పూజ అయిన తర్వాత చెయ్యాలి.
వీరి పూజా మంత్రములు
ఈ క్రింది విధంగా ఉండును.
ఉదా: ఓం ఐం హ్రీం
శ్రీం పరప్రకాశానందనాథ పాదుకాం పూజయామి|
స్వగురు క్రమము
కపిలుడు నుండి
వ్యాసుని వరకు ఇరవైఒక్క గురువులు. వారు విద్యాగురుక్రమములో చెప్పబడ్డారు. ఆ తర్వాత
వరుసగా - కరుణ, వరుణ, విజయ, సమర, గుణ, బల, విశ్వంభర, సత్య, ప్రియ, శ్రీధర, శారద, సాకలేశ, విలాస, నిత్యేశ, విశ్వపురుష, గోవింద, విబుధ, సింహ, వీర, సోమ, దివాకర.
అచల, వాగ్భవ, నాద, మోహన, సులభ, శివ, మృత్యుంజయ, వాసుదేవ, శరణ, సనందన, ఆకాశ, గోప్రియ, హర్ష, భర్గ, కామ, మహీధర, ఈశాన, గణప, శ్రీమాన్, కపాల, భైరవ, దివ
గౌడపాద నుండి శంకరుల
వరకు ఏడుగురు విద్యాగురు క్రమములో చెప్పబడ్డారు.
ఈ క్రమంలో ఉన్న
గురువులు సాక్షాత్ శివస్వరూపులు. వీరి శిష్యుల గురించి తెలుసుకొని సాధకుడు తన
స్వగురువు విధించిన విధాన ప్రకారముగా పూజ, తర్పణ, హోమ, జప, న్యాస మొదలగు సాధనా క్రమమును పాటించాలి. ఈ గురుక్రమ స్మరణ వలన సాధకునకు
సిద్ధికలుగుతుంది. ఇందు ఎటువంటి అనుమానము లేదు.
...ఇంకాఉంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి