సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

16, ఏప్రిల్ 2018, సోమవారం

బగళాముఖి




వైశాఖ శుద్ధచతుర్ధి శ్రీబగళాముఖి ఉద్భవించినరోజు సందర్భంగా ఈ దేవతను మనం ఒకసారి స్మరించుకుందాం…

దశమహావిద్యలలో ఒకటైన బగళాముఖిదేవతను కొంచెం తీవ్రదేవతగాను కొంచెం సాత్వికదేవతగాను పరిగణిస్తారు. స్తంబనవిద్యలలో చాలా ప్రాశస్త్యంపొందిన విద్య. ఈ విద్యను అభ్యసించిన మంత్రోపాసకుని ఎదురుగా నిలచి అతనిని వాదనలో ఎవరూ గెలవలేరు. అలా వాదించేవారి వాక్కు, ముఖం, పాదం మొదలగు అంగములు స్తంబించిపోతాయి. బగళాముఖి దేవత స్వయంగా మంత్రోపాసకుని శత్రువుయొక్క నాలిక తన ఎడమ చేతితో లాగి దానిమీద తన కుడిచేతిన ఉన్న గదతో మోది వారికి మాట రాకుండా చేస్తుందని ప్రతీతి.

ఈదేవత పసుపురంగులో ఉంటుంది. ఈ మంత్రోపాసకుడు పసుపురంగు బట్టలు ధరించి పసుపుపూలతో పూజ, హోమం చేసి పసుపుకలిపిన వంటకములను నైవేద్యంగా పెడితే (పులిహోర, పులగం మొదలగునవి) త్వరగా సిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం.
బగళ అన్నశబ్ధం బకల అన్న పదం నుండి పుట్టినట్టుగా తెలుస్తోంది. బకల అనగా కొంగ అని అర్ధం. ఈదేవత ముఖం కొంగముఖంలాగ ఉంటుందని అర్ధమవుతున్నాది. అయితే ఈమె ధ్యానశ్లోకాలలో మాత్రం అలా వర్ణించబడలేదు.

ఈదేవతా ఉపాసన బాహ్యశత్రువుల స్తంబనకేగాక, అంతఃశత్రువుల స్తంబనకు కూడా ఉపయోగించవచ్చు. అయితే నిజమైన సాధకుని లక్ష్యం ఎప్పుడూ అంతఃశత్రువులే అవ్వాలిగాని బాహ్యానికి ఇటువంటి విద్యలను ఉపయోగించుకోకూడదు.

గడచిన సంవత్సరంలోనే దక్షిణభారతదేశంలో ఒక రాజకీయనాయకులు ఈ విద్యాప్రయోగం చేసి కోర్టులందు తమమీద ఉన్న కేసులనుండి తప్పించుకొని ఉన్నతస్థానాన్ని అధిరోహించారు. అయితే అది ఎన్నాళ్ళో నిలవలేదు.

(ఈ సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీన వైశాఖశుద్ధ చతుర్ధి)

కామెంట్‌లు లేవు: