ఊర్ధ్వామ్నాయ కులగురు
క్రమము:
దివ్యౌఘః - ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత
సిద్దౌఘః - ఆదినాథ, అనాదినాథ, అనామయ, అనంతానందనాథ, చిదాభాస
మానవౌఘః - పరేశ్వర, విశ్వేశ్వర, హంసేశ్వర, సంవర్తేశ్వర,
ద్వీపేశ్వర, నవాత్మేశ్వర
వీరు కులమార్గ
గమనులు. కులమార్గ మంత్రములకు జ్ఞాతులు. వీరు కులాసమునందు ఆసీనులయి కులతంత్ర
పరాయణలగుచున్నారు. మహారసము యొక్క ఉల్లాసముతో తమోగుణమునందు నిమగ్నులై ఉంటారు.
కులగురువులను
ఈక్రింది విధముగా ధ్యానించాలి.
కులగురు ధ్యానం:
1. దశహస్తాః పంచముఖా ముండమాలా విభూషితాః|
ఉద్యత్సూర్య సహస్రాభాః పూర్ణాంతః
కరణోద్యతాః||
2. ఖడ్గం ఖేటం కపాలంచ త్రిశూలం ముద్గరం తధా|
ఖడ్వాంగౌ కరచాపౌచ దధానాశ్చ వరాభయే||
3. తురీయ యామినీయామే కుండలిన్యామ్ మహౌజసీ|
తేవిసర్గదదౌభాగే లాక్షారస సమప్రభే||
4. చింతనీయాః ప్రయత్నేనా విద్యాసంసిద్ధి హేతవే|
ఏతాన్ కులగురూన్ యత్నాన్న చింతియటతి సాధకః||
5. తస్యాపూజా జపశ్చైవ స్నానదానాదికమ్ వృధా|
ఏతాన్ కులగురూన్ ధ్యాయేత్ ఊర్ధ్వామ్నాయ
ఊదీరితాన్||
6. ప్రజ్ఞా విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః|
ఇఛ్ఛా జ్ఞాన క్రియా చైవ కుండలీ మాతృకా పరా||
7. ఏకాదశైతే దివ్యౌఘ ఆదినాధస్తతః పరా|
అచింత్యనాధో చింత్యాచ అవ్యక్త్యో
వ్యక్తికాతతః||
8. కులేశ్వరః కులేశీచ సిద్దౌఘా నాగ సంఖ్యకా|
తూష్ణీసశ్చైవ సిద్ధాచ మిత్రః కుబ్జా తతః
పరం||
9. గగనశ్చాటులీచైవ చంద్ర గర్భ స్తతః పరం|
వాలిభాగీచ ముక్తశ్చ మహిలాలలితస్తతః||
10. శంఖా శ్రీ కంఠసంజ్ఞశ్చ శ్రీ కంఠాచ పరేశ్వరః|
పరేశ్వరీ కుమారశ్చ సహజా రత్న యేవచ||
11. జ్ఞానదేవీ తతో బ్రహ్మ నాదినీ చాప్యజేశ్వరః|
మహిలాచ ప్రతిష్ఠశ్చ సహజా శివ ఏవచ||
12. ప్రతిమాచ చిదానందః సహజాచ తధైవచ|
శ్రీకంఠానంద విద్యోచ శివశ్చ సహజా తతః||
13. సోమశ్చ సజాజా చైవ సంవిచ్చ సహజాతతః|
విబుదో విభుధాచైవ భైరవో భైరవీ తధా||
14. ఆనందో నందినీ చైవ తతః కామేశ్వరాభిధః|
కామేశ్వరీచ కమలః సహజాజిన యుగ్మకాః||
మానవౌఘాః స్మృతా ఏతే
వరాభయకరామ్బుజాః||
విద్యావతార
గురుక్రమము
దివ్యౌఘః - వ్యోమాతీత, వ్యోమేశీ, వ్యోమగా, వ్యోమచారిణీ,
వ్యోమస్థా
సిద్దౌఘః - ఉన్మనా, సమనా,
వ్యాపికశక్తి, ధ్వని, ధ్వనిమాత్రా, అనాహతా, బిందు, పరమబిందు, ఆకాశ
మానవౌఘః - పరమాత్మా, శాంభవ,
చిత్, ముద్రా, వాగ్భవ, లోల, సంభ్రమ, చిత్ప్రసన్న, విశ్వ
విద్యాగురుక్రమం
ఉర్ధ్వామ్నాయ క్రమము
నందు షోడశీ ఉపాసకులు దేవీ పృష్ఠ భాగమందు విద్యావతార గురుక్రమములో చెప్పబడిన ''విశ్వ" తర్వాత నుండి స్వగురు పూజ చెయ్యాలి.
స్వగురు క్రమము
కపిల, అత్రి,
వశిష్ఠ, సనక, సనంద, భృగు, సనత్సుజాత, వామదేవ, నారద, గౌతమ, శునక, శక్తి, మార్కండేయ, కౌశిక, పరాశర, శుక, అంగిర, కణ్వ, జాబాలి, భరద్వాజ, వేదవ్యాస, ఈశాన, రమణ, కపర్ది, భూధర, శుభట, జలజ, భూతేశ, పరమ, విజయ, భరత, పద్మేశ, సుభగ, విశుద్ధ, సమర, కైవల్య, గణేశ్వర, సుపాద్య, విబుధ, యోగ, విజ్ఞాన, ఆనంగ, విభ్రమ, దామోదర, చిదాభాస, చిన్మయ, కలాధర, వీరేశ్వర, మందార, త్రిదశ, సాగర, మృడ, హర్ష, సింహ, గౌడ, వీర, అఘోర, ధృవ, దివాకర, చక్రధర, ప్రమధేశ, చతుర్భుజ, ఆనందభైరవ, ధీర, గౌడ, పావక, పరాశర, సత్యనిధి, రామచంద్ర, గోవింద,
శంకరాచార్య.
శంకరాచార్య శిష్యులు
శంకరాచార్యుల వారికి
ముఖ్య శిష్యులు పద్నాలుగురు. వీరందరూ దేవ్యాత్మన, ధృడాత్మన, నిగ్రహ, అనుగ్రహములు కలిగి ఉండడంలో కడు సమర్ధులు.
1) శంకర, పద్మపాద, బోధ, గీర్వాణ, ఆనందతీర్ధ - ఈ
అయిదుగురు సన్యాసులు
2) సుందర, విష్ణుశర్మ, లక్ష్మణ, మల్లికార్జున,
త్రివిక్రమ, శ్రీధర, కపర్ది, కేశవ, దామోదర - ఈ తొమ్మిది మంది గృహస్థులు.
వీరందరూ మఠాలకు, ఉపమఠాలకు అధిపతులుగా
ఉండేవారు. శంకరాచార్యుల వారి పేరుతో మఠాలను/ ఆశ్రమాలను నిర్వహించేవారు.
దేవ్యాత్మ శంకర
శిష్యులు విశ్వవిఖ్యాతులు.
పద్మపాదుల వారి
శిష్యులు ఆరుగురు. వారు మండల, పరిపావక, నిర్వాణ, గీర్ధన, చిదానంద, శివోత్తమ. వీరందరూ
వివిధ ఆశ్రమాలలో ఉంటూ ధీరులుగా, మౌనులుగా, ఈర్ష్యరహితులుగా ఉండేవారు. ఇప్పటికీ వీరి శిష్య పరంపర ఉన్నారు.
బోధుని శిష్యులు కేరళ
ప్రాంతంలో వివిధ ప్రాంతాలలో విద్యావంతులుగా గుర్తింపు పొందారు.
విద్యానగీర్వాణ, గీర్వాణ శిష్యుడు. అతని
శిష్యుడు విభుదేంద్రుడు. ఇతని శిష్యుడు సుధీంద్రుడు. ఇతని శిష్యుడు
మంత్రగీర్వాణుడు. ఇతనికి చాలా మంది శిష్యులు ఉండేడివారు.
ఆనందతీర్ధుల వారి
శిష్యులు గృహవాసులు. వీరందరూ ఆరాధ్యపాదుకా పీఠ మరియు సంప్రదాయములందు జ్ఞానులు.
సుందరాచార్య శిష్యులు
వివిధ పీఠములకు మహంతులుగా ఉండేవారు. సన్యాసులు మరియు గృహస్థులు ఈ పీఠములందు
ఉండేవారు.
శ్రీ
విష్ణుశర్మ శిష్యులు ప్రగల్భాచార్య పండితులు. ఈయన యొక్క శిష్యులు నా
(విద్యారణ్యయతి) ద్వారా ఈ గ్రంధమును పూర్తి చేశారు.
ఇంకాఉంది...
4 కామెంట్‌లు:
Very Interesting. Interested to read further. Hope lots of Secrets reveal in your future postings which help Upasakas.
Bhuvanananda garu - oka post ki tarwata post ki ila gap ivvakandi please. rojukoka bhagam post cheyyandi please.
అయ్యా! రోజూ ప్రచురించడం కష్టము. నేను స్వయంగా తెలుగులో రాసి, దానిని టైప్ చేసి ఇవ్వడం కష్టమైన పని. అంతేగాక, చదువరులకు కూడా కొంచెం వెసులుబాటు ఇవ్వాలి. చదివింది అర్ధం చేసుకోవడానికి.
Thank you Bhuvananandanatha gaaru.
కామెంట్‌ను పోస్ట్ చేయండి